Short Stories | Sakshi
1

'శివ' రీ రిలీజ్‌.. బన్నీ పోస్టర్‌ రిలీజ్‌..!

అక్కినేని నాగార్జున నటించిన కల్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్‌లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్‌ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌గానూ నిలిచింది.
Read More
2

వైద్యురాలిపై పోలీసుల లైంగిక వేదింపు, అరచేతిలో సూసైడ్‌ నోట్‌ కలకలం

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలి ఆత్మహత్య కలకలి రేపింది. ఆమె హోటల్‌ గదిలో మృతి చెంది కనిపించడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. గురువారం రాత్రి ఈ ఆత్మహత్య వెలుగులోకి రావడంతో శుక్రవారం నిందితుడైన పోలీసును సస్పెండ్ చేశారు.
Read More
3

లైంగిక ఆరోపణల కేసులో సంచిన్‌ సంఘ్వి

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు,సచిన్ సంఘ్విపై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
4

'లోక' ఓటీటీ అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆగస్టు చివరలో రిలీజైన 'లోక' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. రూ.40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలోకి రానుందంటే?
Read More
5

ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న పాకిస్తాన్‌

నవంబర్‌ 28 నుంచి భారత్‌లో జరగాల్సిన పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌కప్‌ నుంచి పాకిస్తాన్‌ తప్పుకుంది. భారత్‌తో సత్సంబంధాలు లేని కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్తాన్‌ హాకీ ఫెడరేషన్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన హాకీ టోర్నీ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్‌కు ఇది రెండోసారి.
Read More
6

నన్నెందుకు కెప్టెన్‌ చేశారు?

‘‘కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రతి కెప్టెన్‌ మదిలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. గిల్‌ కూడా ఇందుకు అతీతం కాదు. అతడి జట్టులో ఇప్పుడు రోహిత్‌ శర్మ ఉన్నాడు. ఇప్పటికే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న దిగ్గజం. అతడి సారథ్యంలో గిల్‌ ఆడాడు. కెప్టెన్‌గా రోహిత్‌ ఎలాంటి తప్పూ చేయలేదని గిల్‌కు బాగా తెలుసు’’ అంటూ మాజీ బ్యాటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ గిల్‌ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు.
Read More
7

ఆ సీన్‌ డిలీట్‌ చేయమన్న తెలుగు హీరోయిన్‌

మానస చౌదరి.. బబుల్‌గమ్‌ మూవీతో తెరంగేట్రం చేసింది. లక్కీ భాస్కర్‌ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఆర్యన్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. ఇందులో విష్ణు విశాల్‌ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్‌ 31న విడుదల కానుంది. ఈ మూవీలో ఒక రొమాంటిక్‌ సాంగ్‌ ఉంది. అందులో ఒక ముద్దు సన్నివేశం షూట్‌ చేశారట.. అంతా అయిపోయాక దానిపై మానస (Maanasa Choudhary) అభ్యంతరం చెప్పిందంటున్నాడు హీరో. ఆ సీన్‌ సినిమాలో..
Read More
8

కుల్దీప్‌ యాదవ్‌కు నో ఛాన్స్‌.. గంభీర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

అడిలైడ్‌లో 17 ఏళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టు తొలిసారి ఓ వ‌న్డే మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర‌వ‌తున్నారు. స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ను ఎందుకు ఆడించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. గంభీర్ ఆల్‌రౌండ‌ర్ల వ్యూహాం అట్ట‌ర్ ప్లాప్ అయింద‌ని మండిప‌డుతున్నారు. కాగా అడిలైడ్‌ వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
Read More
9

పసిడి ధరలు రివర్స్‌! తులం బంగారం ఒ‍క్కసారిగా..

పసిడి ప్రియుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొన్ని రోజులుగా తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు ఒక్కసారి రివర్స్‌ అయ్యాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజు కూడా భారీగా దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
10

కర్నూలులో డెత్‌ జర్నీ

కర్నూలు: ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కి పడ్డాయి. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు తగలబడిపోయింది. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. ప్రమాదం నుంచి డ్రైవర్‌, హెల్పర్‌ సహా 12 మంది ప్రయాణికులు మాత్రమే తప్పించుకున్నారు. ప్రయాణికులు 40 మంది ఉండడంతో మిగతా వాళ్లు సజీవ దహనం అయ్యి ఉంటారని..
Read More
11

అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్‌ రవ్దీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్‌లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.
Read More
12

ఆ 600 మందికి గోల్డెన్‌ చాన్స్‌ : కోట్ల రూపాయల ఆఫర్‌!

ప్రముఖ టెక్ సంస్థ మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్దమైంది. మెటాలోని సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగం నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ నేపథ్యంలో ఒక భారతీయ స్టార్టప్‌ సంస్థ వార్తల్లో నిలిచింది. రూ. 1.75 - 5.27 కోట్ల దాకా వేతనంతో స్మాలెస్ట్‌ ఏఐ ఫౌండర​ సుదర్శన్‌ కామత్‌ ఆఫర్‌ ఇస్తూ ట్వీట్‌ చేశారు.
Read More
13

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్‌...కొత్తింటి ఫోటోలు వైరల్‌

బాలీవుడ్‌లో స్వీటెస్‌ కపుల్‌ అనగానే గుర్తొచ్చే జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌. తాజాగా దీపావళి సందర్బంగా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ముంబైలోని తమ డ్రీమ్‌ హౌస్‌గురించి కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇవి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Read More
14

కేరళలోని లావణ్య, విష్ణు పెళ్లి వైరల్‌ : ఎందుకో తెలుసా? 

కేరళలోని కవస్సేరిలో జరిగిన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు, నూతన వధూవరులు లావణ్య ,విష్ణు వివాహం చేసుకున్నారు. మ్యారేజ్‌ హాలులోనే పంచాయితీ అధికారి ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడమే ఈ స్టోరీలోని ప్రత్యేకత. వివాహ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'K-SMART' అనే డిజిటల్ వేదిక ద్వారా ఇది సాధ్యమైంది.
Read More

ఆపరేషన్‌ మధ్యలో క్లారినెట్‌ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు

ఇటీవల బ్రెయిన్‌కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్‌ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒ​క మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్‌ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!
Read More
16

ఆ ప్రొఫెసర్‌కు 150 ప్లస్‌ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!

మహా అయితే రెండో, మూడో డిగ్రీలు చేస్తారు. గానీ ఇన్ని డిగ్రీలా..జీవితాంతం చదువుతూ ఉండటం అంటే.. అది సాధ్యం కాని పని. అయితే ఈ ప్రోఫెసర్‌ దాన్ని సాధ్యం చేసి చూపడమే కాదు ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో వింటే కంగుతింటారు. మరి అన్ని డిగ్రీలు చేసేందుకు డబ్బు కూడా వెచ్చించాల్సిందే కదా..!. మరి అదంతా ఆయనకు ఎలా సాధ్యమైంది..ఇలా జీవితాంత చదువుతూ ఉండాలనేంత ఇంట్రస్ట్‌ ఎలా కలిగింది అంటే..
Read More
17

హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్‌ అలా ఉండేదా..?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ నటుడు. ప్రతి సినిమా కోసం తన ఆకృతిని చాల సునాయాసంగా మార్చుకుంటాడు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా నిబద్ధతను చూపిస్తారు. అయితే ప్రబాస్‌ ఇలా సినిమా కోసం ఇంతలా తన బాడీలో వేరియేషన్‌ చూపించాలంటే డైట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
Read More
18

సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం.. ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బ్రూక్‌

న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌లో మరో మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఆక్లాండ్‌ వేదికగా జరగాల్సిన మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్‌ ఇంగ్లండ్‌ వశమైంది. ఆ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్‌కు ప్లేయర​్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది.
Read More
19

కొనసాగుతున్న క్రాష్‌.. బంగారం, వెండి మళ్లీ డౌన్

బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున భారీగా పడిపోయిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు కూడా దిగొచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు మోస్తరుగా తగ్గాయి.
Read More
20

బాలయ్యవి తాగుబోతు మాటలు

తాడేపల్లి: సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీలో చర్చ సందర్భంగా కామినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను ప్రస్తావించడం, చిరును పరుషపదజాలంతో ప్రస్తావిస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై వైఎస్‌ జగన్‌ స్పందించారు.. తాగి వచ్చిన వ్యక్తిని అసలు..
Read More
21

ఉపాసన గుడ్‌న్యూస్‌.. రెండోసారి తండ్రి కానున్న రామ్‌ చరణ్‌

నటుడు రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ దీపావళి తనకు డబుల్‌ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. డబుల్‌ ప్రేమ, డబుల్‌ బ్లెసింగ్స్‌ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటనతో పాటు ఒక వీడియోను పంచుకున్నారు. అందులో..
Read More
22

డకౌట్‌ తర్వాత కోహ్లి చర్య వైరల్‌.. గుడ్‌బై చెప్పేశాడా?

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్‌ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. అడిలైడ్‌ వేదికగా రెండో వన్డే లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అవుటైన తర్వాత పెవిలియన్‌కు చేరే క్రమంలో కోహ్లి గ్లోవ్స్‌ తీసి.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ డ్రెసింగ్‌ రూమ్‌ వైపు వెళ్లడం రిటైర్మెంట్‌ వదంతులకు ఊతమిచ్చింది.
Read More
23

కామాంధుడి సూసైడ్‌!

కాకినాడ: తునిలో బాలికపై లైంగిక దాడికి యత్నించి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ నేత నారాయణరావు కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వాష్‌రూమ్‌కని చెప్పి పోలీసుల కళ్లు గప్పి చెరువులో దూకేశాడు నిందితుడు. అయితే గజ ఈతగాళ్లతో చాలా సేపు గాలించాక ఆ మృతదేహం బయటపడింది. మెజిస్ట్రేట్‌ ముందు అర్దరాత్రి సమయంలో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా..
Read More
24

ఆ సినిమా డిజాస్టర్‌.. తీవ్ర నిరాశకు గురయ్యా

అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం బైసన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా వస్తోన్న బైసన్ మూవీ తెలుగులోనూ రిలీజవుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం బైసన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ.
Read More
25

ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..! ఏకంగా రెండుసార్లు కేన్సర్‌ బారినపడ్డప్పటికీ..

నేర్చుకోవాలనే అంతులేని తపనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు కొందరు. పైగా మంచి ఉన్నత పొజిషన్‌లో పనిచేసి పదవీ విరమణ పొందాక కూడా విద్యను అభ్యసించడం అంటే మాటలు కాదకదా..!. చదవాలన్న కోరిక ఉన్నా..వయసు సహకరించదు. పోనీ కొత్తగా ఆ స్పీడ్‌ టెక్నాలజీని అందుకుంటూ చదవాలంటే వామ్మో అనేస్తారు ఎవ్వరైనా..కానీ ఈ 80 ఏళ్ల మహిళ వాటన్నింటిని ఖతారు చేస్తూ..దిగ్విజయంగా ఎంబిఏ పూర్తి చేసింది. రెండుసార్లు కేన్సర్‌తో పోరాడి గెలిచ
Read More
26

మహిళలను జిహాదీలుతీర్చిదిద్దే ప్లాన్‌లో జేషే మహ్మద్‌

ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్‌ సంస్థ తన పంథాను మార్చుకుని మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌ (Jaish-e-Mohammed) కేవలం మహిళలతో జీహాదీ గ్రూప్‌ను తయారుచేస్తున్నది. దీంతో పాటు వసూళ్లను కూడా ముమ్మరం చేస్తోంది.
Read More
27

ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకునే వెలుగుల పండగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపు కుంటారు. ఇందులో ఒకటి అన్నా చెల్లెళ్ల పండగ ‘భగినీహస్త భోజనం’. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు, ఆనంద , శ్రేయస్సు కోసం యముడిని పూజించడం ద్వారా, వారి నుదుటిపై తిలకం (చంద్రుని గుర్తు) పూయడం ద్వారా, పవిత్ర తోరం (రక్షా సూ
Read More
28

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. ‘నేనే మాగంటి గోపినాథ్‌ వారసుడిని’..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్‌ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ వారసుడిని తానేనంటూ తారక్‌ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.
Read More
29

వార్‌ 2 రిజల్ట్‌పై తొలిసారి స్పందించిన నాగవంశీ

హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించిన వార్‌ 2 మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చింది. ఈ మూవీని తెలుగులో నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందు నాగవంశీ.. ఇది అద్భుతమైన సినిమా.. ఆ ఫీలింగ్‌ మీకు కలగకపోతే ఇంకెన్నడూ నేను మైక్‌ పట్టుకుని సినిమా చూడమని అడగను అంటూ భారీ డైలాగులు పేల్చాడు. తీరా మూవీ ఫ్లాప్‌ అవడంతో ట్రోల్‌ అయ్యాడు. తాజాగా వార్‌ 2 ఫలితంపై నాగవంశీ...
Read More
30

