'ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నాడు' | Hero Raja takes on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

'ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నాడు'

May 3 2014 12:08 PM | Updated on Mar 22 2019 5:33 PM

'ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నాడు' - Sakshi

'ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నాడు'

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సినీ హీరో రాజా ఆరోపించారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సినీ హీరో రాజా ఆరోపించారు. శనివారం కాకినాడలో విచ్చేసిన హీరో రాజా విలేకర్లతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుల మీద ఆధారపడి మాట్లాడటం కాదని....చేతనైతే ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడాలని  పవన్ కల్యాణ్కు సూచించారు. సినిమా ఇండస్ట్రీలో తను అన్యాయం గురించి ఎప్పుడైనా స్పందించారా అంటూ పవన్ కల్యాణ్ను సూటిగా ప్రశ్నించారు.

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిది అవసరానికి వాడుకుని వదిలేసి తత్వమని రాజా ఈ సందర్బంగా గుర్తు చేశారు. గత ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్ను వాడుకుని వదిలేసినట్లే... ఈ ఎన్నికల్లో జనసేన పవన్ కల్యాణ్ను వాడుకుని తర్వాత వదిలేస్తారని ఆయన చెప్పారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్ను ఓదార్చడానికి వస్తారని పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను ఎదిరించిన ఒకే ఒక్క సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. టీడీపీ, బీజేపీలకు జగన్ ఫోబియా పట్టుకుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement