నంద్యాల ఉప ఎన్నికలో మేము తటస్థం: పవన్‌ | We are neutral on Nandyal By-election, says pawan kalyan | Sakshi
Sakshi News home page

నంద్యాల ఉప ఎన్నికపై క్లారిటీ ఇచ్చిన పవన్‌

Aug 17 2017 2:05 AM | Updated on Mar 22 2019 5:33 PM

నంద్యాల ఉప ఎన్నికలో మేము తటస్థం: పవన్‌ - Sakshi

నంద్యాల ఉప ఎన్నికలో మేము తటస్థం: పవన్‌

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ స్పష్టత ఇచ్చారు.

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ స్పష్టత ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జనసేన ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ బుధవారమిక్కడ తెలిపారు. తాము ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.

2019 వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామన్నారు. అప్పటివరకూ జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి జనసేన మద్దతు ఉండదని పవన్‌ అన్నారు.  జనసేన కార్యకర్తలు అభిప్రాయం తీసుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పార్టీ అయిన జనసేన మద్దతు తమ పార్టీకే ఉందని చెపితే నమ్మవద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement