అశ్విన్ ర్యాంకు పదిలం | James Anderson becomes No. 1, R Ashwin 2nd | Sakshi
Sakshi News home page

అశ్విన్ ర్యాంకు పదిలం

May 31 2016 4:11 PM | Updated on Sep 4 2017 1:21 AM

అశ్విన్ ర్యాంకు పదిలం

అశ్విన్ ర్యాంకు పదిలం

అంతర్జాతీయ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్సిన్నర్  రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. అయితే ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిస్థానానికి ఎగబాకాడు.  శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు సాధించిన అండర్సన్ 30 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు.

అండర్సన్ 884 రేటింగ్ పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా, అశ్విన్ 871 పాయింట్లతో రెండో స్థానాన్నికాపాడుకున్నాడు.  అంతకుముందు తొలి స్థానంలో నిలిచిన మరో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 869 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement