డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..! | 'Papa's Angel' Honeypreet Insan Is Closest To Ram Rahim Singh | Sakshi
Sakshi News home page

డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..!

Aug 28 2017 8:54 AM | Updated on Sep 17 2017 6:03 PM

డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..!

డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..!

డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌కు ఓ కూతురు ఉంది.

డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌కు ఓ కూతురు ఉంది. ఆమె పేరు హనీప్రీత్‌ సింగ్‌ ఇన్సాన్‌ (30). ‘తండ్రి ముద్దుల కూతురు, పరోపకారి, దర్శకురాలు, సంపాదకురాలు, నటి’ ఇవి సోషల్‌ మీడియాపై హనీ ప్రీత్‌ సింగ్‌ పరిచయ వాక్యాలు. డేరా చీఫ్‌ గుర్మీత్‌కు ఈమె దత్త పుత్రిక. ఈమె ట్విటర్‌ అకౌంట్‌కు 10 లక్షల మంది, ఫేస్‌బుక్‌కు ఐదు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తండ్రితో ‘ఎంఎస్‌జీ 2 – ద మెసెంజర్‌’, ఎంఎస్‌జీ – ద వారియర్‌ లయన్‌ హార్ట్‌’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు.

అంతేకాదు గుర్మీత్‌ నటించిన చిత్రాలకు ఈమే దర్శకురాలు, ఎడిటర్‌ కావటం విశేషం. ఈమెకు సొంతంగా "www. HoneypreetInsan.me' అనే వెబ్‌సైట్‌ కూడా ఉంది. ‘అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు’ అని ఈ సైట్‌లో పెద్దగా రాసి ఉంటుంది. ‘50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గురుపా’కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి చీకటి క్షణాన్ని తేజోవంతం చేసినందుకు ధన్యవాదాలు’ అని ఆగస్టు 15న గుర్మీత్‌ పుట్టినరోజు సందర్భంగా హనీప్రీత్‌ ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు తండ్రి గైర్హాజరీలో డేరా సచ్చా సౌదా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత హనీప్రీత్‌దే. గుర్మీత్‌ సీబీఐ కోర్టుకు వచ్చినపుడు తండ్రితోపాటుగా ఈమె కూడా వచ్చింది. గుర్మీత్‌ సింగ్‌ భార్య హర్జీత్‌ కౌర్‌. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement