Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Minister Kakani Govardhan Reddy Challenges To Somireddy
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి

నెల్లూరు: బెంగళూరు రేవ్‌ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్‌ను జిరాక్స్‌ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్’ అంటూ మండిపడ్డారు.‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్‌గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది. కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు.

Botsa Satyanarayana Slams Prashant Kishor Comments On Ap Election Results
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్‌

సాక్షి, విజయవాడ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీ లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్‌ కిషోర్‌ కమర్షియల్‌ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.వైఎస్సార్‌సీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తోందని అన్నారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ అయినా,ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్సార్‌సీపీ శాశ్వతమని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని అన్నారు. ఐప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవని అన్నారు. ఐప్యాక్ ఓ జాబితా ఇస్తుందని,అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని స్పష్టం చేశారు.‘ఎన్నికలు పూర్తయ్యాయి... భవితవ్యం బ్యాలట్ బాక్సులలో ఉన్నాయి. మేం గెలుస్తామని.. జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పాం. ఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం. ప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారు. రాష్ట్ర విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నో‌కీలక మార్పులు తెచ్చాం. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన‌ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు. మాపై బురద జల్లుతున్నారు. విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన. మా విధానాలు నచ్షే పెద్ద ఎత్తున‌మాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు.ప్రదాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?. చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి. చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు లోకేష్‌ విదేశాలికు వెళ్లారు. రాష్ట్ర ప్రజలని సంయమనం పాటించాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిభయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే. ఎందుకు హర్రీ అండ్ వర్రీ. చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటి?. ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?. సీఎం జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి? వైఎస్ జగన్‌ అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి? ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు.తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినాా చెప్పారా?. తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేకపోయారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు సీఎం రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు. నా తప్పులని దిద్దుకుంటానని అదికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా?చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం. మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది. గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం, వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలికు కావాల్సిన విధానాలని, సంస్కరణలనే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌కు మళ్లీ పట్టం కట్టారని మేం భావిస్తున్నాం.’ అని బొ త్స పేర్కొన్నారు.

IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates and highlights
IPL 2024 qualifier 1: సన్‌రైజర్స్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్‌

IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates:సన్‌రైజర్స్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్‌ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌.. 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(24 బంతుల్లో 58 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(51 నాటౌట్‌), గుర్భాజ్‌(23) పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ప్యాట్‌ కమ్మిన్స్‌, నటరాజన్‌ తలా వికెట్‌ సాధించారు. అ‍ంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌, హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు.రెండో వికెట్‌ డౌన్‌.. నరైన్‌ ఔట్‌67 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సునీల్‌ నరైన్‌.. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహ్మతుల్లా గుర్భాజ్.. నటరాజన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్‌ అయ్యర్‌(12), నరైన్‌(12) పరుగులతో రాణించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్‌..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్‌(12), సునీల్‌ నరైన్‌(9) పరుగులతో ఉన్నారు.నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్‌ఆర్‌హెచ్‌..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌, హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు.14 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 123/7స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవ‌ర్ వేసిన సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో తొలుత రాహ‌ల్ త్రిపాఠి(55) ర‌నౌట్ కాగా.. ఆ త‌ర్వాతి బంతికే స‌న్వీర్ సింగ్ ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 7 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది.ఐదో వికెట్‌ డౌన్‌హెన్రిచ్‌ క్లాసెన్‌ రూపంలో సన్‌రైజర్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 115/5నిలకడగా ఆడుతున్న క్లాసెన్‌, త్రిపాఠి10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి స‌న్‌రైజ‌ర్స్ 4 వికెట్ల న‌ష్టానికి 92 ప‌రుగులు చేసింది. క్రీజులో క్లాసెన్‌(30), రాహుల్ త్రిపాఠి(45) ప‌రుగుల‌తో ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న స్టార్క్‌.. కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. కేకేఆర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ దాటికి కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌ త్రిపాఠి(24), హెన్రిచ్‌ క్లాసెన్‌(5) ఉన్నారు.రెండో వికెట్ డౌన్‌.. అభిషేక్ ఔట్‌అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అబిషేక్‌.. ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్‌ కుమార్‌ రెడ్డి వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌ త్రిపాఠి(220, నితీష్‌ కుమార్‌(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌.. హెడ్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌.. తొలి ఓవ‌ర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వ‌చ్చాడు. తొలి ఓవ‌ర్ ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ వికెట్ న‌ష్టానికి 8 ప‌రుగులు చేసింది.ఐపీఎల్‌-2024లో తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ద‌మైంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా క్వాలిఫయర్-1లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌పడ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగగా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు. కేకేఆర్ జ‌ట్టులోకి ఫిల్ సాల్ట్ స్ధానంలో గుర్భాజ్ వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యంలో సాధించిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తోంది. తుది జ‌ట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్

Elon Musk Tweet About Microsoft New Recall Feature
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్‌లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్‌లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్‌షాట్‌లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్‌ను విమర్శించారు.బ్లాక్ మిర్రర్ సిరీస్బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్‌లలో 27 ఎపిసోడ్‌లుగా ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్‌లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.This is a Black Mirror episode. Definitely turning this “feature” off. https://t.co/bx1KLqLf67— Elon Musk (@elonmusk) May 20, 2024

Delhi High Court Rejects Manish Sisodia Bail
లిక్కర్‌ కేసు: మనీష్‌ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్‌ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్‌ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్‌ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం.

ACB raids ACP Uma Maheswara Rao residence Money Documents Seized
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, విశాఖపట్నంలోని బంధువులకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.సోదాల్లో భాగంగా ఉమామహేశ్వర ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ల్యాండ్‌ డాక్యుమెంట్లు సైతం పట్టుబడుతున్నాయి. ఉమామహేశ్వర్ రావు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ పోలీస్‌ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తన మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.కాగా అశోక్ నగర్‌లో సోదాలు జరిగే ప్రాంతానికి ఏసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంటితో పాటు 7చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, తనిఖీలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

No Conspiracy In Iran President Helicopter Crash: US
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా

వాషింగ్టన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్‌ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఇరాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్‌ మాట్లాడుతూ హెలికాప్టర్‌ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్‌ 212 హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్‌ ఖదీర్‌ తెలిపారు. హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్‌ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్‌ సిగ్నల్‌ కోసం తాము తొలుత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లలో సిగ్నల్‌ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్‌ అన్నారు.

Bigg Boss Contestant Kiran Rathod Faces Problem In Visa
బిగ్‌బాస్‌ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!

బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. ‍అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్‌ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్‌ రాథోడ్‌ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్‌ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్‌ బుకింగ్‌, ట్రావెల్‌ బుకింగ్‌ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official)

Pune Porsche Crash: Family Of Techies Calls It Murder
పుణె మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటన .. ‘ఇది ప్రమాదం కాదు హత్యే’

మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి.. ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మైనర్‌కు 15 గంటల్లోనే బెయిల్‌ లభించగా.. బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పుణెలో ఆదివారం తెల్లవారు జామున 17 ఏళ్ల బాలుడు తాగిన మైకంలో పోర్స్చే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిపిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అనీశ్‌, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటన సమయంలో మైనర్‌ 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ రెండు కుంటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలు మంగళవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. అనీశ్‌ అవదీయా మృతదేహాన్ని మధ్యప్రదేశ్‌ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బంధువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మైనర్‌ డ్రైవర్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని అనీశ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు అన్నారు. ‘ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఇది ప్రమాదం కాదని హత్య మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు, అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారు? అతడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.గత రాత్రి అశ్విని కోష్ట మృతదేహం జబల్‌పూర్‌లోని ఆమె ఇంటికి చేరుకుంది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై వారి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ కోసం చివరి వరకు పోరాడతామని తెలిపింది. ‘మేము షాక్‌లో ఉన్నాము. నిందితుడికి 15 గంటల్లో బెయిల్ ఎలా ఇస్తారు. మైనర్‌తోపాటు అతడి తల్లిదండ్రులను విచారించాలి. అశ్విని తన కెరీర్‌పై ఎన్నో కలలు కంది. తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని కోరుకుంది. మా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. అశ్విని అంత్యక్రియలు ముగిసిన తర్వాత మేము ఈ విషయాన్ని చర్చిస్తాం’ అని పేర్కొంది.కాాగా, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్‌ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్‌కు జువెనైల్‌ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. ప్రమాద తీవ్రతను ఆధారంగా నిందితులను మేజర్‌గా పరిగణించి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోరగా కోర్టు తిరస్కరించింది. తాజాగా పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

Severe Turbulence on Singapore Airlines Flight From London One Dead
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి

సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన SQ321 విమానం మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయింది.బోయింగ్ 777-300 ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరిస్తూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.విమానం ల్యాండ్ అయిన తరువాత అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని పనిచేస్తున్నట్లు.. ఇంకా అదనపు సహాయాన్ని అందించడానికి బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇటువంటి గాయాలు సాధారణంగా జరుగుతాయని నిపుణులు తెలిపారు. వాతావరణ రాడార్ నుంచి ముందస్తు సమాచారం అందకపోవడంతో పైలెట్ కూడా ముందుగా ప్రయాణికులను హెచ్చరికను ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోవడం వల్ల.. వారు కాక్‌పిట్‌లోకి పడే అవకాశం ఉంటుంది. అలంటి సమయంలో ఊహకందని ప్రమాదం జరుగుతుంది.Singapore Airlines flight #SQ321, operating from London (Heathrow) to Singapore on 20 May 2024, encountered severe turbulence en-route. The aircraft diverted to Bangkok and landed at 1545hrs local time on 21 May 2024.We can confirm that there are injuries and one fatality on…— Singapore Airlines (@SingaporeAir) May 21, 2024

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement