Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Pinnelli Ramakrishna closing arguments on interim anticipatory bail in AP High Court
బాబు సేవలో బదిలీ బలగాలు!

సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి! ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఓ అభ్యర్ధిని కౌంటింగ్‌ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరి తెగించి ఆడుతున్న నాటకానికి తెర పడింది. ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్ది మంది పోలీసులు బాబుకు ఏజెంట్ల మాదిరిగా పని చేస్తున్నట్లు తేటతెల్లమైంది. న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మ యం వ్యక్తమవుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ, టీడీపీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాక్షిగా రుజువైంది. పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్‌ వీడియో ఆధారంగా పిన్నెల్లి అరెస్టుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈనెల 23న సానుకూల ఉత్తర్వులు పొందడం విదితమే. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు కానున్నట్లు అదే రోజు సాయంత్రం కల్లా సంకేతాలు అందడంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులు అడ్డగోలు వ్యవహారాలకు తెర తీశారు. అదే రోజు రాత్రి పిన్నెల్లిపై పాత ఘటనలకు సంబంధించి మూడు వేర్వేరు కేసులు హడావుడిగా నమోదు చేశారు. ఆ ఘటనలు ఎప్పుడో జరిగితే పది రోజుల తరువాత తాపీగా పిన్నెల్లిపై హత్యాయత్నం సహా మూడు కేసులు బనాయించారు. మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను అమలు చేయకుండా ఎన్నికల సంఘం, పోలీసులు ఈ తప్పుడు కేసులు పెట్టారని, వాస్తవానికి పిన్నెల్లిని 23వ తేదీ రాత్రి నిందితుడిగా చేర్చారని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే పోలీసులు తాము 22వ తేదీనే పిన్నెల్లిని నిందితునిగా చేర్చామని పేర్కొనడంతో న్యాయస్థానం ఈ విషయంలో వారిని స్పష్టత కోరింది. లిఖితపూర్వకంగా ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. సంబంధిత డాక్యుమెంట్లను పిన్నెల్లి తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి అధికారికంగా పొందారు. వాటిని సోమవారం కోర్టుకు సమరి్పంచారు. దీంతో పచ్చ ముఠాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పిన్నెల్లిని నిందితుడిగా చేర్చి 23వతేదీ రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది. దీంతో 23న మధ్యంతర ముందస్తు బెయిల్‌ పొందిన తరువాత పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు రుజువైంది. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు నిర్ధారణ కావడంతో కుట్ర కోణం బహిర్గతమైంది. డీజీపీ, పల్నాడులో కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. తీర్పు నేటికి వాయిదా తనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. మంగళవారం తన నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంల కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయగానే పిన్నెల్లిపై పోలీసులు అప్పటికప్పుడు మరో మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు వేశారు. అనుబంధ వ్యాజ్యాలు.. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాల్లో బాధితులు నంబూరి శేషగిరి రావు, నాగ శిరోమణి ఇంప్లీడ్‌ అవుతున్నారని, ఆ మేరకు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని విచారణ సందర్భంగా టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వారి తరఫున తాను వాదనలు వినిపిస్తానని తెలిపారు. అయితే మౌఖిక వాదనలకే పరిమితం కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావును పిన్నెల్లి బెదిరించారని పోసాని పేర్కొన్నారు. నాగ శిరోమణి అనే మహిళను కూడా బెదిరించారన్నారు. కౌంటింగ్‌ రోజు పిన్నెల్లి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు. 23 రాత్రి 8 గంటలకు స్థానిక కోర్టులో మెమో పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇప్పటికే పిన్నెల్లిపై 9 కేసులున్నాయన్నారు. పిన్నెల్లిపై నిఘా ఉంచాలని ఇదే కోర్టు ఈ నెల 23న ఉత్తర్వులిచ్చినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. క్రైం నెం 59లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడు నిందితునిగా చేర్చారు? దీనికి సూటిగా సమాధానం చెప్పాలని పీపీని ఆదేశించారు. సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేరుస్తూ 23వతేదీ రాత్రి 8 గంటల సమయంలో స్థానిక కోర్టులో మెమో దాఖలు చేశామని పీపీ వెల్లడించారు. దీంతో పిన్నెల్లిని 22వ తేదీనే నిందితుడిగా చేర్చామంటూ పోలీసులు చెప్పడం పచ్చి అబద్ధమని తేలిపోయింది. అస్మిత్, చింతమనేనికి ఇచ్చినట్లే.. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పిన్నెల్లి విషయంలో ఎన్నికల సంఘం తీరు వల్ల ఆ సంస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందన్నారు. పిన్నెల్లిపై పలు కేసులున్నాయని పోసాని, పీపీ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్‌రెడ్డిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయని గుర్తు చేశారు. అస్మిత్‌రెడ్డిపై 30, చింతమనేనిపై 31 కేసులు నమోదయ్యాయన్నారు. కేసుల ఆధారంగా ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదంటే వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్‌ రాకూడదన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీరిద్దరికీ ఇదే హైకోర్టు ఈ నెల 23న మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా పిన్నెల్లికి కూడా ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. పోలింగ్‌ కేంద్రం బయట ఒకే ఘటనకు సంబంధించి పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారని, ఒకే నేరానికి రెండు కేసులు చెల్లవని కోర్టుకు నివేదించారు. కౌంటింగ్‌ పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉంది.. కౌంటింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకునే హక్కు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి ఉంటుందని టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్‌ తేదీ సమీపిస్తున్నందువల్ల కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లిపై ఉందన్నారు. కౌంటింగ్‌ వద్ద అభ్యర్థి లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతారన్నారు. చింతమనేని, అస్మిత్‌రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు పిన్నెల్లి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు, ఈవీఎంల కేసులో మధ్యంతర బెయిల్‌ వస్తుందని 23వ తేదీ సాయంత్రం కల్లా గ్రహించడంతో అదే రోజు రాత్రి పిన్నెల్లిపై హత్యాయత్నంతో సహా మూడు కేసులు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు 22నే ఆయన్ను నిందితుడిగా చేర్చామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని నివేదించారు. ఈమేరకు పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల సరి్టఫైడ్‌ కాపీలను పిన్నెల్లి తరఫు మరో న్యాయవాది రామలక్ష్మణరెడ్డి కోర్టుకు సమరి్పంచారు. పోలీసులు దాఖలు చేసిన మెమోను పరిశీలించాలని నిరంజన్‌రెడ్డి కోరడంతో న్యాయమూర్తి దాన్ని పరిశీలించి పిన్నెల్లిని 23వ తేదీనే నిందితుడిగా చేర్చిన విషయాన్ని ధృవీకరించుకున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్ధించారు. విచారణకు అశ్వనీ కుమార్‌ గైర్హాజర్‌.. క్రైం నెంబర్‌ 59 కేసులో సీఐ నారాయణ స్వామి తరఫున అసాధారణ రీతిలో హాజరై ఆదివారం వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ సోమవారం విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన జూనియర్‌ కోర్టు ముందు హాజరై పిన్నెల్లి వ్యాజ్యాల్లో ఇంప్లీడ్‌ అవుతూ ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరు కావడం విస్మయం కలిగించింది. అశ్వనీ కుమార్‌ ఆ పోలీసు తరఫున హాజరు కావడం వెనుక మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ ఉన్న విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని మరింత సాగదీస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావడంతో అశ్వనీ కుమార్‌ సోమవారం విచారణకు గైర్హాజరైనట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. బాబు కుట్రలలో భాగస్వాములు.. చంద్రబాబు కుట్రలో భాగం కావడం వల్లే ఎన్నికల సంఘం, డీజీపీ, కొందరు పోలీసు అధికారులు ఆయన చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కీలకమైన ఓట్ల లెక్కింపు రోజు పోటీలో ఉన్న అభ్యర్ధి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీకి వంతపాడే పోలీసులు అడ్డదారులు తొక్కడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లుగా భావించాలని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. చంద్రబాబు, బీజీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్లుగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి పురందేశ్వరి సూచించిన జాబితాలోని వారిని నియమించడంతోనే అడ్డదారులు తొక్కే వ్యవహారం ప్రారంభమైందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పోలింగ్‌ రోజు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకొనే అవకాశం లేకుండా చేయడంతోపాటు హింస చెలరేగేందుకు దోహదం చేసిందని పేర్కొంటున్నారు. హైకోర్టు సాక్షిగా తాజాగా బయటడిన కుట్ర దీనికి స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.

Sakshi Guest Column On NTR Jayanthi
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!

‘న నిశ్చితాత్‌ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్‌. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్‌ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్‌ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్‌ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్‌ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్‌ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్‌ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్‌ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్‌ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్‌ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్‌.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్‌ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్‌ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్‌ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్‌ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్‌. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్‌. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్‌ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్‌ సతీమణి

Surveillance on BRS leaders too in Phone Tapping Case
బీఆర్‌ఎస్‌ నేతలపైనా నిఘా!

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఆపరేషన్‌ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఆపరేషన్‌ దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్‌ వేయాలని నాటి సీఎం కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్‌ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్‌కు తెలిసింది. బీఆర్‌ఎస్‌ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు ద్వారా కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్‌ను కేసీఆర్‌కు అందించారు. వీటి ఆధారంగా మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌ నగర్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు ప్లాన్‌ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్‌రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను రాధాకిషన్‌రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బిగించారు. రోహిత్‌రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపై ఏర్పాటైన సిట్‌ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేత బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్‌ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్‌ఎస్‌తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్‌కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్‌ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. నాటి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్‌ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్‌ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు. ఫోన్‌ కాల్స్‌కు దూరంగా ఉన్న వారిపై.. ఎస్‌ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్‌ కాల్స్‌కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్‌చాట్‌ తదితర సోషల్‌ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్‌క్రిపె్టడ్‌ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్‌లు (ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ డేటా రికార్డ్స్‌) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్‌–నవంబర్‌ల్లో ట్యాపింగ్‌ మరింత పెరిగింది. నాటి మంత్రి టి.హరీశ్‌రావు సిఫార్సుతో ఐన్యూస్‌ సంస్థ అధినేత శ్రావణ్‌ కుమార్‌ ప్రభాకర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్‌ ద్వారా ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్‌ చేసిన వ్యక్తులను ట్రోల్‌ చేయడానికి శ్రావణ్‌ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్‌) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

South Africa election 2024: South Africans go to the polls to choose a new government
South Africa election 2024: దక్షిణాఫ్రికా దక్కేదెవరికో?

సియాంకొబా. దక్షిణాఫ్రికాలో అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఊరూవాడా హోరెత్తించిన ఎన్నికల నినాదం. అంటే ‘మాదే ఘనవిజయం’ అని జులు భాషలో అర్థం. కానీ ఘనవిజయం దేవుడెరుగు, ఏఎన్‌సీ ఈసారి సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమేనని ఒపీనియన్‌ పోల్స్‌ అంటున్నాయి. వర్ణవివక్ష అంతమై తెల్లవారి పాలన ముగిశాక 1994లో ప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది మొదలు 30 ఏళ్లుగా ఏఎన్‌సీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో దానికి తొలిసారి గట్టి పోటీ ఎదురవుతోంది... దక్షిణాఫ్రికాలో ఎన్నికలకు వేళైంది. 400 మందితో కూడిన నేషనల్‌ అసెంబ్లీతో పాటు 9 ప్రొవిన్షియల్‌ అసెంబ్లీలకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడో విజయం కోసం ఏఎన్‌సీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగం, కరెంటు కోతలు, నీటి కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటివి పారీ్టకి బాగా ప్రతికూలంగా మారాయి. వీటిపై ప్రజాగ్రహం ప్రచారం పొడవునా స్పష్టంగా కన్పించింది. శనివారం అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహించిన చివరి ప్రచార సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. సభకు వేదికైన చారిత్రక సొవెటో టౌన్‌షిప్‌లోని 90వేల మంది సామర్థ్యమున్న ఫుట్‌బాల్‌ స్టేడియం పూర్తిగా నిండకపోవడం ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 71 ఏళ్ల రామఫోసాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆయనను అభిశంసించాలని పార్లమెంట్‌ నియమించిన న్యాయ నిపుణుల కమిటీ కూడా సూచించింది. అయితే పార్లమెంట్‌లో ఉన్న మెజారిటీ సాయంతో ఆ ప్రక్రియను ఏఎన్‌సీ అడ్డుకుంది. రామఫోసాపై జరిగిన పోలీసు దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఏఎన్‌సీ తన చరిత్రలో తొలిసారిగా 50 శాతం కంటే తక్కువ ఓట్లకు పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అదే జరిగితే అతి పెద్ద పారీ్టగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కదు. ఏఎన్‌సీ ఈసారి ఇతర పారీ్టల మద్దతుపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందని సర్వేలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఆదివారం వెల్లడ య్యే ఫలితాలపైనే నెలకొంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ జాకబ్‌ జుమా పంచ్‌... మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా గతేడాది రామఫోసాతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడం ఏఎన్‌సీకి పెద్ద దెబ్బ! 82 ఏళ్ల జుమా ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడుతున్నారు. ఆయన పార్టీ ఉంకొంతో వెసీజ్వె (ఎంకే) 13 శాతం దాకా ఓట్లు రాబట్టవచ్చని సర్వేల్లో వెల్లడయ్యింది. అధికారంలోకి రాకపోయినా ఏఎన్‌సీ అవకాశాలను బాగా దెబ్బ తీయడం ఖాయమని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జుమా సొంత ప్రావిన్స్‌ క్వాజులూ నాటాల్‌లో ఏఎన్‌సీ ఆధిపత్యానికి ఎంకే పూర్తిగా గండికొట్టనుందని అంటున్నారు. క్వాజులూ ప్రావిన్స్‌లోని ఎంకే నేతల్లో తెలుగు మూలాలున్న విశి్వన్‌ గోపాల్‌రెడ్డి ప్రముఖ స్థానంలో ఉండటం విశేషం.బరిలో 51 విపక్షాలు దక్షిణాఫ్రికాలో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (డీఏ). ఈ కూటమికి 22 నుంచి 27 శాతం ఓట్లు రావచ్చని ఏప్రిల్లో ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అయితే పలువురు నేతలు డీఏను వీడి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇది విపక్ష కూటమికి ప్రతికూలంగా మారింది. ఈసారి 51 ప్రతిపక్షాలు పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏఎన్‌సీకి కలిసొచ్చేలా కని్పస్తోంది.ముస్లిం ఓట్లపై వల... జనాభాలో ముస్లింలు 2 శాతం కంటే తక్కువే ఉంటారు గానీ వారి ప్రతి ఓటూ విలువైనదే. అందుకే ముస్లింల ఓట్లపై పారీ్టలు వల విసురుతున్నాయి. పాలస్తీనా ఉద్యమానికి పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. గాజాలో దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధాన సమస్యలివీ... → తీవ్ర కరెంటు కోతలు → పెచ్చరిల్లిన అవినీతి → పేదరికం (50 శాతం దాటింది) → 32 శాతం దాటిన నిరుద్యోగం (ప్రపంచంలోనే అత్యధికం) → తీవ్ర నీటి కొరత → మౌలిక సదుపాయాల లేమి → మితిమీరిన నేరాలు, హింసాకాండ → రాజకీయ హత్యలుదక్షిణాఫ్రికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. 90 మంది సభ్యులతో కూడిన నేషనల్‌ కౌన్సిల్, 400 మంది సభ్యులుండే నేషనల్‌ అసెంబ్లీ. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో దీని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మెజారిటీ సాధించే పార్టీ సారథి అధ్యక్షుడవుతారు. దేశ జనాభా 6.2 కోట్లు కాగా ఓటర్లు 2.8 కోట్ల మంది. జనాభాలో 80 శాతానికి పైగా నల్లజాతీయులే. ఈ ఎన్నికల్లో తొలిసారిగా స్వతంత్రులకు కూడా పోటీ చేసే అవకాశం కలి్పంచారు.ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికావ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం సృస్టిస్తున్నాయి. 2023 జనవరి నుంచి 40 మందికి పైగా విపక్ష నేతలు, నిజాయతీపరులైన అధికారులు, హక్కుల కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇది అధ్యక్షుడు రామఫోసా పనేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారంలో దీన్ని ప్రధానాంశంగా కూడా మార్చుకున్నాయి. వీటిపై ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేషనల్‌ అసెంబ్లీలో బలాబలాలు (మొత్తం స్థానాలు 400) ఏఎన్‌సీ 230 డెమొక్రటిక్‌ అలయన్స్‌ 84 ఎకనమిక్‌ ఫ్రీడం ఫైటర్స్‌ 44 ఇతరులు 42

Sakshi Editorial On Central Election Commission
ఈసీ నోరుమెదపదేం?!

కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్‌ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్‌ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్‌ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. సిట్‌ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్‌’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్‌ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్‌ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్‌ కోసం డిమాండ్‌ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్‌ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్‌ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్‌ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్‌ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి.

Lok Sabha Elections 2024: Patna Sahib and seven other constituencies to go to polls in 7th phase
Lok sabha Elections 2024: ఫైనల్‌ పంచ్‌ ఎవరిదో!

బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్‌ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్‌ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్‌తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్‌ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్‌... నలంద... జేడీయూ కంచుకోట అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్‌ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్‌) నుంచి సందీప్‌ సౌరవ్‌ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.ఆరా... రైట్‌ వర్సెస్‌ లెఫ్ట్‌ మొదట్లో దీని పేరు షాబాద్‌. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్‌ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్‌) అభ్యర్థి సుధామా ప్రసాద్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్‌)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్‌ పారీ్టల వార్‌ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.పట్నా సాహిబ్‌... రవిశంకర్‌కు సవాల్‌ సిక్కుల మత గురువు గురు గోవింద్‌సింగ్‌ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్‌ షాట్‌గన్‌ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ తనయుడు అన్షుల్‌ అవిజిత్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్‌ కృపాల్‌ యాదవ్‌ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్‌ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్‌సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్‌ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. కరాకట్‌.. బీజేపీకి పవన్‌ గండం ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్‌పుత్‌లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్‌పురి స్టార్‌ పవన్‌ సింగ్‌ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్‌ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్‌) నుంచి రాజారాం సింగ్‌ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్‌ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్‌ సింగ్‌ నామినేషన్‌కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.జహానాబాద్‌... జేడీయూ వర్సెస్‌ ఆర్జేడీ ‘రెడ్‌ కారిడార్‌’లో అత్యంత సున్నితమైన నక్సల్స్‌ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్‌ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్‌ ప్రసాద్‌ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Chief Election Commissioner Rajeev Kumar directive to state CEOs on Counting
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి: రాజీవ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఇందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల సీఈవోలు, ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆదేశించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్, డాక్టర్‌ సుఖ్బీర్‌ సింగ్‌ సందుతో కలసి రాజీవ్‌కుమార్‌ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా­డారు. అందరి సమిష్టి కృషితో దేశవ్యాప్తంగా ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైర్‌ సేఫ్టీ పరికరాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు.. ఈవీఎంలలో పోల్‌ అయిన ఓట్ల లెక్కింపు గురించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్‌కుమార్‌ ఆదేశించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను కౌంటింగ్‌ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా.. ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ‘లెక్కింపు పూర్తి అయినట్లుగా’ ఆయా ఈవీఎంలపై మార్క్‌ చేయాలని ఆదేశించారు. ఆ వెంటనే సీల్‌ చేసి ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ, ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుళ్లు, స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని.. డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, హరేంధిర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Rice Mills in blacklist Principle Decision of Telangana Govt
బ్లాక్‌లిస్టులో మిల్లులు.. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సెక్యూరిటీ డిపాజిట్‌ కానీ, బ్యాంక్‌ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్‌లోని 35 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్‌ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది. మిల్లర్ల విషయంలో ఉదాసీనత గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్‌ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించిన 35 ఎల్‌ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్‌ఎంటీల్లో 2 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్‌లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్‌ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. 2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్‌ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్‌ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్‌సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్‌ రైస్‌ను సీఎంఆర్‌గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్‌ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్‌ రైస్‌గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్‌లో 65 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్‌ రైస్‌గా మిల్లింగ్‌ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్‌లకు పరిమితం చేశారు. అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్‌ చేసి సీఎంఆర్‌ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 25 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్‌ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి. కొత్త టెండర్లు.. స్కామ్‌ ఆరోపణలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్‌ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్‌ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా.. మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్‌ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్‌ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్‌ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్‌ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్‌ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్‌ ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్‌ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్‌ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు.

Monsoon to hit Kerala
‘నైరుతి’ వచ్చేస్తోంది

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమ వారం తెలిపింది. నిరీ్ణత సమయానికి మూడ్రోజులు ముందుగా అంటే ఈనెల 19న అండమాన్‌ సము­ద్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమ­వారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేనెల 1, 2 తేదీల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే ఒకట్రెండు రోజులు ఆలస్యమై 3, 4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముంది. మొత్తంగా ఐదో తేదీలోపే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతు పవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చేనెల మొదటి వారంలో రాయలసీమలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. రెమల్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ తుపాను బంగ్లాదేశ్‌ వైపు కదిలి ఆ పరిసరాల్లోనే తీరం దాటడంతో రుతు పవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండ్రోజుల్లో అవి చురుగ్గా కదిలాయి. రైతులకు ఎంతో ఊరట.. జూన్‌లో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురవనున్నాయని సోమవారం విడుదల చేసిన రెండో దశ దీర్ఘకాలిక నెలవారీ అంచనా నివేదికలో ఐఎండీ పేర్కొంది. ఈ సమాచారం రైతాంగానికి ఎంతగానో ఊరటనిస్తోంది. గత ఏడాది వారం రో జులు ఆలస్యంగా అంటే జూన్‌ 8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం వర్షాలు అరకొరగానే కురిశాయి. పైగా రాష్ట్రంలో జూన్‌ అంతా మే నెలను తలపించేలా వడగాడ్పులు కొనసాగాయి.ఫలితంగా జూన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఖరీఫ్‌ పనులు ముందుకు సా గలేదు. ఆపై జూలై, ఆగస్టుల్లో సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో గతేడాది రైతులకు నైరుతి రుతుపవనాలు నిరాశను, నష్టాలను మిగిల్చాయి. కానీ, ఈ ఏడాది ప­రి­స్థి­తులు అందుకు భిన్నంగా, అనుకూలంగా మా­రు­­తు­న్నాయి. ఎల్‌నినో బలహీనపడుతూ జూన్‌ మ­ధ్య నుంచే లానినా పరిస్థితులేర్పడుతున్నాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురవడానికి దోహద పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మూడ్రోజులు వడగాడ్పులు.. ఇదిలా ఉంటే.. రెమాల్‌ తీవ్ర తుపాను ఫలితంగా గాలిలో తేమను తుపాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో.. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణి కార్తె కూడా రెండ్రోజుల క్రితమే మొదలైంది. వీటివల్ల రానున్న మూడ్రోజులు సాధారణంకంటే 4–8 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్నిచోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల మళ్లీ వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. టకాగా, మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 160 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం 27, పార్వతీపురం మన్యం 15, అల్లూరి సీతారామరాజు 2, విశాఖపట్నం 6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పు గోదావరి 18, పశి్చమ గోదావరి 4, ఏలూరు 7, బాపట్ల 1, కృష్ణా 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ⇒ అలాగే, వడగాడ్పులు శ్రీకాకుళం జిల్లాలో 8, అల్లూరి 8, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ 8, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎనీ్టఆర్‌ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లోను వీయనున్నాయని వివరించింది. ⇒ ఇక బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ⇒ సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9, మనుబోలు (నెల్లూరు) 41.5, వేమూరు (బాపట్ల), పెడన (కృష్ణా) 40.9, చింతూరు (అల్లూరి) 40.8, డెంకాడ (విజయనగరం) 40.7, రావికమతం (అనకాపల్లి) 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్‌లో వర్షాలే వర్షాలు.. ఈ సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతాలు నమోదవుతాయని తెలిపింది. రుతు పవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో మంచి వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేసింది. అలాగే, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయవ్య భారతంలో సాధారణ వర్షపాతం, మధ్య, దక్షిణ భారతదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో జరిగిన వర్చువల్‌ మీడియా సమావేశంలో అంచనా వేశారు. జూన్‌–సెప్టెంబర్‌ కాలంలో దీర్ఘకాల సగటు 87 సెం.మీ. వర్షపాతంలో 106 శాతం మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు.

Kommineni Srinivasa Rao Strong Counter to ABN Radha Krishna
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!

తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్‌సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్‌సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్‌గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్‌సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్‌ ఛానెల్స్‌ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్‌ ఛానల్‌లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్‌ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్‌లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్‌సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్‌కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్‌ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement