Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ysrcp Complaint To Ap Dgp In Tdp Attacks
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్‌ బూత్‌లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్‌ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

AP CEO MK Meena On AP Election Polling Percentage
ఏపీలో 81.86 శాతం పోలింగ్‌ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81.86 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పూర్తైందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచినట్లుచెప్పారు.రాష్ట్రంలో తుదిపోలింగ్‌ శాతం వివరాలను ఏపీ సీఈవో బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్‌సభకు ఓటేయలేదని తెలిపారు ఎంకే మీనా. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్‌ శాతం జరిగిందని.. నాలుగు దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్‌ జరగలేదని అన్నారు.‘కుప్పంలో 89.88 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్‌ నమోదు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1.20 శాతం నమోదు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం. 2019 ఎన్నికల్లో 79.77శాతం పోలింగ్‌ నమోదు. అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానంలో 71.11 శాతం పోలింగ్‌. గత ఎన్నికలతో పోలిస్తే 2.09శాతం పోలింగ్‌ పెరిగిందినాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు. ఈవీలఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 715 ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చు’ అని పేర్కొన్నారు.

Foreign Minister Jaishankar Comments On Pak Occupied Kashmir
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

కోల్‌కతా: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే) ఎప్పటికీ భారత్‌దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్‌కతాలో బుధవారం(మే15) జరిగిన ఓ కార్యక్రమంలో ‌జైశంకర్‌ స్పందించారు.పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ప్రజల జీవన స్థితులతో పోల్చుకుంటున్నారన్నారు. ‘పీఓకేలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. వాటికి గల కారణాలు విశ్లేషించడం అంత సులభం కాదు.అయితే పీఓకే ప్రజలు తమ జీవన పరిస్థితులను జమ్మూ కాశ్మీర్‌ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చుకుంటున్నారని నా అభిప్రాయం. తాము వివక్షకు గురవుతున్నామని పీఓకే ప్రజలు భావిస్తున్నట్లున్నారు’అని జైశంకర్‌ అన్నారు. కాగా, ఇటీవల పెరిగిపోయిన ఆహారం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పీఓకే ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై దాడికి దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Dont Think He Has Achieved Anything In IPL Gambhir Blasts RCB Great Support Hardik
అతడి కంటే చెత్త కెప్టెన్‌ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్‌ స్టార్‌ కెవిన్‌ పీటర్సన్‌, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్‌-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ గూటికి చేరుకున్న హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్‌ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్‌ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్‌-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్‌ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్‌ పీటర్సన్‌, ఏబీ డివిలియర్స్‌ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్‌ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్‌ ఇస్తూ హార్దిక్‌ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ఇక హార్దిక్‌ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్‌, ఏబీ డివిలియర్స్‌ గతంలో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు.‌ పీటర్సన్‌ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్‌ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్‌ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్‌ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్‌ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్‌ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మ‌ళ్లీ కోహ్లినే!

china govt may buy unsold homes to help property market
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!

రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్‌లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్‌ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు.

Mrunal Thakur Roaming With Siddhant Chaturvedi
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్‌కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024

AP Elections 2024: May 15th Politics Latest News Updates Telugu
May 15th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 15th AP Elections 2024 News Political Updates3:51 PM, May 15th, 2024టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుడీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలుడీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు3:19 PM, May 15th, 2024ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు3:15 PM, May 15th, 2024కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలుడీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్‌..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్‌వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్‌..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్‌.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్‌సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎ‍స్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్‌ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్‌ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్‌..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్‌. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్‌ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్‌ .జగన్‌ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

Guard In Sachin Tendulkar VVIP Security Shoots Self In Neck
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహిత సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్‌ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్‌.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు. 39 ఏళ్ల కపడే తన సర్వీస్‌ గన్‌తో మెడపై కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జమ్నేర్ పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ షిండే పేర్కొన్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారుప్రాథమిక విచారణ ద్వారా వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల జ‌వాన్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు తేలిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కపడే మృత‌దేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య ఘటనపై జమ్మేర్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ క‌ల్పిస్తున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం వ‌ల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్య‌క్తిగ‌తంగా ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ది.మరోవైపు, వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘటనపై SRPFస్వతంత్ర విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Indian Health Council Issues Warning Against Using Non Stick
నాన్‌స్టిక్‌ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

ఇటీవల చాలామంది నాన్‌స్టిక్‌ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిల్లో అయితే డీప్‌ ఫ్రైలు చేస్తే ఆయిల్‌ ఎక్కుపట్టదు. అదీగాక గమ్మున అడుగంటదు, ఈజీగా వంట అయిపోతుందని మహిళలు ఈ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ఉపయోగించొద్దని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆప్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) గట్టిగా హెచ్చరిస్తోంది. వీటి వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. పైగా ఎలాంటి పాత్రలు వాడితే మంచిదో కూడా సూచనలు ఇచ్చిందో అవేంటో సవివరంగా తెలుసుకుందామా!.ఎందుకు మంచిది కాదంటే..నాన్‌స్టిక్‌ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్‌ పైపూత (కోటింగ్‌)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్‌ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్‌ వంటపాత్రలను 170 డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్‌స్టిక్‌ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలయ్యే ప్రమాదం ఉంది. అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని పేర్కొంది. అందువల్ల వీటిని వినియోగించటం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వెల్లడించింది. వచ్చే అనారోగ్య సమస్యలు..హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్‌, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్‌ పేర్కొంది. నాన్‌ స్టిక్‌ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్‌ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. అలాగే ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్‌లెస్ స్టీల్‌ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఈ మేరక సీఎంఆర్‌ భారతీయులకు ఆహార మార్గదర్శకాలు అనే పేరుతో ఈ సూచనలను ఇటీవలే విడుదల చేసింది.(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?)

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement