Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Shashank Singh turns match winner for Preity Zinta and Punjab
ఇదెక్క‌డి విధ్వంసం... కేవ‌లం 28 బంతుల్లోనే! 8 సిక్స్‌ల‌తో

ఐపీఎల్‌-2024లో పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు శ‌శాంక్ సింగ్ మ‌రోసారి సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌శాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.  262 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో కేకేఆర్ బౌలర్లను శశాంక్ ఊచకోత కోశాడు.జానీ బెయిర్ స్టోతో కలిసి మ్యాచ్‌ను శశాంక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్‌ కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదెక్క‌డి విధ్వంసం.. తన లాంటి ఆటగాడు భారత జట్టులో ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతకుముందు కూడా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను శశాంక్ గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్‌ 262 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.దీంతో  టీ20 క్రికెట్ చ‌రిత్రలోనే అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేజ్ చేసిన జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్‌స్టో( పాటు శశాంక్ సింగ్( 68 నాటౌట్‌), ప్రభుసిమ్రాన్ సింగ్‌(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. SHASHANK SINGH, THE FINISHER. 🫡- The consistency of an Indian uncapped player is remarkable. pic.twitter.com/bJpfOj4PsL— Johns. (@CricCrazyJohns) April 26, 2024

Punjab Kings create history with highest successful run chase in T20 cricket
చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

టీ20 క్రికెట్‌లో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డు సాధించింది. ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన పంజాబ్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.262 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్‌ కింగ్స్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఇంతకుముందు ఈ రి​కార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్‌తో సౌతాఫ్రికా రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. కాగా ఐపీఎల్‌లో కూడా ఇదే అత్య‌ధిక ఛేజింగ్ కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ పేరిట ఉండేది.  2020 ఐపీఎల్ సీజ‌న్‌లో పంజాబ్‌పై 224 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.ఇక ప్రస్తుత  మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్‌(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.కేకేఆర్‌ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌(75), సునీల్‌ నరైన్‌(71) హాఫ్‌ సెంచరీలతో చెలరేగగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(39), శ్రేయస్‌ అయ్యర్‌(28) పరుగులతో రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు, రాహుల్‌ చాహర్‌, సామ్‌ కుర్రాన్‌ తలా వికెట్‌ పడగొట్టారు. 

Jonny Bairstow Roars Back In Form With Blistering Century Vs KKR
బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. కేవ‌లం 45 బంతుల్లోనే

ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ జానీ బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 262 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో బెయిర్ స్టో.. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.ఈ క్ర‌మంలో బెయిర్ స్టో.. కేవ‌లం 45 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఫాస్టెస్ సెంచ‌రీ చేసి బెయిర్ స్టోకు ఇది రెండో ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.కాగా అత‌డి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా పంజాబ్‌ 262 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. దీంతో  టీ20 క్రికెట్ చ‌రిత్రలోనే అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేజ్ చేసిన జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్‌స్టోతో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్‌(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

Malla Reddy Interesting Comments On Etela Rajender
ఈటలా.. నువ్వే గెలుస్తావ్‌.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్‌గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది. 

Lavu Sri Krishna Devarayalu Is Suffering For Joining TDP
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!

చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక  వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా  కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ  కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి  కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్‌కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్‌సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని  లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని  పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును  మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని  అన్నారట. పెదకూర పాడు సీటును  కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్‌లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న  లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్  శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా  లావుపై  ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై  జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. 

AAG Ponnavolu Sudhakar Reaction On YS Sharmila Comments
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు

సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్‌ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు.  వైఎస్సార్‌పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్‌ను చూడనేలేదు.  వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్‌కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్‌!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్‌ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్‌ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్‌ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jasprit Bumrah To Open With Rohit Sharma?
IPL 2024: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా..?

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ కాకుండా బ్యాటింగ్‌ తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది.   నెట్స్‌లో గంటల కొద్దీ బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఫ్రాంఛైజీ ఎక్స్‌లో షేర్ చేసింది. బుమ్రా రివర్స్ స్వీప్‌, పుల్  షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నటు ఈ వీడియోలో కన్పించింది. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మెనెజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డర్‌లో బుమ్రాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలో..  బుమ్రాతో ఓపెనింగ్ చేయంచాలని ముంబై మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్‌ శర్మతో కలిసి బుమ్రా ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో బుమ్రా బంతితో అదరగొడుతున్నాడు. 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. Aaj batting tera Jassi bhai karega! 😎💥#MumbaiMeriJaan #MumbaiIndians | @Jaspritbumrah93 pic.twitter.com/RO0WWHh7Fz— Mumbai Indians (@mipaltan) April 26, 2024

KGF Star Yash To Gain 15 Kg Weight To Play Ravana In Ranbir Kapoor Starrer
ఆ పాత్ర కోసం కేజీఎఫ్‌ హీరో సాహసం.. అదేంటో తెలుసా?

బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్‌ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్‌ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు.  ఈ మూవీ తర్వాత కేజీఎఫ్‌-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్‌ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం.  

 Yanamala Krishnudu Resigns to TDP and Joining in YSRCP
యనమల రాజీనామా.. టీడీపీకి చావుదెబ్బ

యనమల రాజీనామా.. టీడీపీకి చావుదెబ్బ

Siva Rama Raju Files Nomination From Undi
నామినేషన్ వేసిన టీడీపీ రెబల్ షాక్ లో రఘురామ కృష్ణం రాజు

నామినేషన్ వేసిన టీడీపీ రెబల్ షాక్ లో రఘురామ కృష్ణం రాజు

Advertisement
Advertisement
Advertisement

What’s your opinion

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement