'లోకేష్కు పోటీ వస్తాడని జూ.ఎన్టీఆర్ను దూరం చేశారు' | Revanth Reddy telling lie : Harish Rao | Sakshi
Sakshi News home page

'లోకేష్కు పోటీ వస్తాడని జూ.ఎన్టీఆర్ను దూరం చేశారు'

Nov 12 2014 3:34 PM | Updated on Sep 2 2017 4:20 PM

'లోకేష్కు పోటీ వస్తాడని జూ.ఎన్టీఆర్ను దూరం చేశారు'

'లోకేష్కు పోటీ వస్తాడని జూ.ఎన్టీఆర్ను దూరం చేశారు'

నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తాడని తెలిసి, అతనిని రాజకీయాలకు దూరం చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ''నాకు వేలు విడిచిన మేనమామేకాదు నా వేలు పట్టుకొని నడిపించిన తండ్రి లాంటి వాడు'' అని మంత్రి హరీష్ రావు చెప్పారు.  తన  పదవులు, రాజకీయ భవిష్యత్ అంతా కేసీఆర్ పెట్టిన భిక్షేనని అన్నారు. టీడీపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పదేపదే అసత్యాలు చెబుతున్నారని, అందుకే తాను ఈరోజు స్పందించానని చెప్పారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన నికృష్టుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తాడని తెలిసి, అతనిని రాజకీయాలకు దూరం చేశారని అన్నారు.

అబద్ధాలు ఆడటం, వెన్నుపోటు పొడవడమే చంద్రబాబు రాజకీయ జీవితం అని అన్నారు. తమది త్యాగాల చరిత్ర అని తెలిపారు. నమ్మిన నాయకుడి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇకపై అసత్యాలు ప్రచారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు పొంది చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు చెప్పారు.
**

Advertisement
 
Advertisement
Advertisement