ఎలా ఎంజాయ్ చేశామో చూడండి: యువీ | Yuvraj Singh Video Shows How Team Sunrisers Celebrated Their Big IPL Win | Sakshi
Sakshi News home page

ఎలా ఎంజాయ్ చేశామో చూడండి: యువీ

May 31 2016 10:58 AM | Updated on Sep 4 2017 1:21 AM

ఎలా ఎంజాయ్ చేశామో చూడండి: యువీ

ఎలా ఎంజాయ్ చేశామో చూడండి: యువీ

ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్ హెచ్) ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు.

ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్ హెచ్) ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. ఎస్ఆర్ హెచ్ కు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ దక్కించుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి ఐపీఎల్ కప్ అందుకున్న తర్వాత ఆరెంజ్ బ్యాచ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. ఆటపాటలతో ఆదరొట్టిన వీడియోను యువరాజ్ సింగ్ షేర్ చేశాడు.

బస్సులో తనతో పాటు కలిసి ప్రయాణించిన ఆటగాళ్ల ఆనందోత్సాహాలను ఇందులో రికార్డ్ చేశాడు. ఈలలు, కేకలు, డ్యాన్సులతో 'ఆరంజ్ గ్యాంగ్' అదరగొట్టింది. యువీకి కాబోయే భార్య హాజల్ కీచ్ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకుంది. యువీ పక్క సీట్లోనే కూర్చున్న హాజల్.. ఎస్ఆర్ హెచ్ ప్లేయర్స్ హంగామాను నవ్వుతూ ఆస్వాదించింది.

శరణ్ విజిల్స్ తో హోరెత్తించాడు. అతడిని కరణ్ శర్మ, ఇతరులు ఉత్సాహ పరిచారు. తమకు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ లు చూపిస్తూ విజయోత్సాహంలో మునిగి తేలారు. అలాగే బస్సు వెలుపల తమను సెల్ ఫోన్లతో వీడియో తీస్తున్న అభిమానులను కూడా యువీ వీడియోలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement