Short Stories | Sakshi
1

జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్‌ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్‌రావును అక్టోబర్‌ 17వ తేదీ వరకూ రిమాండ్‌ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
Read More
2

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు.
Read More
3

టీసీఎస్‌ గుడ్‌న్యూస్‌.. ఈసారి ఎక్కువ బోనస్‌!

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉ‍ద్యోగులకు శుభవార్త చెప్పింది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం టీసీఎస్‌ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమాల్ మాట్లాడుతూ తమ 'సీనియర్' ఉద్యోగులకు వ్యక్తిగత పనితీరు ఆధారంగా అధిక వేరియబుల్ వేతనం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.
Read More
4

ప్రధానమంత్రితో రామ్ చరణ్ దంపతులు భేటీ

ప్రధానమంత్రి మోదీని శనివారం మధ్యాహ్నం.. రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని.. భేటీకి గల కారణాన్ని చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?
Read More
5

Go Back To India ఇండియన్‌ యువతిపై రేసిస్ట్‌ దాడి

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" (Go Back To India), రేసిస్ట్‌ వేధింపులకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది.
Read More
6

రూ.9 కోట్ల జాక్‌పాట్ కొద్దిలో మిస్‌ అయ్యేదే.!

ఒక ఫోన్‌ కాల్‌ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకొచ్చిన ఫోన్‌ కాల్‌, ఏ స్పామ్‌ కాలో, స్కామ్‌ కాలో అనుకుంది. ఆ తరువాత అసలు విషయంలో ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు) బహుమతిని గెలుచుకుంది.
Read More
7

నకిలీ మద్యం కేసులో కదులుతున్న డొంక

కిలీ మద్యం కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్‌ రావును అధికాలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ నేతల డొంక కదులుతున్నట్లు సమాచారం.
Read More
8

శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.అంతేకాదు.. ఈ ఏడాది గిల్‌కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్‌.. విరాట్‌ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు.
Read More
9

మొన్న విజయ్‌..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!

విజయ్‌-రష్మికల ఎంగేజ్‌మెంట్‌ ఈ నెల 3న జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మొదట విజయ్‌ పరోక్షంగా బయటకు తెలియజేశాడు. ఇటీవల పుట్టపర్తికి వెళ్లిన విజయ్‌ చేతికి ఉంగరం కనిపించింది. తాజాగా రష్మిక కూడా తన చేతికి ఉంగరం ఉన్న వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిందనే విషయం చెప్పడానికే ఉంగరం ఉన్న వీడియోని పోస్ట్‌ చేశారని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.
Read More
10

బనకచర్లపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మం‍త్రి హరీష్‌రావు బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, సీఎం రేవంత్‌ రెడ్డి తన స్వలాభం కోసమే చూసుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కర్ణాటక, కృష్ణా, ఏపీ ప్రభుత్వాల ప్రాజెక్టులతో తెలంగాణకు నికర జలాలు కూడా..
Read More
11

పేర్ని నానిపై కేసు

కృష్ణా: ఏపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు అయ్యింది. నానితో పాటు 29 మందిపైన చిలకలపూడి పీఎస్‌లో కేసు ఫైల్‌ చేశారు. మేయర్‌ భర్తపై సీఐ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని అక్రమంగా అరెస్ట్‌ చేయగా.. విడిపించేందుకు నాని పీఎస్‌కు వెళ్లారు.. ఆ టైంలో..
Read More
12

గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్‌ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోపంలో తలబాదుకుంటూ క్రీజు వీడాడు.
Read More
13

నా కొడుక్కి సినిమాలపై ఆసక్తి లేదు

స్టార్‌ సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్‌ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలా సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) మొదటి భార్య (అమృత) పిల్లలు ఇబ్రహీం అలీ ఖాన్‌, సారా అలీ ఖాన్‌ కూడా పేరెంట్స్‌ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయితే సైఫ్‌- కరీనా కపూర్‌ (Kareena Kapoor) పిల్లలు మాత్రం యాక్టింగ్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదట! ఈ విషయాన్ని కరీనా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తైమూర్‌కు యాక్టింగ్‌పై ఏమాత్రం ఆసక్తి
Read More
14

ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!

హమ్మయ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపే.. మళ్లీ ఊపందుకున్నాయి. నేడు (అక్టోబర్ 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం బంగారం ధర ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉంది అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
Read More
15

రిషబ్‌కు మరో నేషనల్‌ అవార్డ్‌ వస్తుంది: స్టార్‌ డైరెక్టర్‌

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్‌ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఆయనకు మరోసారి నేషనల్‌ అవార్డ్‌ రావచ్చని స్టార్‌ డైరెక్టర్‌ కామెంట్‌ చేశారు.
Read More
16

తెలంగాణలో మళ్లీ మంత్రుల లొల్లి

హైదరాబాద్‌: అడ్లూరి-పొన్నం మధ్య వివాదం మరిచిపోక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది. మంత్రి కొండా సురేష్‌ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఓ మంత్రిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదీ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి పైనే అని తెలుస్తోంది.
17

బాబోయి.. మళ్లీ చిరుత!

తిరుపతి: ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుత కలకలం రేగింది.శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కనిపించింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బయటకు..
Read More
18

బాబోయ్‌..అవినీతి తిమింగలం, 17 టన్నుల తేనె

కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, కిలోల కొద్దీ వెండి, లెక్కపెట్టలేనంత డబ్బు, లగ్జరీ కార్లు, టన్నుల కొద్దీ తేనె.. ఏంటి లెక్కలు అనుకుంటున్నారా? ఒక అవినీతి తిమింగలం ఇంట్లో దొరికిన అక్రమ సంపద.మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) కి చెందిన రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ భోపాల్ జి పి మెహ్రా అవినీతి బాగోతం దర్యాప్తు అధికారులనే నివ్వరపోయేలా చేసింది.
Read More
19

రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సీనియర్‌ కౌన్సిల్‌తో సోమవారం..
Read More
20

నోబెల్‌ మిస్‌పై ట్రంప్‌ డిఫరెంట్‌ రియాక్షన్‌

వాషింగ్టన్‌: నోబెల్‌ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భిన్నంగా స్పందించారు. ఆ బహుమతి అందుకున్న వ్యక్తి తనకు ఫోన్‌ చేశారని, తన గౌరవార్థమే ఆమె అది తీసుకున్నారంటూ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అయితే తన అవార్డును తనకు ఇచ్చేయాలంటూ ట్రంప్‌..
Read More
21

మచిలీపట్నం పోలీసులకు బిగ్‌ షాక్‌

కృష్ణా: మచిలీపట్నం పోలీసులకు బిగ్‌ షాక్ తగిలింది. నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయగా కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ఆయన రిమాండ్‌ను తిరస్కరిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ పరిణామంపై మాజీ మంత్రి పేర్ని నాని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు.. స్థానిక సీఐ వ్యవహరిస్తున్న తీరుపైనా..
Read More
22

అంతా ట్రంప్‌ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్‌ శాంతి’ విజేత

నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్‌. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా..
Read More
23

నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జనార్ధన్‌రావు అరెస్ట్‌

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 కింగ్ పిన్, టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్‌రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకి వచ్చిన జనార్ధన్ రావును గన్నవరం ఎయిర్ పోర్టులో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.
Read More
24

శాంసంగ్ కొత్త ఫోన్‌ లాంచ్‌.. బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ ఫీచర్లు

‍Samsung Galaxy M17 5G: స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ శుక్రవారం భారత్‌లో లాంచ్ అయింది. ఇది అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. రెండు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ ఫోన్, ఓఐఎస్‌తో 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
Read More
25

ముషీర్ ఖాన్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా

ముంబై, మహారాష్ట్ర రంజీ ట్రోఫీ వార్మాప్ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్‌-పృథ్వీ షా మధ్య చోటు చేసుకున్న వివాదాం సద్దుమణిగింది. ముషీర్‌కు పృథ్వీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. తను అన్నయ్య లాంటివాడిని అని ముషీర్‌కు షా చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ వర్గాలు వెల్లడించాయి. పృథ్వీ షా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ముందు తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చాడు.
Read More
26

అనసూయ ‘అరి’ మూవీ రివ్యూ

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..ప్రస్తుతం వీటి చుట్టూనే మనిషి జీవితం తిరుగుతుంది. ఈ ఆరు బలహీనతలతో ఏదో ఒకటి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి? వాటిని తీర్చుకోవడం కోసం మనిషి ఎంతకు తెగిస్తాడు? అనేది ఈజీగా అర్థమయ్యేలా చూపించిన చిత్రం ‘అరి’. దర్శకుడు రాసుకున్న కథ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ పరంగా తడబడ్డాడు. ఫస్టాఫ్‌ యావరేజ్‌..సెకండాఫ్‌ ఎమోషనల్‌గా సాగుతుంది. చివరి అరగంటలో వచ్చే సిన్స్ హైలెట్‌
Read More
27

'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్‌

‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్‌ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం.
Read More
28

డొనాల్డ్‌ ట్రంప్‌కి బిగ్‌ షాక్‌

ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.
Read More
29

మరియా కొరీనా మచాడోకు నోడెల్‌ శాంతి పురస్కారం

వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికిగాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్‌ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు.
Read More
30

అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్‌

వెస్టిండీస్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్‌.. సునీల్‌ గవాస్కర్ (68) తర్వాత భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Read More
31

శభాష్‌.. జస్ట్‌ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లు!

సొంతింటి కల అనేది చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. ఇంటి పని కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ కేవలం 10 లక్షల లోన్‌తో 60లక్షలతో అదీ సూరత్‌ లాంటి మహానగరంలో ఇల్లును కొనుగోలు చేయడం అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది.
Read More
32

సహజీవనంతో జాగ్రత్త, అనాథాశ్రమాల్ని చూడండి గవర్నర్

ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలక సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక, వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, మసలుకోవాలన్నారు. ఇంకా తెలియాలంటే అనాథాశ్రమాల్లో ఏడాదిబిడ్డలతో లైన్‌లో ఉంటున్న వారిని చూడాలన్నారు.
Read More
33

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి భారీ ఊరట

ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మోహిత్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. మోహిత్‌ తరఫున..
34

ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ మూవీ

తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మిరాయ్‌. రితికా నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్‌ విలన్‌గా మెప్పించాడు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియోహాట్‌స్టార్‌లో శుక్రవారం (అక్టోబర్‌ 10) రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ..
Read More
35

ఇదొక తప్పుడు నిర్ణయం: అగార్కర్‌పై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ (Mohammed Kaif) పెదవి విరిచాడు. అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) నేతృత్వంలోని టీమిండియా సెలక్టర్లు ఓ ఆటగాడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించాడు. సంజూను కాదని జురెల్‌ను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించాడు.
Read More
36

శబరిమలై వివాదంపై సురేష్‌ గోపి సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: మలయాళ సీనియర్‌ నటుడు, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమలై బంగారు తాపడం వివాదాన్ని దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని.. ఈ క్రమంలోనే అక్కడి అగ్రతారలు టార్గెట్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. తెలుగు వాళ్లకు సుపరిచితులైన దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీ రాజ్‌ సుకుమార్‌లపై అక్రమంగా కార్లు కొనుగోలు చేశారనే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
Read More
37

ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు: రూ.2 లక్షలకు చేరువలో వెండి!

అక్టోబర్ ప్రారంభం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (శుక్రవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.
Read More
38

‘కోచ్‌’ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమ పేరుతో కోచ్‌ వేధింపులు తాళలేక విద్యార్థిని మౌనిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మౌనిక తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్‌ ఇయర్‌ చదువుతుంది. అదే కాలేజీలో అంబాజీ వాలీబాల్‌ కోచ్‌గా జాయిన్‌ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన ఆమె.. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు..
Read More
39

ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండనోవా ద్వీపంలో శుక్రవారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.6 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Patients and staff seen evacuating the Tagum City Davao Regional Medical Center in
Read More
40

ట్రంప్‌, నెతన్యాహుకు మోదీ ఫోన్‌.. ఎందుకంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు​కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌నకు మోదీ అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు.
Read More
41

బసవతారకం వద్ద హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ ఏరియాలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో హైడ్రా కూల్చివేతలకు దిగింది. ఆక్రమణలు తొలగిస్తున్న క్రమంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమణకు గురైన ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం విలువ.. రూ.750 కోట్లుగా తెలుస్తోంది.
42

చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు (982) చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్‌ (1997లో 970 పరుగులు) పేరిట ఉండేది.
Read More
43

అయోధ్యలో భారీ పేలుడు

యూపీ: అయోధ్యలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది సిలిండర్‌ పేలుడేనని అధికారులు చెబుతున్నారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆరా తీశారు. అయితే మొన్నీమధ్యే కాన్పూర్‌లో స్కూటర్‌ బ్లాస్ట్‌తో 8 మందికి గాయాలయ్యాయి. అయితే ఆ ఘటన..
Read More
44

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మరోమారు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. శుక్రవారం నుంచి..
Read More
45

వైఎస్‌ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాకవరపాలెం మెడికల్‌ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు.
Read More
46

వరల్డ్‌ రికార్డు సాధించిన రిచా ఘోష్‌..

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ప్లేయర్‌గా రిచా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రిచా ఈ ఫీట్ సాధించింది. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది.
Read More
47

TCS: ఒక్క శాతమే పెరిగిన లాభం.. ఒక్కో షేరుకు డివిడెండ్‌ ఎంతంటే..

దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 Results) ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి టీసీఎస్‌ ఏకీకృత లాభం కేవలం 1.4 శాతం పెరిగి రూ.12,075 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.11,909 కోట్లు.
Read More
48

‘మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ: చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

తాము మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చి.. పేదవాడికి మంచి చేస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తూ వాటినిప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.
Read More
49

చిన్న ప్రయత్నమే..కానీ ఎఫెక్ట్‌ ఎవరెస్టు రేంజ్‌..!

ప్రజలకు అవగాహన కల్పించేలా చేయడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కార్యరంగంలోకి దిగాక తెలుస్తుంది అసలైన సమస్య. కానీ ఈ అమ్మ అవేమి పట్టించుకోకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. పైగా రెండు భాషల్లో వారికర్థమయ్యేలా చెబుతున్న తీరుకి హ్యాట్సాఫ్‌ అనాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.
Read More
50

టికెట్‌ లేకుండా ప్రభుత్వ టీచర్‌, టీటీపై ఎదురుదాడి

టికెట్‌ లేకుండానే రైల్లో ప్రభుత్వ టీచర్‌ నిర్వాకం టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నేరంఅని తెలుసు..పైగా ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయిని కూడా. కానీ టికెట్‌ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణింస్తోంది అంతే కాకుండా, ప్రశ్నించిన టీటీపై ఎదురు దాడికి దిగింది బిహార్‌కుచెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.
Read More