China: మెరుపు తీగతో బుల్లెట్‌ రైలు పోటీ

న్యూఢిల్లీ: బుల్లెట్‌ రైళ్ల వేగంలో చైనా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చైనా తయారు చేసిన తాజా బుల్లెట్ రైలు సీఆర్‌ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్‌లోనే గంటకు 453 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంది.
Read More
31

చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ స్పిన్నర్‌.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

పాకిస్తాన్‌ వెటరన్‌ స్పిన్నర్‌ ఆసిఫ్‌ అఫ్రిది అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించి.. అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా (38 ఏళ్ల 299 రోజులు), 92 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్‌కు చెందిన ఛార్లెస్‌ మారియట్‌ (37 ఏళ్ల 332 రోజులు) పేరిట ఉండేది.
Read More
32

TG: ‘అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయండి’

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్‌ పోస్టులు తక్షణం మూసిఏయాలనే ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోరి అన్ని ట్రాన్స్‌పోర్ట్‌ చెక్‌పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.
Read More
33

మెహుల్‌ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు

న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు ఎగవేసి, దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్‌ ఛోక్సీని దేశానికి రప్పించడంలో భారత్‌ విజయం సాధించింది. మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని బెల్జియం కోర్టు స్పష్టం చేసింది.
Read More
34

దోచిపెట్టేందుకు కాలేజీలు ప్రైవేటుపరం

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య అని సజ్జల మండిపడ్డారు. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్‌ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది. పీపీపీ అంటే ప్రయివేటీ.
Read More
35

జపాన్‌లో ‘ట్రంప్‌’ పాలన?.. వలసదారులపై ‘తకైచి’ ఉక్కుపాదం

టోక్యో: జపాన్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. తొలి మహిళా ప్రధానిగా 64 ఏళ్ల సనే తకైచి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో తకైచి అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే మెజార్టీ సాధించి, అనూహ్య విజయం దక్కించకున్నారు. అధికారాన్ని అందుకున్న వెంటనే తకైచి తనదైన పాలనకు శ్రీకారం చుట్టారు.
Read More
36

కోహ్లి, రోహిత్‌ అందుకే ఫెయిల్‌ అయ్యారు: టీమిండియా కోచ్‌

దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేసిన దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి , రోహిత్‌ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఓపెనర్‌ రోహిత్‌ .. 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కోహ్లి డకౌట్‌ అయి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో రో- కో వైఫల్యంపై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.
Read More
37

Delhi: యజమాని తిట్టాడని.. అతని ఐదేళ్ల కుమారునిపై పాశవిక దాడి

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ‍ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్‌ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రే​కెత్తించింది.
Read More
38

ట్రంప్‌నకు థ్యాంక్స్‌

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడంటూ మరోసారి ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలో ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం కుదరాల్సి ఉందన్న ఆయన.. భారీగా చమురును రష్యా నుంచి కొనడం భారత్‌ ఆపేయబోతోందంటూ కామెంట్‌ చేశారు. అయితే తాజాగా మోదీ ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలియజేస్తూ..
Read More
39

ఓటీటీలో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్

ఓటీటీల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ చిత్రాలకు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. 2023లో విడుదలై నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హారర్ మూవీ వాష్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గుజరాతీలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్‌ చేశారు.
Read More
40

అమిత్ షా కామెంట్స్‌.. నితీశ్‌కు టెన్ష‌న్‌!

బిహార్ శాస‌నస‌భ ఎన్నికల పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. మొద‌టి ద‌శ పోలింగ్‌కు స‌రిగ్గా 15 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ప్ర‌ధాన కూట‌ములు ఎన్డీఏ, మ‌హాఘ‌ఠ్‌బంద‌న్ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఒక‌వేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్య‌మంత్రి పీఠం ఎవ‌రు అధిష్టిస్తార‌నే అనుమానం..
Read More
41

పండుగ వేళ, భక్తులకు వెండి నాణేలు

అటు దేశవ్యాప్తంగా, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. చిన్నాపెద్దా కులమత భేదాలు లేకుండా వెలుగుల పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. వెండి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు భక్తులు తరలి వచ్చారు.
Read More
42

లోక్‌పాల్‌లో ఒక్కొక్కరికి రూ.5 కోట్ల కారా : తిట్టిపోస్తున్న జనం

దేశంలోని అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ అయిన లోక్‌పాల్ లగ్జరీ కార్లకోసం అన్వేషిస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ ఏజెన్సీల నుండి ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తోందన్న వార్త నెట్టింట తీవ్ర చర్చకు తెరతీసింది.అక్టోబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్‌లో లోక్‌పాల్‌ 7 హైఎండ్‌ BMW 3 సిరీస్ Li కార్లను ఏడింటిని కొనుగోలు చేయడానికి టెండర్‌ను పిలిచింది.
Read More
43

దీపావళి బోనస్ ఇవ్వలేదని భారీ నష్టం తెచ్చారు!

దీపావళి బోనస్ (Diwali Bonus) ఇవ్వకపోవడంపై నిరసనగా ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగించింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేలోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం గంటలపాటు గేట్లు తెరిచి ఉంచడంతో వేలాది వాహనాలు టోల్ చెల్లించకుండా టోల్‌ గేట్‌ దాటి వెళ్లిపోయాయి. 10 గంటల పాటు కొనసాగిన ధర్నా అధికారులు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత విరమించారు.
Read More
44

'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ

ఆడపిల్లలను ఇంటి లక్ష్మిగా కీర్తిస్తుంటారు మన పెద్దలు. ఆ విషయాన్ని గుర్తుచేశారు రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ. ఈ దీపావళి పండుగలో వెలుగుని తెచ్చేది కూతుళ్లే అంటూ హృదయపూర్వక సందేశాన్ని అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.
Read More
45

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌.. వన్డే క్రికెట్‌లో కనీవినీ ఎరుగని ఘట్టం

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఓ వన్డే మ్యాచ్‌లో తొలి ఐదుగురితో స్పిన్‌ బౌలింగ్‌ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. తొలి నలుగురితో స్పిన్‌ బౌలింగ్‌ చేయించిన దాఖలాలుఉన్నా, అవి అసోసియేట్‌ దేశాల క్రికెట్‌లో జరిగాయి. ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టు తొలి ఐదుగురి బౌలర్లతో స్పిన్‌ వేయించడం మాత్రం ఇదే మొదటిసారి.
Read More
46

పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్‌ గన్‌లతో తక్షణ చర్యలు

న్యూఢిల్లీ: భారతదేశం అంతటా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశప్రజలంతా ఉత్సాహంగా టపాసులు కాల్చారు. అయితే వీటి ప​్రభావం పొరుగునున్న పాకిస్తాన్‌పై పడింది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో కాల్చిన బాణసంచా పాక్‌వైపు పొగమంచుగా వెళ్లింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, రాజధాని నగరం లాహోర్‌లో గాలి నాణ్యత బాగా క్షీణించిందని పాక్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
Read More
47

నిర్మాతకు 'ఓజీ' దెబ్బ.. వివాదంపై సుజీత్‌ ట్వీట్‌

దర్శకుడు సుజీత్(Sujeeth), నిర్మాత దానయ్య కలిసి తెరకెక్కించిన చిత్రం ఓజీ (OG).. గత నెలలో విడుదలైన ఈ మూవీలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 23న ఓటీటీలోకి కూడా రానుంది. ఈ సమయంలో దర్శకుడు సుజీత్‌ ఒక పోస్ట్‌ చేశారు. ఓజీ బడ్జెట్‌ విషయంలో దానయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఇలా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.
Read More
48

కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్ (Rishabh Pant)పునరాగమనం ఖరారైంది. గాయం నుంచి కోలుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. భారత్‌- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (Ind A vs SA A)తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌ల రెడ్‌బాల్‌ సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అతడిని సారథిగా ఎంపిక చేసింది.
Read More
49

Karnataka: ‘వరల్డ్‌ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు?

బెంగళూరు: తమ ప్రభుత్వం చేపట్టిన పథకానికి ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ నుంచి సర్టిఫికెట్ అందిందని గొప్పగా ప్రకటించిన కర్ణాటక సీఎం ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు. ఆ సర్టిఫికెట్‌ నకిలీదని తేలిన దరిమిలా సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Read More
50

Hyd: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు

హైదరాబాద్‌: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు.
Read More