శశికళపై విజయశాంతి కామెంట్‌! | vijayashanthi comment on sasikala | Sakshi
Sakshi News home page

శశికళపై విజయశాంతి కామెంట్‌!

Feb 11 2017 3:01 PM | Updated on Sep 5 2017 3:28 AM

శశికళపై విజయశాంతి కామెంట్‌!

శశికళపై విజయశాంతి కామెంట్‌!

తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలు తనను బాధిస్తున్నాయని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.

తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలు తనను బాధిస్తున్నాయని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. తమిళనాట నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై ఆమె శనివారం స్పందించారు. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం సమసిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను వ్యక్తిగతంగా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళకు మద్దతునిస్తానని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్‌ సెల్వం వర్గాలు ప్రస్తుతం హోరాహోరీగా తలపడుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు ఇద్దరు ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటంతో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement