Short Stories | Sakshi
1

ప్రముఖ ఐఏఎస్‌ఫై అవినీతి దుమారం.. 51 కోట్ల ఫైన్ 4వేలకు తగ్గించారా?

భోపాల్‌: ప్రముఖ ఐఏఎస్‌ అధికారిణి సృష్టి దేశ్‌ముఖ్‌ గౌడ భర్త ఐఏఎస్‌ నాగార్జున బి.గౌడ చుట్టూ అవినీతి అరోపణల ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్‌ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ కంపెనీకి భారీ మొత్తంలో ప్రభుత్వం జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోట్ల నుంచి రూ.10వేల లోపుకు తగ్గించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. ఆ అవినీతి ఆరోపణల్ని జిల్లా మేజిస్ట్రేట్ మేజ సిద్ధార్థ్
Read More
2

కాంతార చాప్టర్-1.. జైలర్‌, లియో రికార్డ్స్ బ్రేక్!

రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్‌లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.
Read More
3

కాబోయే వాడు హగ్‌ చేసుకున్నాడని రూ. 3.73లక్షల డిమాండ్‌..

ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తంతు ముగిస్తే చాలు.. ఇక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నారు. పాత కాలంలో అమ్మాయి-అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడమే గగనమైతే.. ఇప్పుడు ఆ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది.
Read More
4

ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్‌

సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్‌ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
Read More
5

EPFO శుభవార్త: 100 శాతం పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌(EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్‌ సొమ్మును (PF) పూర్తిగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో ఆమోదం తెలిపింది. ఈమేరకు నిబంధనలను సరళీకృతం చేసింది. సభ్యులు ఇప్పుడు ఉద్యోగి, యజమాని విరాళాలతో సహా అర్హత కలిగిన బ్యాలెన్స్ లలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
Read More
6

‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా

డీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్‌రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Read More
7

బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్‌

బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ చాలా ప్రసిద్ధి చెందింది. ఇటీవల బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Read More
8

ప్రపంచంలోనే ఖరీదైన బ్యాగు.. నీతా అంబానీ సొంతం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నీతా అంబానీ మనీష్‌ మల్హోత్రా దివాలీ బాష్‌లో స్టన్నింగ్‌ లుక్‌తో అలరించారు. నీతా ధరించిన చీర, చిన్న బ్యాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రప్రపంచంలోనే ఖరీదైన హెర్మేస్ బిర్కిన్ స్పెషల్ ఎడిషన్ మినీయేచర్ బ్యాగ్‌ నెట్టింట సందడి చేస్తోంది. తీసుకెళ్లారు. 3,025 వజ్రలు, 18 కే గోల్డ్‌తో రూపొందించారు. అలాగే చిన్నకోడలు రాధికా మర్చంట్‌తో కలిసి రావడం మరింత స్పెషల్‌.
Read More
9

ఆ కోటు వేసుకోవాలనేది డ్రీమ్‌..కానీ డబ్బుల్లేక!

డిజిటల్ క్రియేటర్‌, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్‌ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ ఈవెంట్‌లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్‌ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్‌ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆరోజు కేవలం జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్‌ చేశారు.
Read More
10

ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్‌ పిక్నిక్‌కి అదే రూటు

న్యూయార్క్‌ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్‌ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్‌ పార్క్‌ జూ బెథెస్డా టెర్రస్‌ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది.
11

అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్‌ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్‌..!

కొన్ని సక్సెస్‌ స్టోరీలు ఎంతలా ప్రేరేపిస్తాయంటే.. జీరో నుంచి మిలియనీర్‌గా అవతరించడం ఎలా అనేది నేర్పిస్తాయి. తాతల తండ్రులు కాస్త సంపాదించే పెడితే కదా జీవితం బాగుండేది..మంచి చదువులు చదవగలిగేది అనుకుంటారు చాలామంది. అవన్నీ సాధించడం చేతకాని వాడు చెప్పే చెత్తకబుర్లే అవి పలువురు విజేతలు ప్రూవ్‌ చేశారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి.
Read More
12

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ చిత్రాలు రానుండగా.. ఓటీటీల్లోకి మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు పలు డబ్బింగ్ బొమ్మలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?
Read More
13

వైల్డ్‌ ఫైర్‌ మాధురి.. మొదటిరోజే కంటతడి

బిగ్‌బాస్‌ షోలో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి. ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్‌.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్‌ అంటూ హౌస్‌మేట్స్‌కు వార్నింగ్‌ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. హౌస్‌లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది. కిచెన్‌లో కల్యాణ్‌, దివ్యతో కయ్యానికి కాలు చాపింది. వాళ్లు తిరిగి అరిచేసరికి..
Read More
14

Nobel Prize 2025: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ముగ్గుర్ని వరించింది. జోయెల్‌ మోకిర్‌, ఫీటర్‌ హౌవీట్‌, ఫిలిప్‌ అఘియన్‌లు నోబెల్‌ గెలుచుకున్నారు. ఆర్థికశాస్త్రంలో వీరు చేసిన విశేష కృషికి గాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది నోబెల్‌ కమిటీ.
Read More
15

వీరోచిత శతకాలు.. చరిత్ర తిరిగరాసిన విండీస్‌ బ్యాటర్లు

న్యూఢిల్లీ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ బ్యాటర్లు జాన్‌ క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌ వీరోచిత శతకాలు బాది 51 కిందటి రికార్డును తిరగరాశారు. 1974లో చివరిగా ఇద్దరు విండీస్‌ ఆటగాళ్లు భారత గడ్డపై ఓ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. తిరిగి ఇప్పుడు క్యాంప్‌బెల్‌, హోప్‌ ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గ్రీనిడ్జ్‌, క్లైవ్‌ లాయిడ్‌ సెంచరీలు చేశారు.
Read More
16

రాయుడి కేసులో మరో ట్విస్ట్‌!

చెన్నై: జనసేన బహిష్కృత నేత వినుత కోటా మాజీ డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలతో రాయుడికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో వైరల్‌ అవుతున్న క్రమంలోనే వినూత కోటా సెల్పీ వీడియో ఒకటి తెర మీదకు వచ్చింది. అందులో..
Read More
17

ఎన్‌హెచ్‌ఆర్సీలో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

ఢిల్లీ: కురుపాం గిరిజన గురుకుల విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి ప్రబలిన ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తోంది. సోమవారం వైఎస్సార్‌సీపీ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్‌ను కలిసి ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ బృందంలో ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర, మాజీ ఎంపీ మాధవి, నేతలు పరీక్షిత్ రాజు తదితరులు..
Read More
18

బిహార్‌ వైస్‌ కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం బిహార్ క్రికెట్ అసోయేషిన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టు వైస్ కెప్టెన్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. కెప్టెన్ సకిబుల్ గని డిప్యూటీగా వైభవ్ వ్యవహరించనున్నాడు. ఈ 14 ఏళ్ల యువ క్రికెటర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ టూర్‌లో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే బీసీఎ అతడికి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్‌ ఇచ్చింది.
Read More
19

ఎన్నికల వేళ.. లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌

బీహార్‌లో ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి లాలూ, రబ్రీ, తేజస్వీపై అభియోగాలు మోపాలని ఢిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ స్కామ్‌లో లాలూ.. కుట్రకు పాల్పడ్డారని, తన పదవిని దుర్వినియోగం చేశారని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పూరి, రాంచీ హోటల్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణ..
Read More
20

రూ.1.95 లక్షల వద్ద వెండి: దూసుకెళ్తున్న బంగారం!

భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు (అక్టోబర్ 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 320 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.
Read More
21

జైస్వాల్‌ అంటే గిల్‌కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ భారీ శతకం బాదాడు. మొత్తంగా 258 బంతులు ఎదుర్కొనని 175 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. రనౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో మరో ఎండ్‌లో ఉన్న గిల్‌పై ట్రోల్స్‌ రాగా.. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు.
Read More
22

‘కోల్డ్‌రిఫ్‌’ ఎఫెక్ట్‌.. తమిళనాడులో ఈడీ సోదాలు

మధ్యప్రదేశ్‌లో 22 మంది చిన్నారుల మృతికి కారణమైన ‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్‌ ఫార్మా సంస్థపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. చెన్నైలో శ్రీసన్‌ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్‌ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహి..
Read More
23

కరూర్‌ ఘటన.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ: కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజయ్‌ టీవీకే మొదటి నుంచి డిమాండ్‌ చేస్తోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జితో కమిటీ వేయగా.. మరోవైపు మద్రాస్‌ హైకోర్టు మాత్రం పోలీస్‌ అధికారితో సిట్‌నకు ఆదేశించింది. ఈ తరుణంలో.. సుప్రీం కోర్టు సంచలన ప్రకటన చేసింది.
Read More
24

బాలకృష్ణకు చేదు అనుభవం

శ్రీసత్యసాయి జిల్లా: తెలుగు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన నివాసం ఎదుట ఓ రైతు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ని అడ్డుకుని పీఎస్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఆయన ఎందుకు..
Read More
25

తుపాను బీభత్సం.. నీట మునిగిన సిటీ..

మెక్సికోలో మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మేయర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆగ్రహంతో స్థానికులు.. మేయర్‌ వాహనంపై రాళ్లు రువ్వి, బురద చల్లారు. విపత్తు సమయంలో ముందస్తుగా తమను ఎందుకు హెచ్చరించలే..
Read More
26

పవన్‌, నాదెండ్లను ఏకిపారేసిన నెటిజన్లు

తిత్లీ తుపాను సమయంలో 2018 అక్టోబర్‌ 12వ తేదీన పవన్‌ కళ్యాణ్‌తో కలిసి తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయా­లను గుర్తు చేసుకుంటూ జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టును ట్యాగ్‌ చేస్తూ పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ‘ఆ పర్యటనలో మేం అక్కడివారితో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగలేదు అనడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు కౌంటరిస్తూ..
Read More
27

ఆర్థిక సమస్యలతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా!

తిరువనంతపురం: కేరళ తరఫున ఏకైక లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి ఈ మధ్య తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. సినిమాల కోసం తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తానెప్పుడూ సినిమాలు వదులుకుని మంత్రి పదవి చేపట్టాలని అనుకోలేదన్న ఆయన.. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. అంతేకాదు తన ప్లేస్‌లో..
Read More
28

బాలకృష్ణకు బిగ్‌ షాక్‌..

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుము­ట్టా­రు. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్‌ రా­లే­దని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటు­న్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు..
Read More
29

కడప నగరంలో విషాదం

వైఎస్సార్‌ జిల్లా: కడప నగరంలో ఆదివారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యభర్తలు తమ ఏడాది బిడ్డతో గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో మృతదేహాలు చెల్లాచెదురై పడిపోయాయి. అదే సమయంలో.. ఆ ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందంటే..
Read More
30

యుద్ధం ముగిసిందోచ్‌

వాషింగ్టన్‌: రెండేళ్ల నిరీక్షణ ఫలించబోతోంది. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నవాళ్లు ఇవాళే విడుదల కాబోతున్నారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ మెడలు వంచి మరీ శాంతి ప్రణాళిక ఒప్పందాన్ని కుదిర్చాననే భావనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నారు. అలాగే.. ఈజిప్ట్‌, ఖతార్‌, టర్కీల చొరవతోనే ఈ ఒప్పందం కుదిరిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో తొలిసారి పశ్చిమాసియాకు బయల్దేరిన ట్రంప్‌.. కీలక ప్రకటన చేశారు.
Read More
31

నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపు

నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్‌ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.
Read More
32

కుదిరిన బీజేపీ-జేడీయూ సీట్ల ఒప్పందం!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
Read More
33

బన్నీతో బర్త్ డే సెలబ్రేషన్స్.. అల్లు స్నేహా పోస్ట్

గత నెల 29వ తేదీన అల్లు స్నేహా.. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈసారి భర్త అల్లు అర్జున్‌తో కలిసి ఫారిన్ వెళ్లిపోయింది. అక్కడ తామిద్దరమే పార్టీ చేసుకున్నామని చెబుతూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
Read More
34

బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్‌ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు. క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్‌లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు.
Read More
35

భారత్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌ బ్యాటర్ల అనూహ్య పోరాటం​

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌ ఫాలో ఆన్‌ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ (5/82), జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్‌ క్యాంప్‌బెల్‌ (87), షాయ్‌ హోప్‌ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
Read More
36

హమాస్‌ కొత్త బ్రాండ్‌ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’

హమాస్‌.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్‌ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్‌ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్‌’గా రూపాంతరం చెందింది.
Read More
37

‘ఆమె’ అర్థరాత్రి ఎందుకు బయటకు వెళ్లింది?: సీఎం మమత

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అర్థరాత్రి సమయంలో సదరు విద్యా‍ర్థిని బయటకు వెళ్లడాన్ని మీడియా సమక్షంలో ప్రశ్నించారు.
Read More
38

Samantha: కొత్తింట్లో పూజలు.. జిమ్‌లో వర్కవుట్స్‌

హీరోయిన్‌ సమంత ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్‌రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్‌నెస్‌ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్‌, పర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్‌ సెంటర్‌ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్‌బాల్‌ టీమ్‌ కూడా కొనుగోలు చేసింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసిందిగా.. ఇప్పుడా ఇంట్లో పూజ..
Read More
39

అభిషేక్ బచ్చన్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

బాలీవుడ్ హీరో, బిగ్‌బీ తనయుడు అభిషేక్ బచ్చన్‌ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్‌ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ‍అవార్డ్‌ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్‌ అందుకున్నారు.
Read More
40

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి జట్టు

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి సౌతాఫ్రికాకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లు (బవుమా, కేశవ్‌ మహారాజ్‌, ముల్దర్‌, మార్క్రమ్‌) మారారు.
Read More
41

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్‌ 10 మూవీస్‌ ఇవే

వార్‌ 2(హిందీ వెర్షన్‌)కాంతారా (హిందీ)మహావతార్‌ నరసింహాది ఉమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10వార్‌ 2 (తెలుగు)సన్ ఆఫ్ సర్దార్ 2దడక్‌ 2సయ్యారాఇన్‌స్పెక్టర్‌ జెండెఓడుం కుతిర చాదుం కుతిర
Read More
42

ఎడారిలోన పంట పండెనెంత సందడి!

ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!
43

భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..

ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్‌ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు.
Read More
44

‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్‌

ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. సాక్షిని టార్గెట్‌ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్‌చల్‌ చేశారు. కేసుకు సంబంధించి
Read More
45

జనార్థన్‌ ఫోన్‌ ఎక్కడ?

ఏపీలో నకిలీ మద్యం కేసులో మరో ట్విస్టు. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు ఆరా తీశారు. ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని జనార్ధన్ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్లాన్‌ చేస్తున్నారు. ఇక, జనార్థన్‌ రావు ఫోన్ దొరికితే..
Read More
46

ట్రంప్‌కు చైనా కౌంటర్‌..

అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ.. ట్రంప్‌కు కౌంటర్‌ ఇచ్చింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. ఈ చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని పేర్కొంది. రెండు వైపులా ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వివరించింది. ప్రతీ విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరింపు చర్యలకు దిగడం..
Read More
47

పాక్‌, ఆప్ఘన్‌ బోర్డర్‌లో టెన్షన్..

పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్‌, పాక్‌ మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు సైనికులు 12 మంది చనిపోయినట్టు ఆప్ఘన్‌ ప్రకటించింది. మరోవైపు.. ఆప్ఘన్‌ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌..
Read More
48

సౌతాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ర‌న్న‌ర‌ప్ సౌతాఫ్రికా ప‌సికూన న‌మీబియా ఊహించ‌ని షాకిచ్చింది. శ‌నివారం విండ్‌హోక్ వేదిక‌గా జ‌రిగిన ఏకైక టీ20లో ద‌క్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో న‌మీబియా ఓడించింది. 135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న‌మీబియా 6 వికెట్లు కోల్పోయి చేధించింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జేన్ గ్రీన్(30 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో త‌న చారిత్రత్మ‌క విజ‌యాన్ని అందించాడు.
Read More
49

జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్‌ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్‌రావును అక్టోబర్‌ 17వ తేదీ వరకూ రిమాండ్‌ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
Read More
50

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు.
Read More