Short Stories | Sakshi
1

నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపు

నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్‌ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.
Read More
2

కుదిరిన బీజేపీ-జేడీయూ సీట్ల ఒప్పందం!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
Read More
3

బన్నీతో బర్త్ డే సెలబ్రేషన్స్.. అల్లు స్నేహా పోస్ట్

గత నెల 29వ తేదీన అల్లు స్నేహా.. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈసారి భర్త అల్లు అర్జున్‌తో కలిసి ఫారిన్ వెళ్లిపోయింది. అక్కడ తామిద్దరమే పార్టీ చేసుకున్నామని చెబుతూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
Read More
4

బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్‌ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు. క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్‌లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు.
Read More
5

భారత్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌ బ్యాటర్ల అనూహ్య పోరాటం​

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌ ఫాలో ఆన్‌ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ (5/82), జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్‌ క్యాంప్‌బెల్‌ (87), షాయ్‌ హోప్‌ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
Read More
6

హమాస్‌ కొత్త బ్రాండ్‌ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’

హమాస్‌.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్‌ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్‌ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్‌’గా రూపాంతరం చెందింది.
Read More
7

‘ఆమె’ అర్థరాత్రి ఎందుకు బయటకు వెళ్లింది?: సీఎం మమత

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అర్థరాత్రి సమయంలో సదరు విద్యా‍ర్థిని బయటకు వెళ్లడాన్ని మీడియా సమక్షంలో ప్రశ్నించారు.
Read More
8

Samantha: కొత్తింట్లో పూజలు.. జిమ్‌లో వర్కవుట్స్‌

హీరోయిన్‌ సమంత ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్‌రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్‌నెస్‌ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్‌, పర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్‌ సెంటర్‌ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్‌బాల్‌ టీమ్‌ కూడా కొనుగోలు చేసింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసిందిగా.. ఇప్పుడా ఇంట్లో పూజ..
Read More
9

అభిషేక్ బచ్చన్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

బాలీవుడ్ హీరో, బిగ్‌బీ తనయుడు అభిషేక్ బచ్చన్‌ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్‌ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ‍అవార్డ్‌ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్‌ అందుకున్నారు.
Read More
10

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి జట్టు

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి సౌతాఫ్రికాకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లు (బవుమా, కేశవ్‌ మహారాజ్‌, ముల్దర్‌, మార్క్రమ్‌) మారారు.
Read More
11

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్‌ 10 మూవీస్‌ ఇవే

వార్‌ 2(హిందీ వెర్షన్‌)కాంతారా (హిందీ)మహావతార్‌ నరసింహాది ఉమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10వార్‌ 2 (తెలుగు)సన్ ఆఫ్ సర్దార్ 2దడక్‌ 2సయ్యారాఇన్‌స్పెక్టర్‌ జెండెఓడుం కుతిర చాదుం కుతిర
Read More
12

ఎడారిలోన పంట పండెనెంత సందడి!

ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!
13

భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..

ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్‌ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు.
Read More
14

‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్‌

ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. సాక్షిని టార్గెట్‌ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్‌చల్‌ చేశారు. కేసుకు సంబంధించి
Read More
15

జనార్థన్‌ ఫోన్‌ ఎక్కడ?

ఏపీలో నకిలీ మద్యం కేసులో మరో ట్విస్టు. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు ఆరా తీశారు. ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని జనార్ధన్ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్లాన్‌ చేస్తున్నారు. ఇక, జనార్థన్‌ రావు ఫోన్ దొరికితే..
Read More
16

ట్రంప్‌కు చైనా కౌంటర్‌..

అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ.. ట్రంప్‌కు కౌంటర్‌ ఇచ్చింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. ఈ చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని పేర్కొంది. రెండు వైపులా ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వివరించింది. ప్రతీ విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరింపు చర్యలకు దిగడం..
Read More
17

పాక్‌, ఆప్ఘన్‌ బోర్డర్‌లో టెన్షన్..

పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్‌, పాక్‌ మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు సైనికులు 12 మంది చనిపోయినట్టు ఆప్ఘన్‌ ప్రకటించింది. మరోవైపు.. ఆప్ఘన్‌ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌..
Read More
18

సౌతాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ర‌న్న‌ర‌ప్ సౌతాఫ్రికా ప‌సికూన న‌మీబియా ఊహించ‌ని షాకిచ్చింది. శ‌నివారం విండ్‌హోక్ వేదిక‌గా జ‌రిగిన ఏకైక టీ20లో ద‌క్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో న‌మీబియా ఓడించింది. 135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న‌మీబియా 6 వికెట్లు కోల్పోయి చేధించింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జేన్ గ్రీన్(30 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో త‌న చారిత్రత్మ‌క విజ‌యాన్ని అందించాడు.
Read More
19

జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్‌ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్‌రావును అక్టోబర్‌ 17వ తేదీ వరకూ రిమాండ్‌ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
Read More
20

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు.
Read More
21

టీసీఎస్‌ గుడ్‌న్యూస్‌.. ఈసారి ఎక్కువ బోనస్‌!

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉ‍ద్యోగులకు శుభవార్త చెప్పింది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం టీసీఎస్‌ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమాల్ మాట్లాడుతూ తమ 'సీనియర్' ఉద్యోగులకు వ్యక్తిగత పనితీరు ఆధారంగా అధిక వేరియబుల్ వేతనం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.
Read More
22

ప్రధానమంత్రితో రామ్ చరణ్ దంపతులు భేటీ

ప్రధానమంత్రి మోదీని శనివారం మధ్యాహ్నం.. రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని.. భేటీకి గల కారణాన్ని చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?
Read More
23

Go Back To India ఇండియన్‌ యువతిపై రేసిస్ట్‌ దాడి

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" (Go Back To India), రేసిస్ట్‌ వేధింపులకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది.
Read More
24

రూ.9 కోట్ల జాక్‌పాట్ కొద్దిలో మిస్‌ అయ్యేదే.!

ఒక ఫోన్‌ కాల్‌ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకొచ్చిన ఫోన్‌ కాల్‌, ఏ స్పామ్‌ కాలో, స్కామ్‌ కాలో అనుకుంది. ఆ తరువాత అసలు విషయంలో ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు) బహుమతిని గెలుచుకుంది.
Read More
25

నకిలీ మద్యం కేసులో కదులుతున్న డొంక

కిలీ మద్యం కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్‌ రావును అధికాలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ నేతల డొంక కదులుతున్నట్లు సమాచారం.
Read More
26

శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.అంతేకాదు.. ఈ ఏడాది గిల్‌కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్‌.. విరాట్‌ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు.
Read More
27

మొన్న విజయ్‌..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!

విజయ్‌-రష్మికల ఎంగేజ్‌మెంట్‌ ఈ నెల 3న జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మొదట విజయ్‌ పరోక్షంగా బయటకు తెలియజేశాడు. ఇటీవల పుట్టపర్తికి వెళ్లిన విజయ్‌ చేతికి ఉంగరం కనిపించింది. తాజాగా రష్మిక కూడా తన చేతికి ఉంగరం ఉన్న వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిందనే విషయం చెప్పడానికే ఉంగరం ఉన్న వీడియోని పోస్ట్‌ చేశారని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.
Read More
28

బనకచర్లపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మం‍త్రి హరీష్‌రావు బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, సీఎం రేవంత్‌ రెడ్డి తన స్వలాభం కోసమే చూసుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కర్ణాటక, కృష్ణా, ఏపీ ప్రభుత్వాల ప్రాజెక్టులతో తెలంగాణకు నికర జలాలు కూడా..
Read More
29

పేర్ని నానిపై కేసు

కృష్ణా: ఏపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు అయ్యింది. నానితో పాటు 29 మందిపైన చిలకలపూడి పీఎస్‌లో కేసు ఫైల్‌ చేశారు. మేయర్‌ భర్తపై సీఐ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని అక్రమంగా అరెస్ట్‌ చేయగా.. విడిపించేందుకు నాని పీఎస్‌కు వెళ్లారు.. ఆ టైంలో..
Read More
30

గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్‌ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోపంలో తలబాదుకుంటూ క్రీజు వీడాడు.
Read More
31

నా కొడుక్కి సినిమాలపై ఆసక్తి లేదు

స్టార్‌ సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్‌ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలా సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) మొదటి భార్య (అమృత) పిల్లలు ఇబ్రహీం అలీ ఖాన్‌, సారా అలీ ఖాన్‌ కూడా పేరెంట్స్‌ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయితే సైఫ్‌- కరీనా కపూర్‌ (Kareena Kapoor) పిల్లలు మాత్రం యాక్టింగ్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదట! ఈ విషయాన్ని కరీనా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తైమూర్‌కు యాక్టింగ్‌పై ఏమాత్రం ఆసక్తి
Read More
32

ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!

హమ్మయ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపే.. మళ్లీ ఊపందుకున్నాయి. నేడు (అక్టోబర్ 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం బంగారం ధర ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉంది అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
Read More
33

రిషబ్‌కు మరో నేషనల్‌ అవార్డ్‌ వస్తుంది: స్టార్‌ డైరెక్టర్‌

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్‌ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఆయనకు మరోసారి నేషనల్‌ అవార్డ్‌ రావచ్చని స్టార్‌ డైరెక్టర్‌ కామెంట్‌ చేశారు.
Read More
34

తెలంగాణలో మళ్లీ మంత్రుల లొల్లి

హైదరాబాద్‌: అడ్లూరి-పొన్నం మధ్య వివాదం మరిచిపోక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది. మంత్రి కొండా సురేష్‌ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఓ మంత్రిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదీ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి పైనే అని తెలుస్తోంది.
35

బాబోయి.. మళ్లీ చిరుత!

తిరుపతి: ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుత కలకలం రేగింది.శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కనిపించింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బయటకు..
Read More
36

బాబోయ్‌..అవినీతి తిమింగలం, 17 టన్నుల తేనె

కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, కిలోల కొద్దీ వెండి, లెక్కపెట్టలేనంత డబ్బు, లగ్జరీ కార్లు, టన్నుల కొద్దీ తేనె.. ఏంటి లెక్కలు అనుకుంటున్నారా? ఒక అవినీతి తిమింగలం ఇంట్లో దొరికిన అక్రమ సంపద.మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) కి చెందిన రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ భోపాల్ జి పి మెహ్రా అవినీతి బాగోతం దర్యాప్తు అధికారులనే నివ్వరపోయేలా చేసింది.
Read More
37

రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సీనియర్‌ కౌన్సిల్‌తో సోమవారం..
Read More
38

నోబెల్‌ మిస్‌పై ట్రంప్‌ డిఫరెంట్‌ రియాక్షన్‌

వాషింగ్టన్‌: నోబెల్‌ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భిన్నంగా స్పందించారు. ఆ బహుమతి అందుకున్న వ్యక్తి తనకు ఫోన్‌ చేశారని, తన గౌరవార్థమే ఆమె అది తీసుకున్నారంటూ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అయితే తన అవార్డును తనకు ఇచ్చేయాలంటూ ట్రంప్‌..
Read More
39

మచిలీపట్నం పోలీసులకు బిగ్‌ షాక్‌

కృష్ణా: మచిలీపట్నం పోలీసులకు బిగ్‌ షాక్ తగిలింది. నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయగా కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ఆయన రిమాండ్‌ను తిరస్కరిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ పరిణామంపై మాజీ మంత్రి పేర్ని నాని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు.. స్థానిక సీఐ వ్యవహరిస్తున్న తీరుపైనా..
Read More
40

అంతా ట్రంప్‌ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్‌ శాంతి’ విజేత

నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్‌. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా..
Read More
41

నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జనార్ధన్‌రావు అరెస్ట్‌

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 కింగ్ పిన్, టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్‌రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకి వచ్చిన జనార్ధన్ రావును గన్నవరం ఎయిర్ పోర్టులో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.
Read More
42

శాంసంగ్ కొత్త ఫోన్‌ లాంచ్‌.. బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ ఫీచర్లు

‍Samsung Galaxy M17 5G: స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ శుక్రవారం భారత్‌లో లాంచ్ అయింది. ఇది అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. రెండు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ ఫోన్, ఓఐఎస్‌తో 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
Read More
43

ముషీర్ ఖాన్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా

ముంబై, మహారాష్ట్ర రంజీ ట్రోఫీ వార్మాప్ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్‌-పృథ్వీ షా మధ్య చోటు చేసుకున్న వివాదాం సద్దుమణిగింది. ముషీర్‌కు పృథ్వీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. తను అన్నయ్య లాంటివాడిని అని ముషీర్‌కు షా చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ వర్గాలు వెల్లడించాయి. పృథ్వీ షా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ముందు తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చాడు.
Read More
44

అనసూయ ‘అరి’ మూవీ రివ్యూ

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..ప్రస్తుతం వీటి చుట్టూనే మనిషి జీవితం తిరుగుతుంది. ఈ ఆరు బలహీనతలతో ఏదో ఒకటి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి? వాటిని తీర్చుకోవడం కోసం మనిషి ఎంతకు తెగిస్తాడు? అనేది ఈజీగా అర్థమయ్యేలా చూపించిన చిత్రం ‘అరి’. దర్శకుడు రాసుకున్న కథ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ పరంగా తడబడ్డాడు. ఫస్టాఫ్‌ యావరేజ్‌..సెకండాఫ్‌ ఎమోషనల్‌గా సాగుతుంది. చివరి అరగంటలో వచ్చే సిన్స్ హైలెట్‌
Read More
45

'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్‌

‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్‌ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం.
Read More
46

డొనాల్డ్‌ ట్రంప్‌కి బిగ్‌ షాక్‌

ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.
Read More
47

మరియా కొరీనా మచాడోకు నోడెల్‌ శాంతి పురస్కారం

వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికిగాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్‌ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు.
Read More
48

అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్‌

వెస్టిండీస్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్‌.. సునీల్‌ గవాస్కర్ (68) తర్వాత భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Read More
49

శభాష్‌.. జస్ట్‌ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లు!

సొంతింటి కల అనేది చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. ఇంటి పని కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ కేవలం 10 లక్షల లోన్‌తో 60లక్షలతో అదీ సూరత్‌ లాంటి మహానగరంలో ఇల్లును కొనుగోలు చేయడం అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది.
Read More
50

సహజీవనంతో జాగ్రత్త, అనాథాశ్రమాల్ని చూడండి గవర్నర్

ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలక సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక, వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, మసలుకోవాలన్నారు. ఇంకా తెలియాలంటే అనాథాశ్రమాల్లో ఏడాదిబిడ్డలతో లైన్‌లో ఉంటున్న వారిని చూడాలన్నారు.
Read More