Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ksr Comments On Andhra Pradesh Election Results
అందుకే సీఎం జగన్‌ విక్టరీ వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్‌సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్‌.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్‌సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్‌లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్‌సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ​్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్‌లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్‌.టీ.ఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్‌సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్‌సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్‌ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్‌సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్‌స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్‌సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Land Issue: Ex-Minister Mallareddy Argue With Police
పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్‌, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్‌ చల్‌ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన ట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేపట్టారు. పోలీస్ స్టేషన్‌లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదుస్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.

CM YS Jagan Mohan Reddy Landed In London
లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌.. శనివారం అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం జగన్‌. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్‌ రాష్ట్రానికి వస్తారు.

Nagababu Reactivates His Twitter Account, Unstable Behaviour Of Naga Babu Creates Controversies
మెగా‘ఆవేశం స్టార్‌’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!

మెగా బ్రదర్‌ నాగబాబుకు తొందర ఎక్కువ. ఏ చిన్న విషయానికైనా ఆవేశంతో ఊగిపోతుంటాడు. కోపం వస్తే ముందు వెనుక ఆలోచించకుండా మాటలు విసిరేస్తూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం ఆయనకు అలవాటు అని సన్నిహితంగా చూసిన వారంతా చెబుతుంటారు. అయితే దేనికైన ఓ హద్దు ఉంటుంది. పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నప్పుడు పొగడ్తలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ విషయం చిరంజీవికి బాగా తెలుసు. అందుకే అతనిపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోడు. అలా పట్టించుకునేవాడు అయితే ఆయన ఈ స్థాయికి ఎదిగేవాడే కాదు. కానీ నాగబాబు మాత్రం చిన్న చిన్న విమర్శలను సైతం తీసుకోలేడు. తొందరపడి ఘాటు వ్యాఖ్యలు చేసి..కాంట్రవర్సీని క్రియేట్‌ చేస్తాడు. ఇప్పటికే అనేకసార్లు ఆవేశంతో ఆయన చేసిన ట్వీట్లు..వివాదానికి దారి తీశాయి. ఇక తాజాగా ఆయన చేసిన పని మెగా కాంపౌండ్‌లో కలకలం రేపింది.మెగా ఫ్యామిలీలో విభేధాలు ఉన్నాయని తానే స్వయంగా బయటపెట్టాడు.పరాయివాడు వాడంటూ బన్నీపై ట్వీట్‌..అంతలోనే!ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు ఓ ట్వీట్‌ చేశాడు.‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ట్వీటే వివాదానికి దారి తీసింది. ఏపీ ఎన్నికల్లో తన మిత్రుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్‌ వెళ్లిన నేపథ్యంలోనే నాగబాబు ఇలా ట్వీట్‌ వేయడంతో బన్నీ ఫ్యాన్స్‌ నాగబాబుపై విపరీతంగా విరుచుకుపడ్డారు. దీంతో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు ఆయన సోషల్‌ మీడియాలో కనిపించలేదు. మళ్లీ ఈ రోజు ఎక్స్‌లోకి వచ్చి ‘ఆ ట్వీట్‌ డిలీట్‌ చేశాను’అని మరో ట్వీట్‌ వేశాడు.(చదవండి: బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు నాగబాబు పరార్.. మళ్లీ ఇప్పుడు ఇలా)దీంతో తను తప్పు చేశానని స్వయంగా నాగబాబే ఒప్పుకున్నట్లు అయింది. గతంలో నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పడు ఆదుకున్నది బన్నీనే. అంతేకాదు జనసేన పార్టీకి రూ. 2 కోట్ల విరాళం కూడా ఇచ్చాడు. అవన్నీ మరిచిపోయి స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బన్నీని పరాయివాడు అంటూ విమర్శించడంతోనే నాగబాబు మనస్తత్వం ఎలాంటితో అర్థమవుతుంది. ఆయనకు తొందరపాటు, దుడుకుతనం లాంటి అవలక్షణాలు ఉన్నాయని చాలా మంది అంటారు. మళ్లీ అది ఇప్పుడు రుజువు అయింది.కాంట్రవర్సీకి కేరాఫ్‌..వివాదాలను కోరి తెచ్చుకోవడం నాగబాబుకు కొత్తేమి కాదు. గతంలోనూ అనేకసార్లు ఆవేశంతో మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్‌ చేశాడు. రెండేళ్ల క్రితం బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన ‘అలయ్‌ బలయ్‌’ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. ‘చిరంజీవి ఫొటో సెషన్‌ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ గరికపాటి సీరియస్‌ అయ్యారు. అయితే గరికపాటి వ్యాఖ్యలను మెగాస్టార్‌ లైట్‌ తీసుకున్నారు. ‘ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’అంటూ ఆ వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ నాగబాబు మాత్రం ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’అంటూ ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌కి గురయ్యాడు. అలాగే ప్రముఖ రచయిన యండమూరి విషయంలోనూ నాగబాబు అతిగా మాట్లాడాడు.యండమూరి వీరేంద్రనాథ్‌-చిరంజీవిల మధ్య కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. అయితే యండమూరి చేసిన కామెంట్స్‌పై చిరంజీవి ఏనాడు స్పందించలేదు. కానీ నాగబాబు మాత్రం పబ్లిక్‌గానే యండమూరిని విమర్శించారు. కట్‌ చేస్తే ఇప్పుడు చిరంజీవి తన బయోపిక్‌ని రాసే అవకాశం యండమూరికే ఇచ్చాడు. ఓ సందర్భంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌పై నాగబాబు ఫైర్‌ అయ్యారు. చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి హాజరైన పవన్ ఫ్యాన్స్ అక్కడ పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. ఎన్నిసార్లు ఈవెంట్లకి పిలిచినా అతడు ఎక్కడికీ రావడం లేదు. దానికి మేమేం చేస్తాం. ఇక్కడికొచ్చి పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడం కాదు.. మీకు దమ్ముంటే ఆయన ఆఫీసుకెళ్లి అక్కడ అరవండి.దేనికయినా ఓపికనేది ఒకటుంటుందని.. దానిని పరీక్షించొద్దు. ప్రతీసారి రావడం పవర్ స్టార్.. పవర్ స్టార్ అరవడం మీకో అలవాటయింది’అని అభిమానులపై నాగబాబు మండిపడ్డాడు. నాగబాబుకి దుడుకుతనం, తొందరపాటు ఉంటుందని చాలా మంది అంటుంటారు. అదినిజమని ఆయన ప్రవర్తతోనే నిరూపించుకుంటున్నాడు.

Deve Gowda breaks silence in Prajwal Revanna case
ఎంపీ ప్రజ్వల్‌ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్‌ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్‌డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్‌ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్‌ అ‍న్నారు. ‘‘హెచ్‌ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కు‍వగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్‌ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్‌ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్‌ ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవటం గమనార్హం.

Heavy Rains to continue in parts of Telangana And AP Until May 23
మే 23 వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో అతి భారీ వ‌ర్షాలు

సాక్షి, హైద‌రాబాద్‌/విజయవాడ: వాతావరణంలో మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేగాక ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తరుచూ వానలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణశాఖ మరో చల్లటి కబురు చెప్పింది.ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. రేప‌టికి (మే 19) బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ మీదుగా శ్రీలంక వ‌రకు ఉప‌రిత‌ల ద్రోణి ఆవ‌రించింది. స‌ముద్ర‌మ‌ట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది.దీని కారణంగా మే 23వ తేదీ వ‌ర‌కు కూడా తెలంగాణ‌, ఏపీలో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిపేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Virat Kohli Big Retirement Hint For Dhoni Ahead Of RCB vs CSK Last Time
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్‌.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్‌

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్‌ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్‌-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఇదే ఆఖరి సీజన్‌ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్‌.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాం.మహీ భాయ్‌ తన ఫినిషింగ్‌ టచ్‌తో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్‌ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్‌పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్‌ గైక్వాడ్‌కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించిన తలా.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌లలో వింటేజ్‌ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్‌లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్‌కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్‌లో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్‌ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్‌!.. అర్జున్‌ టెండుల్కర్‌ ఓవరాక్షన్‌.. ఆ తర్వాత ఇలా!

AP Elections 2024: May 18th Political Updates In Telugu
May 18th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

May 18th AP Elections 2024 News Political Updates తిరుపతి జిల్లానామినేషన్‌ వేసిన రోజున రాళ్ల దాడి చేసింది టీడీపీ వారే:రామచంద్రాపురం మండలం, జడ్పీటీసీ భార్య ఢిల్లీ రాణిపోలింగ్‌ రోజు కూచివారిపల్లెల్లో కోటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది టీడీపీ వాళ్లేముందుగా టీడీపీ దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతి దాడి చేశారువైఎస్సార్‌సీపీ వాహనాలు టీడీపీ వాళ్లు ధ్వంసం చేశారుటీడీపీ వారిపై మాకు వ్యక్తిగత కక్షలు లేవుదౌర్జన్యాలు మేము ఏ రోజు మేము చేయలేదుగాయపడిన వారు ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా దాడి చేశారుకేసులో సంబంధం లేనివారిని కూడా కేసులో ఇరికిస్తున్నారు01.45 PM, May 18th, 2024కడపఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఘర్షణలకు దిగితే చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ మురళీధర్‌హింసాత్మక ఘటనల దృష్ట్యా విజయోత్సవాలు నిషేధంరౌడీ షీటర్లపై ప్రత్యేక​ నిఘా పెట్టాంప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం01.30 PM, May 18th, 2024తిరుపతికి చేరిన సిట్‌ బృందం స్థానిక అధికారులతో సమావేశం పోలింగ్‌, అనంతరం అల్లర్లపై ఆరా తీస్తున్న సిట్‌01.00 PM, May 18th, 2024కృష్ణా జిల్లాఅల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం12.30 PM, May 18th, 2024ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబుహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన నారా లోకేష్‌.. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDPఅసలు స్వరూపంఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbnహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు… pic.twitter.com/TmsKjABRfH— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 12.00 PM, May 18th, 2024దూకుడు పెంచిన సిట్ఎన్నికల హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తునిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్వినీత్ బ్రిజ్ లాల్‌కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన 13 మంది టీం13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్‌లాల్మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్ 11.30 AM, May 18th, 2024తిరుపతిజగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజా​తాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారుమళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది 11.00 AM, May 18th, 2024మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న "పుష్పా " 2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా? 10.30 AM, May 18th, 2024చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్‌పరారీలో టీడీపీ నేత ప్రభాకర్‌పోలింగ్‌ రోజు జరిగిన హత్యాయత్నం కేసు​లో రాజశేఖర్‌ నిందితుడుఅతన్ని పోలీసు స్టేషన్‌ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని 9.30 AM, May 18th, 2024నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబునోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ? అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 9.00 AM, May 18th, 2024అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడపోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర పోలీసులకు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్నముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు8.30 AM, May 18th, 2024హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్‌లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యంమైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్ పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యంగత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యంరెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నంమీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనంటీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్రాత్రి కి రాత్రే పరారీఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలుకూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు 7.45 AM, May 18th, 2024విజయవాడఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభంనిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్‌వినీత్ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకంఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తురేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్ 7.30 AM, May 18th, 2024టీడీపీ దాష్టీకానికి పరాకాష్టకుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్‌ బలివైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదుఆగమేఘాలపై కేసు నమోదుపోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె 7.00 AM, May 18th, 2024కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లుడాక్టర్‌ వైఎస్సార్‌ కల్పించిన వరం...గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువతవిద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మరింత ఊతంకూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు.. 6.30 AM, May 18th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం

New Rules For EPF Death Claim
ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు అలెర్ట్‌.. మారిన విత్‌ డ్రా నిబంధనలు

వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ విత్‌ డ్రాయిల్‌ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్‌ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్‌ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్‌ తప్పని సరి. అయితే ఆధార్‌ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్‌ఓ డబ్బులు విత్‌ డ్రాయిల్‌ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్‌ కార్డ్‌ లేకుండా పీఎఫ్‌ విత్‌ డ్రాయిల్‌ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్‌ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్‌ఓ కార్యాలయం ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జ్‌ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్‌ఓ విత్‌ డ్రాయిల్‌ ప్రాసెస్‌ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్‌ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్‌లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్‌లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్‌ కార్డ్‌ లేకపోతే మరణించిన ఈపీఎఫ్‌ఓ దారుడికి ఆధార్‌ కార్డ్‌ లేకపోతే ఈపీఎఫ్‌ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్‌ డిక్లరేషన్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్‌ డిక్లరేషన్‌ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

Jana Sena Allu Arjun Row: Pothina Slams Naga Babu
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్‌బాబుపై సెటైర్లు

ఎన్టీఆర్‌, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్‌ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్‌గా ట్వీట్‌ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్‌ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ ట్విటర్‌ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్‌ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement