Top Stories
ప్రధాన వార్తలు
టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్!
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్‌లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి
TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదలు చేసింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్లో పేర్కొంది.
డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూన పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్‌కు చెందిన సినీ నటి హేమ, ఆశూ రాయ్‌లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్,సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్‌లకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు..? ఇంకా ఎవరెవరితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఐదుగురుని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’ పోస్ట్ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఐపీఎల్-2024 మ్యాచ్‌లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.వదంతులు మాత్రమేనంటూఅయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.భరణం కింద ఆస్తిలో 70 శాతంఈ క్రమంలో భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.సోషల్ మీడియాలో విష్ చేయని హార్దిక్.. ఒంటరిగానే రీచార్జ్ అవుతున్నట్లుగాఅయితే, వాలంటైన్స్ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్‌పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఐసీసీ ఈవెంట్లోమామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. కాగా హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా తదుపరి జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధం కానున్నాడు. చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)
Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
టైటిల్: లవ్ మీనటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులునిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డిదర్శకుడు: అరుణ్ భీమవరపుసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్విడుదల తేది: మే 25, 2024దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్)అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్‌కి చెబుతుండగా.. అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్‌ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే.. బేస్మెంట్ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్‌గా తీర్చిదిద్దినా..ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్ బ్యాక్ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్‌స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్టైన్మెంట్ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్‌స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించొచ్చు. ఎవరెలా చేశారంటే.. అశీష్ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. సీన్‌కి తగ్గట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్‌గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్ లెన్త్ రోల్ తనది. సంయుక్త మీనన్ ఒకే ఒక్క షాట్లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
May 25th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 24th AP Elections 2024 News Political Update2:00 PM, May 25th, 2024అడ్డంగా బుక్కైన పీకే..చంద్రబాబుకి వంతపాడి అడ్డంగా బుక్కైన పీకే!ఏపీలో సర్వే చేయించకపోయినా టీడీపీకి లబ్ధి చేకూర్చడానికి నోరుజారినట్లు ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి నవ్వులపాలు..అయినా సిగ్గులేకుండా చంద్రబాబు కోసం ఏపీ ఫలితాలపై జోస్యం. చంద్రబాబుకి వంతపాడి అడ్డంగా బుక్కైన పీకే!ఏపీలో సర్వే చేయించకపోయినా.. @JaiTDPకి లబ్ధి చేకూర్చడానికి నోరుజారినట్లు ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి నవ్వులపాలు.. అయినా సిగ్గులేకుండా @ncbn కోసం ఏపీ ఫలితాలపై జోస్యం… pic.twitter.com/3EDeTU73n6— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 1:30 PM, May 25th, 2024ఫ్యాన్ ప్రభంజనం ఖాయం..అనంతపురం:ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం164 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందిటీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పగటి కలలు కంటోంది 1:00 PM, May 25th, 2024వైఎస్సార్సీపీదే ఘన విజయం: ఎంపీ గోరంట్ల మాధవ్అనంతపురం:ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్..22 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయంఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యాలు చేస్తోందిటీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ జరపాలి 12:30 PM, May 25th, 2024కౌంటింగ్ భద్రతపై పోలీసుల ఫోకస్విజయవాడకౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిఏపీవ్యాప్తంగా 24 జిల్లాలకి 56 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీలకు ప్రత్యేక బందోబస్తు బాధ్యతలుఆయా జిల్లాల ఎస్పీలకి రిపోర్ట్ చేయాలని డీజేపీ ఆదేశాలుసమస్యాత్మక నియోజకవర్గాల్లోని కౌంటింగ్ ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు 11:00 AM, May 25th, 2024వైఎస్సార్సీపీ నేతపై దాడి.తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి.వెంకట శివారెడ్డికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపువైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్న పచ్చ బ్యాచ్ 10:30 AM, May 25th, 2024పల్నాడుపై పోలీసుల ఫుల్ ఫోకస్..పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న పోలీసుల ఆపరేషన్. ఎన్నికల్లో పోలింగ్ తర్వాత హింస నేపథ్యంలో పోలీసులు అలర్ట్.కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలుఇప్పటికే గ్రామాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.పలు గ్రామాల్లో మారణాయుధులపై కూడా పోలీసులు ఫోకస్కౌంటింగ్ కోసం అదనంగా మరికొన్ని పోలీసు బలగాలు ఏర్పాటు. 9:30 AM, May 25th, 2024టీడీపీలో కొత్త ట్విస్ట్!లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ బాబు బ్యాచ్ కొత్త డ్రామా.చినబాబు పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్న టీడీపీ నేతలుజూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా టీడీపీలో సీరియస్‌గా కొనసాగుతున్న చర్చ. జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు, లోకేష్‌పై తిరుగుబాటు తప్పదంటున్న విశ్లేషకులు. పార్టీ లేదు ఏమీ లేదని మూడేళ్ల క్రితమే స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు. జూన్ నాలుగుకి ముందే ఓటమిని ఒప్పేసుకున్న టీడీపీ. 8:10 AM, May 25th, 2024వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యచిత్తూరుఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యమృతుడు పుంగనూరు శేషాద్రిమదనపల్లెలోని శ్రీవారి నగర్లో ఈ ఘటన జరిగింది.తెల్లవారుజామున నివాస గృహంలోకి చొరబడిన దుండగులు హత్య చేసి పరారుకేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు 7:25 AM, May 25th, 2024బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లైలో టీడీపీ అనుచరులుడ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు టీడీపీ నేతలు, కార్యకర్తలే. బెంగళూరు రేవ్ పార్టీలో పచ్చ బ్యాచ్‌కు లింక్. చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు కీలక వ్యక్తులురేవ్ పార్టీకి వీరే డ్రగ్స్ సప్లయర్స్. చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు @naralokesh అనుచరులే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు @JaiTDP ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులుపూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి… pic.twitter.com/wpjpZBv13Z— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 7:00 AM, May 25th, 2024వెబ్ కాస్టింగ్ హైజాక్! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలుప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్.. దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా?.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తత.. ఆకస్మికంగా అధికారుల బదిలీ.. టీడీపీ బ్యాచ్‌కు పోస్టింగులు చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు 6:50 AM, May 25th, 2024పీకేవన్నీ తప్పుడు అంచనాలేగతేడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ చెప్పినదానికి వ్యతిరేకంగా ఫలితంప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన పీకేఈ ఎన్నికల్లో బీజేపీకి 300 లోక్‌సభ స్థానాలపైనా నిలదీసిన కరణ్ ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం ఇక్కడా ఆయన అంచనాలు తప్పుతాయంటున్న విశ్లేషకులు 6:40 AM, May 25th, 2024ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?పోలింగ్‌కు రెండు రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోని సీఐ అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు 6:30 AM, May 25th, 2024మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రఅందుకు ఈసీలోని కొంతమంది సహకారం చంద్రబాబు, పవన్‌లకు మరో 10 రోజులే కలలుగనే అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కు బాసట వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి
చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి దుబాయ్‌లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్‌గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అంతేకాదు బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు కూడా ఇది సరిపోతుందని అంచనా.లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్లో జామ్ నగర్లో ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనంత్‌కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్ అంబానీ. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు.
LS 2024: కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్
Updatesఢిల్లీ:మధ్యాహ్నం 3 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 49.2బీహార్- 45.21హర్యానా -46.26జమ్మూ-కాశ్మీర్-44.41జార్ఖండ్- 54.34ఢిల్లీ -44.58ఒడిస్సా- 48.44ఉత్తరప్రదేశ్ - 43.95పశ్చిమ బెంగాల్- 70.19 ఢిల్లీ: సీపీఎం నేత ప్రకాశ్ కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPM leader Prakash Karat casts his vote in the sixth phase of Lok Sabha elections, in Delhi pic.twitter.com/858hVyqLos— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారం ఏచూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPI(M) General Secretary Sitaram Yechury casts his vote in Delhi pic.twitter.com/xmd7RWEkVq— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఓటు వేశారు.#WATCH | Arvind Panagariya, Chairman of 16th Finance Commission casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi pic.twitter.com/BJlEKlYqOM— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:లోక్ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోందిమధ్యాహ్నం 1 గంట వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ 39.13 శాతం బీహార్- 36.48%హర్యానా -36.48%జమ్మూ-కాశ్మీర్-35.22%జార్ఖండ్- 42.54%ఢిల్లీ - 34.37%ఒడిస్సా- 35.69%ఉత్తరప్రదేశ్ - 37.23%పశ్చిమ బెంగాల్- 54.80%పశ్చిమ బెంగాల్:బీజేపీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించకపోవటంపై మేదినిపూర్ బీజేపీ అభ్యర్థి అగ్ని మిత్రా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి తన పోలింగ్ ఏజెంట్‌ను బూత్‌లో కూర్చుబెట్టారు.#WATCH | Paschim Medinipur, West Bengal | BJP candidate from Medinipur Lok Sabha seat, Agnimitra Paul alleges that BJP polling agents are not being allowed inside polling booths in Keshiary as voting is underway in the parliamentary constituency “Are you not seeing that our… pic.twitter.com/CREGf4awJa— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మ హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Former BJP Spokesperson Nupur Sharma leaves from a polling station in Delhi after casting her vote for #LokSabhaElections2024(Earlier visuals) pic.twitter.com/BFYgtP82b5— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Union Minister and BJP MP Meenakashi Lekhi casts her vote for #LokSabhaElections2024 at a polling station in Delhi. She says, " I urge everyone to come out and vote. It is a festival of democracy and everyone should vote...Our government is going to be formed once… pic.twitter.com/27GokqlPi5— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Senior advocate and Rajya Sabha MP Kapil Sibal shows his inked finger after casting his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/S8WLWfxQoM— ANI (@ANI) May 25, 2024 సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ దంపతులు ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Chief of Defence Staff (CDS) Gen Anil Chauhan, his wife Anupama Chauhan cast their votes for #LokSabhaElections2024 at a polling station in Delhi pic.twitter.com/aMdfHocLPU— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Delhi CM Arvind Kejriwal, his family members show their inked fingers after casting their votes for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/Za10pO9sW2— ANI (@ANI) May 25, 2024 సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPI(M) leader Brinda Karat says, "...I have voted against dictatorship and communalism. My vote will bring change..." https://t.co/c8aglrIvSd pic.twitter.com/v6OVwhCJMf— ANI (@ANI) May 25, 2024 లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 11 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన మొత్తం పోలింగ్ శాతం 25.76బీహార్- 23.67%హర్యానా -22.09%జమ్మూ-కాశ్మీర్-23.11%జార్ఖండ్-27.80%ఢిల్లీ -21.69%ఒడిస్సా-21.30%ఉత్తరప్రదేశ్ -27.06%పశ్చిమ బెంగాల్-36.88%#LokSabhaElections2024 | 25.76% voter turnout recorded till 11 am, in the 6th phase of elections. Bihar- 23.67% Haryana- 22.09% Jammu & Kashmir- 23.11% Jharkhand- 27.80% Delhi- 21.69% Odisha- 21.30% Uttar Pradesh-27.06% West Bengal- 36.88% pic.twitter.com/iwy8GyKzFe— ANI (@ANI) May 25, 2024 హర్యానా:ద్రోణాచార్య అవార్డు గ్రహిత, రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ ఫోగట్ ఓటు వేశారు.#WATCH | Haryana: Dronacharya awardee and wrestling coach Mahavir Singh Phogat casts his vote. He also casts a vote on behalf of his wife at a polling centre in Charkhi Dadri for the sixth phase of #LokSabhaElections2024 Former wrestler and BJP leader Babita Phogat also cast… pic.twitter.com/BKLH5Hgrtt— ANI (@ANI) May 25, 2024 దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | After casting his vote for the #LokSabhaElections2024 , former Indian Cricketer Kapil Dev says "I feel very happy that we are under democracy. The important thing is to pick the right people for your constituency...What we can do is more important than what the govt can… pic.twitter.com/Cl0XAb71Aq— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన ప్రియాంకా గాంధీ వాద్రాఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra casts her vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/wrg0wOISAw— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన ప్రియాంకా గాంధీ కుమార్తె, కుమారుడుఢిల్లీ: ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా,కూతురు మిరాయా వాద్రా ఓటు వేశారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు.Raihan Rajiv Vadra and Miraya Vadra, children of Robert Vadra and Congress leader Priyanka Gandhi Vadra show their inked fingers after casting their votes for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/c1pcraZCdY— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన ఎంపీ స్వాతి మలివాల్ఢిల్లీ:ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Aam Aadmi Party Rajya Sabha MP Swati Maliwal casts her vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi. pic.twitter.com/4jLu7RoHdz— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన మాజీ రాష్ట్రపతిఢిల్లీ:మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Former President Ram Nath Kovind casts his vote for #LokSabhaElections2024 at a polling centre in Delhi pic.twitter.com/9IE5wbI7LJ— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటు వేశారు. భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Odisha CM Naveen Patnaik casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling station in Bhubaneswar pic.twitter.com/c0sGZ5xsIe— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు వేశారుఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రాహుల్.. అనంతరం తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ ఫొటో దిగారు.తొలిసారి సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెసేతర అభ్యర్థికి ఓటు వేశారు. ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్‌లో పొత్తులో బరిలోకి దిగాయి.దీంతో ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి సోనియా గాంధీ కుటుంబం మద్దతు తెలిపింది.#WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and party MP Rahul Gandhi click a selfie as they leave from a polling station after casting their votes for #LokSabhaElections2024 pic.twitter.com/PIvovnGPdJ— ANI (@ANI) May 25, 2024 ఓటువేసిన ఉప రాష్ట్రపతి దంపతులుఢిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Vice President Jagdeep Dhankhar, his wife Sudesh Dhankhar show their inked fingers after casting their votes for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/LsUrRyEusU— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీలో మందకోడిగా పోలింగ్ఉదయం 9 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 10.82బీహార్- 9.66%హర్యానా -8.31%జమ్మూ-కాశ్మీర్-8.89%జార్ఖండ్-11.74%ఢిల్లీ -8.94%ఒడిస్సా-7.43%ఉత్తరప్రదేశ్ -12.33%పశ్చిమ బెంగాల్-16.54% ఢిల్లీ:ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓటు వేశారు.ఆయన ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi pic.twitter.com/chqk73Ydxs— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఓటు వేశారు.#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/O8wB4aLBLG— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్:పోలీసులు తీరుకు నిరసనగా పీడీపీ చీఫ్, అనంత్‌నాగ్- రాజౌరీ అభర్థి మెహబూబా ముఫ్తీ నిరసన దిగారు.ఏ కారణంగా లేకుండా పీడీపీ పోలింగ్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపణలు చేశారు.#WATCH | Anantnag, J&K: PDP chief and candidate from Anantnag–Rajouri Lok Sabha seat, Mehbooba Mufti along with party leaders and workers sit on a protest. She alleged that the police have detained PDP polling agents and workers without any reason. pic.twitter.com/dPJb4dolKQ— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన తెలంగాణ గవర్నర్ రాంచీ:జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఢిల్లీ:ఢిల్లీ మంత్రి అతిశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు#WATCH | Delhi minister & AAP leader Atishi casts her vote for #LokSabhaElections2024, at a polling booth in Delhi pic.twitter.com/AdfX0qlvkW— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Delhi: Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Ranchi. pic.twitter.com/UoaWLUxEg7— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:బీజేడీ నేత వీకే పాండియన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ పొలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | 5T Chairman and BJD leader VK Pandian casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling booth in Bhubaneswar. pic.twitter.com/WBOdNJ4ZSX— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంబీర్ ఓటు వేశారు.#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజౌరీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంత్ నాగ్-రాజౌరీ స్థానంలో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెస్స్ (జేకేఎన్సీ) తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.#WATCH | Jammu and Kashmir BJP President Ravinder Raina casts his vote at a polling booth in RajouriJammu and Kashmir National Conference (JKNC) has fielded Mian Altaf Ahmad from the Anantnag-Rajouri Lok Sabha seat. PDP has fielded Mehbooba Mufti from this seat.… pic.twitter.com/LmEFuMkIOt— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో దిగారు.ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్‌ను పోటీకి దింపింది.#WATCH | Delhi BJP president Virendraa Sachdeva casts his vote at a polling booth in Mayur Vihar Phase 1. BJP has fielded Harsh Malhotra from East Delhi Lok Sabha seat. AAP has fielded Kuldeep Kumar#LokSabhaElections2024 pic.twitter.com/I9ftlwnS12— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీన్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు చేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు#WATCH | BJP Lok Sabha candidate from New Delhi, Bansuri Swaraj casts her vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi.AAP has fielded Somnath Bharti from the New Delhi Lok Sabha seat. pic.twitter.com/hCM2o3wqjx— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | External Affairs Minister Dr S Jaishankar casts his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/SbWDv9jWZc— ANI (@ANI) May 25, 2024 హర్యానా:హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మీర్జాపూర్ గ్రామంలో ఓటు వేశారు.#WATCH | Haryana CM Nayab Singh Saini, his wife Suman Saini show their inked fingers after casting their votes at a polling booth in his native village Mirzapur, Narayangarh pic.twitter.com/TojCp0ygbU— ANI (@ANI) May 25, 2024ఢిల్లీ:ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఢిల్లీలోని ఏడు సీట్లకు పోటీపడుతున్న 162 మంది అభ్యర్థులుఆరవ విడత లో 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్ఒడిశా అసెంబ్లీలోని 42 సీట్లకూ పోలింగ్ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.13 కోట్ల మంది ఓటర్లు1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కొనసాగనున్న పోలింగ్ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లోని 428 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్ఢిల్లీ:కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుUnion Minister Hardeep Singh Puri, his wife Lakshmi Puri show their inked fingers after casting their votes at a polling booth in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/j9norx9jL1— ANI (@ANI) May 25, 2024 ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయాలి: ప్రధాని మోదీఆరో విడుతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నా.ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది.. మీ ఓటు కూడా కీలకమైంది.ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరంమహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి: ప్రధాని మోదీPrime Minister Narendra Modi tweets "I urge all those who are voting in the 6th phase of the 2024 Lok Sabha elections to vote in large numbers. Every vote counts, make yours count too. Democracy thrives when its people are engaged and active in the electoral process. I specially… pic.twitter.com/bqM3ba2Okq— ANI (@ANI) May 25, 2024 ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారీ- కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.పురీలో సంబిత్ పాత్ర- అరూప్ పట్నాయక్ పోటీ పడుతున్నారు.హర్యానాలోని కార్నాల్‌లో మనోహర్ లాల్ కట్టర్- దివ్యాన్షు బుదిరాజా బరిలో ఉన్నారు. హర్యానా: హర్యానా మాజీ సీఎం, కర్నాల్ బీజేపీ అభ్యర్థి మనోహర్ లాల్ కట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కర్నాల్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, HaryanaCongress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy— ANI (@ANI) May 25, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది.Voting for the sixth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 58 constituencies across 8 states and Union Territories (UTs) today. Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/leDZIY9HIa— ANI (@ANI) May 25, 2024 కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం కానుందిలోక్సభ ఎన్నికల్లో ఆరో విడతకు పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling booth in Ranchi to cast their votes; voting will begin at 7 amJharkhand's 4 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/nPm398UfeM— ANI (@ANI) May 25, 2024 హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు మశ్చిమ గాల్లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rajouri, J&KJammu and Kashmir's Anantnag-Rajouri constituency constituency will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/15zvuLK08k— ANI (@ANI) May 25, 2024 మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాంధీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rohtak, HaryanaHaryana's 10 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/p2Cws1ktcr— ANI (@ANI) May 25, 2024 హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.
తప్పక చదవండి
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- మంత్రి ఉత్తమ్ కుమార్‌పై నమ్మకముంది: బండి సంజయ్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
- ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
- SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- కేన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
- ఛత్తీస్‌గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
సినిమా
డబ్బు కోసం ఏదిపడితే అది చేశా.. తర్వాతేమో దేవుడిని ప్రార్థించేదాన్ని: నటి
సినిమాల్లో కనిపించాలని కలలు కనడం బాగుంటుంది కానీ దాన్ని నిజం చేసుకునే క్రమంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అలవాటు లేని ప్రదేశానికి వెళ్లి.. అక్కడ అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. తాను కూడా కొత్తలో ముంబై నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్తోంది బాలీవుడ్ నటి నీనా గుప్తా.వెళ్లిపోదామనుకున్నా..తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాది ఢిల్లీ. సినిమా కోసం అక్కడి నుంచి ముంబైకి వచ్చాను. కానీ ఈ వాతావరణానికి అలవాటు పడలేక ఎన్నోసార్లు వెళ్లిపోవాలనుకున్నాను. ప్రతి మూడు నెలలకోసారి బ్యాగు సర్దుకునేదాన్ని. ముందు పీహెచ్డీ చేసి ఆ తర్వాత వచ్చేద్దాం అనుకునేదాన్ని. కానీ ఈ సిటీ మనల్ని వెళ్లనివ్వదు.దేవుడిని మొక్కేదాన్నిఅయితే మొదట్లో నాకు డబ్బు అవసరం చాలా ఉండేది. అందుకోసం నాకు నచ్చని పాత్రలు కూడా చేసేదాన్ని. తర్వాత ఆ సినిమాలు రిలీజవకూడదని దేవుడిని ప్రార్థించేదాన్ని. అప్పుడు దేనికీ నో చెప్పకపోయేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తిరస్కరిస్తాను. నాకు నచ్చిన స్క్రిప్టునే ఎంచుకుంటాను. నచ్చనివాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ చేయనుతనను రెబల్ స్టార్ అని పిలవడంపై స్పందిస్తూ.. ఎందుకు నన్ను రెబల్ అని పిలుస్తారో అర్థం కాదు. పైగా నేను చాలా అమాయక పాత్రలు పోషించాను. పెద్దగా గ్లామర్ పాత్రలు, శక్తివంతమైన రోల్స్ కూడా చేయలేదు. నేను సింగిల్ మదర్ అని మీడియానే నాకు రెబల్ అన్న ట్యాగ్ ఇచ్చింది. నేను పోయినప్పుడు కూడా బోల్డ్ నీనా గుప్తా ఇక లేరు అనే రాస్తారు. నేను చనిపోయినా కూడా అలాంటి ట్యాగులు అంటగట్టడం ఆపరు. సరే, ఇంక దాన్ని నేను ఏం చేయలేను అని నీనా గుప్తా తెలిపింది. కాగా ఈమె ముఖ్య పాత్రలో నటిస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 28 నుంచి ప్రసారం కానుంది.
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్‌చరణ్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ ఒకే సినిమాలో!ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్‌గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ద్విపాత్రాభినయంశింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.కియారాతో పాటు..శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్‌ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!చదవండి: ట్రెండింగ్‌లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే
కేన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకునున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. 'అన్ సర్టెయిన్ రిగార్డ్' విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఆమె సొంతం చేసుకుంది.బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'షేమ్‌లెస్' చిత్రంలో ఆమె పాత్రకు గాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని ఓ వేశ్యాగృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన 'రేణుక' అనే ఒక వేశ్య జీవిత ప్రయాణాన్ని ఇందులో చిత్రీకరించారు. కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా వేశ్య పాత్రలో తన నటనతో మెప్పించింది. తాజాగా జరుగుతున్న కేన్స్ వేడుకల్లో 'షేమ్‌లెస్' చిత్రాన్ని ప్రదర్శించగా ఉత్తమ నటిగా ఆమె అవార్డు దక్కింది.అనసూయ సినిమా రంగంలో ఉన్నప్పటికీ వెండితెరపై కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం గోవాలో అనసూయ సేన్‌గుప్తా నివసిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ షో 'మసబా మసబా' చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీ (2009)లో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అంజన్ దత్ సాయంతోనే షేమ్‌లెస్ చిత్రంలో కనిపించి ఉత్తమ నటిగా అవార్డ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో వేశ్యగా 'రేణుక' పాత్రలో అనసూయ సేన్‌గుప్తా మెప్పించింది. వేశ్యగా జీవిస్తున్న ఆమెకు సమాజంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఈ చిత్రం చూపుతుంది.
రేవ్ పార్టీపై మంచు లక్ష్మీ కామెంట్
హారర్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలలో నటించిన 'యక్షిణి' వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఉంది. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అయితే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది.తాను ముంబైకి షిఫ్ట్ కావడంతో అందరూ బాలీవుడ్‌కు వెళ్లానని భావించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. నేను ముంబై మాత్రమే వెళ్లాను. హైదరబాద్ నా ఇల్లుతో సమానం. నేను ఏ భాషలో అయినా నటిస్తాను. హాలీవుడ్లో నటించిన తర్వాత టాలీవుడ్,కోలీవుడ్‌లో చేశాను. అందులో తప్పేముంది. నా కూతురుతో పాటు నా భవిష్యత్ కోసమే ముంబై వెళ్లాను. అని మంచు లక్ష్మీ చెప్పింది.బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని మంచు లక్ష్మీ తెలిపింది. ఆ పార్టీకి వెళ్లిన వాళ్లు ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పింది. పార్టీకి వెళ్లిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సమస్య పార్టీకి వెళ్లిన వ్యక్తులది మాత్రమేనని ఆమె తెలిపింది. దానిలో అందరికీ ఏం సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించింది.
ఫొటోలు
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)
ఓటేసిన రాష్ట్రపతి.. ఆరో విడతలో ఇతర ప్రముఖులు (ఫొటోలు)
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
క్రీడలు
MS Dhoni: ఓటేసిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్ జరుగుతోంది.ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.భారీ భద్రత నడుమ ఓటేసిన ధోనిఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్ రీజన్’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్ బాదాడంటూ ఫొటోను షేర్ చేసింది.ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, గౌతం గంభీర్, రెజ్లర్ బబితా ఫొగట్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానేఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగాడు.వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు సాధించాడు.అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C— ANI (@ANI) May 25, 2024
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’ పోస్ట్ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఐపీఎల్-2024 మ్యాచ్‌లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.వదంతులు మాత్రమేనంటూఅయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.భరణం కింద ఆస్తిలో 70 శాతంఈ క్రమంలో భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.సోషల్ మీడియాలో విష్ చేయని హార్దిక్.. ఒంటరిగానే రీచార్జ్ అవుతున్నట్లుగాఅయితే, వాలంటైన్స్ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్‌పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఐసీసీ ఈవెంట్లోమామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. కాగా హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా తదుపరి జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధం కానున్నాడు. చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)
టీమిండియా హెడ్ కోచ్‌గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024
బిజినెస్
పిల్లల తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చిన మస్క్
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుండడం పట్ల టెస్లా సీఈఓ ఎలొన్‌మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్‌లోని వివాటెక్ ఫెయిర్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐ అల్గారిథమ్‌ల ద్వారా పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించారు. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పిల్లలను సోషల్ మీడియాకు బానిస అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. వాటిలోవాడే అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు పిల్లల మానసికస్థితిని దెబ్బతీస్తాయి. అవి చిన్నారుల్లో డొపమైన్ స్థాయిలను పెంచేలా ఉంటాయి. దాంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఏఐ ఆధారిత కంటెంట్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో నా పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించకపోవడం తప్పుగా భావిస్తున్నాను. ప్రస్తుతం కొన్ని పరిమితులు విధించాను. పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో గమనిస్తున్నాను’ అని చెప్పారు.ఎలొనమస్క్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వచ్చే పిల్లల కంటెంట్ అంశంపై ఆయన స్పందించారు. చిన్నారుల కంటెంట్ విషయంలో తమ సంస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అనవసర అంశాలను తొలగించడానికి కంపెనీ చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది. పారిస్ ఈవెంట్లో మస్క్ ఏఐ ప్రభావంపై మాట్లాడుతూ..‘కృత్రిమమేథ చివరకు అందరి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తుంది. ఏఐ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో మానవ మనుగడ ఎలా ఉండబోతుందోననే ఆందోళనలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరతమస్క్ ఈ సందర్భంగా ఇయాన్ ఎం.బ్యాంక్స్ విడుదల చేసిన ‘కల్చర్ బుక్ సిరీస్’ గురించి ప్రస్తావించారు. ఇది అధునాతన ఏఐ ఉండే సమాజాన్ని తెలియజేస్తుంది. ఈ బుక్ సిరీస్‌లో భవిష్యత్తును చూపించారని మస్క్ అన్నారు. ‘కంప్యూటర్లు, రోబోట్లు ప్రతిదీ మీ కంటే మెరుగ్గా చేస్తే మీ జీవితానికి అర్థం ఉందా? ఇకపై ఏఐను మించేలా మానవులు మరిన్ని మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది’ అని తెలిపారు.A lot of social media is bad for kids, as there is extreme competition between social media AIs to maximize dopamine! https://t.co/bzB8m5qL9z— Elon Musk (@elonmusk) May 23, 2024
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు.
ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.2040 వరకు 80వేల కోట్ల డాలర్లుమైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు
వీడియోలు
భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి
భారీగా వీడియోలు కొన్న నారా లోకేష్..
బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..
ఓటమి భయంతోనే చంద్రబాబు ...కూటమిని ఏకిపారేసిన బొత్స
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
అర్ధరాత్రి దాకా విచారణ.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
ఢీల్లీలో కొనసాగుతున్న పోలింగ్
బెంగళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతలే కీలక సూత్రదారులు
కేంద్రంలో సీఎం జగన్ కీ రోల్..
KSR LIVE Show: వైఎస్ఆర్సీపీ కే అధికారం.. కేంద్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్
ఫ్యామిలీ
చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి దుబాయ్‌లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్‌గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అంతేకాదు బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు కూడా ఇది సరిపోతుందని అంచనా.లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్లో జామ్ నగర్లో ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనంత్‌కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్ అంబానీ. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
World thyroid day 2024 : థైరాయిడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
#World thyroid day 2024: మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ వ్యాధి, ఆరోగ్యం చూపే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: థీమ్నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు), థైరాయిడ్ సమస్యలు ప్రపంచ ఆరోగ్య ఆందోళనలో గణనీయమై పాత్ర పోషిస్తున్నాయనే వాస్తవాన్ని తెలియ జేయడం.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: చరిత్ర1965లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపన, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మొదలైంది. ఆ తరువాత థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (TFI) 2007లో మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా ప్రకటించింది.థైరాయిడ్ వ్యాధిమెడ దిగువన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి పేరే థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). ఈ రెండు హార్మోన్లు హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్ తిసమస్య సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.ఆ గ్రంథి ఈ హార్మోన్లను తగినంతగా లేదా అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ రుగ్మతలు తలెత్తుతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజం అని, అధికమైతే హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.హైపోథైరాయిడిజం: అలసట, బరువు పెరగడం , నిరాశ వంటి లక్షణాలుంటాయి.హైపర్ థైరాయిడిజం: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు.థైరాయిడ్ కేన్సర్: థైరాయిడ్ గ్రంధిలో ప్రాణాంతక పెరుగుదల కేన్సర్‌కు దారతీయవచ్చు.గోయిటర్: తరచుగా మెడలో వాపుగా కనిపిస్తుంది, హైపో- లేదా హైపర్ థైరాయిడిజంలోనే ఇది కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటేచక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అసవరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి.వ్యాయామం చాలా అవసరం. ఎలాంటి వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్,యోగా ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని కనీసం అరగంటలు పాటు చేయాలి. తద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటినీ అదుపులో ఉంచుకోవచ్చుథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మద్దతిచ్చే ఆహారంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా సెలీనియం కీలకమైంది.బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్,గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజులకు కనీసం ఎనిమిది గంటల కూడా చాలా అససరం. ఒక్కసారి థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వైద్య సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి అపోహలను, అవాస్తవాలను నమ్మకుండా నిపుణుల సలహాలను పాటించాలి.
నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్
ప్రకృతిలో ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆసీజన్లో తినడం ఆరోగ్యానికి చాలామంచింది. ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తియ్యగా, పుల్లగా రుచికరంగా ఉంటాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలామంచిదని చెబుతారు.అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి. దీన్ని శాస్త్రీయంగా సిజిజియం క్యుమిని అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండానికి చెందిన ఫలాలను ఇచ్చే చెట్టు. జంబోలన్ లేదా జామున్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మే , జూలై నెలల మధ్య వేసవి నెలలలో పండ్లు ఎక్కువగా వస్తాయి. నేనేడు పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. పండు: పండ్ల రూపంలో తాజాగా లేదా జామ్‌లు, జ్యూస్‌లా ప్రాసెస్ చేసిన రూపాల్లో విస్తృతంగా వినియోగిస్తారు.విత్తనాలు: గింజలు నూనెను తీయడానికి ఉపయోగిస్తారు.ఆకులు, విత్తనాలు ఆయుర్వేద ఔషధాలు, మూలికల తయారీలలో ఉపయోగిస్తారు.నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి సహా అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్ల నేరేడు ప్రయోజనాలునేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిదినేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ.నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. అపోహనేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ప్రచారంలో ఉంది. వాస్తవానికి దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని, వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నిజానికి ఈ పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ పుట్టబోయే శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయి.ఎవరు తినకూడదంటే...నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయని చెబుతారు.
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
న్యూస్ పాడ్‌కాస్ట్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు.
బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త
నిజాంపేట్: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నంచాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలి్పన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్‌కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా బి బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచి్చంది. ఇక నాటి నుంచి భరద్వాజ్ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్‌తో కాపురానికి పంపించారు. విచక్షణ కోల్పోయి..రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్‌ను లీక్ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్ వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్‌ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్‌కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పసికందు ముందే.. కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరణ మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్‌ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«దీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.అన్నీ అనుమానాలే.. మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్మెంట్ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Bhadrachalam Nursing Student: ‘కారుణ్య’ మిస్టరీ..?
భద్రాచలంఅర్బన్: నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతికి గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టగా, పరిస్థితి ఉద్రిక్తగా మారింది. పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వివరాలు ఇలా.. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న పడిగిపల్లి కారుణ్య (18) గురువారం అనుమానాస్పదస్థితిలో కళాశాల భవనంపై నుంచి కింది పడింది. తీవ్ర గాయాలుకాగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. ఆందోళనకు పలు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.కళాశాల బాధ్యులపై దాడిఆందోళన సమయంలోనే కళాశాల కార్యదర్శి ఎస్ఎల్ కాంతారావు అక్కడికి రాగా, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి దాడి చేశారు. దీంతో పోలీసులు కాంతారావును కళాశాలలోని ప్రిన్సిపాల్ గదికి తరలించారు. ఈ క్రమంలో ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. యాజమాన్యం అకారణంగా విద్యార్థిని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు కళాశాల వద్దకు రావాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని మృతురాలి తల్లి సునీత డిమాండ్ చేశారు. తన కూతురి చావుని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె స్నేహితురాలిని తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదంఆందోళన జరుగుతుండగానే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని చెబుతుండగా, దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కళాశాల యాజమాన్యంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా మధ్యవర్తుల సమక్షంలో కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షలు ఇచ్చేలా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తండ్రి గురుమూర్తి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.మృతిపై పలు అనుమానాలువిద్యార్థిని కారుణ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని ఫిట్స్‌తో చనిపోయిందని, హాస్టల్ మొదటి అంతస్తు పైనుంచి పడి తీవ్ర గాయాలతో మృతిచెందిందని, గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడనే వాదనలు వినిపించాయి. ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం మరో వాదన వెలుగుచూసింది. నర్సింగ్ కళాశాల నిర్వాహకుడి కుమారుడు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తనమాట వినకపోవడంతో దాడికి పాల్పడ్డాడని, దీంతో విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, కారుణ్య మృతికి అసలు కారణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.
సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య
కోటపల్లి: మండలంలోని సర్వాయిపేట గ్రా మానికి చెందిన ఇద్దరు ఉరేసుకుని మృతిచెందిన ఘటన మండలంలో సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేటకు చెందిన కోట రాజేశ్ (40), నాయిని చీకటి (28) కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. వెలమపల్లి జాతీయ రహదారి పక్కన గల ఇటుకల కంపెనీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలో వీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఇటుకల కంపెనీలో పనిచేసే మిగతా కూలీలు సామగ్రి భద్రపరిచేందుకు వెళ్లి గుర్తించారు. స్థానికులకు, కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబీకులు ఇరువురి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇతర కారణలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.