సూపర్ సోలార్ ప్యానెల్‌కు రూపకల్పన | super solar panel invented by switzerland insolight company | Sakshi
Sakshi News home page

సూపర్ సోలార్ ప్యానెల్‌కు రూపకల్పన

Sep 8 2016 9:25 PM | Updated on Sep 4 2017 12:41 PM

సూపర్ సోలార్ ప్యానెల్ను ఇన్‌సోలైట్ కంపెనీ అభివృద్ధి చేసింది.

హైదరాబాద్: సౌర విద్యుత్‌ను రెట్టింపు చేసే సూపర్ సోలార్ ప్యానెల్ను స్విట్జర్లాండ్‌లోని ‘ఇన్‌సోలైట్’ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. సంప్రదాయ సౌర ఫలకాలు సూర్యుడి నుంచి అందుకునే శక్తిలో 15-20 శాతాన్ని మాత్రమే విద్యుత్‌గా మార్చగలవు. ఇన్‌సోలైట్ ప్యానెల్స్ ఏకంగా 36.4 శాతం సౌరశక్తిని విద్యుత్‌గా మారుస్తాయి. 
 
అంతరిక్ష రంగంలో ఉపయోగించే ఖరీదైన సోలార్ సెల్స్‌ను తక్కువ సంఖ్యలో ఉపయోగిస్తూనే వాటిపైకి అత్యధిక స్థాయిలో సూర్యరశ్మి కేంద్రీకృతమయ్యేలా చేస్తాయి. ఒక ప్లాస్టిక్ పొరలో పారదర్శకమైన దర్పణాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. దీంతో పాటు సూర్యుడి గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా సెల్స్ మధ్యభాగంలో సూర్యకాంతి పడేలా చేసేందుకు ఇన్‌సోలైట్ మైక్రోట్రాకింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త సోలార్ ప్యానెల్స్ అందుబాటులోకి వస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement