స్టీఫెన్తో బాబు సంభాషణ.. ఏసీబీ వద్ద రికార్డులు? | acb officials hold records of chandra babu calls with stefen | Sakshi
Sakshi News home page

స్టీఫెన్తో బాబు సంభాషణ.. ఏసీబీ వద్ద రికార్డులు?

Jun 2 2015 7:14 PM | Updated on Aug 17 2018 12:56 PM

స్టీఫెన్తో బాబు సంభాషణ.. ఏసీబీ వద్ద రికార్డులు? - Sakshi

స్టీఫెన్తో బాబు సంభాషణ.. ఏసీబీ వద్ద రికార్డులు?

ఓటుకు నోటు కుంభకోణం మరో పెద్ద మలుపు తిరుగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఓటుకు నోటు కుంభకోణం మరో పెద్ద మలుపు తిరుగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా దీన్ని అంగీకరించడం లేదు గానీ.. అనధికారికంగా మాత్రం తెలుస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని అంటున్నారు. స్టీఫెన్తో ఆయనేం మాట్లాడారన్నది చాలా కీలకంగా మారనుంది.

ఇప్పటికే చంద్రబాబుపై పలు విమర్శలు వస్తున్నాయి, ఆయనను ఈ కేసులో ఎ1 చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. తెలంగాణ లాయర్లు ఇదే అంశంపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్కు అఫిడవిట్ కూడా ఇచ్చారు. సరైన సాక్ష్యం ఉంటే చంద్రబాబుపై కూడా గట్టి కేసు ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. తమ బాస్ చెప్పడం వల్లే తాను వచ్చానంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం దీనికి బలమిస్తోంది. ఇప్పటివరకు ఫుటేజిలో లేని అంశం.. చంద్రబాబు - స్టీఫెన్ సంభాషణ. ఈ ఆడియో ఫుటేజిని ఏసీబీ సీనియర్ అధికారులు స్టడీ చేస్తున్నారని, ఆ తర్వాత అది బయటకు రావచ్చని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement