'పొత్తుల వల్ల నష్టపోయాం' | Loss with alliance | Sakshi
Sakshi News home page

'పొత్తుల వల్ల నష్టపోయాం'

Jun 16 2014 4:00 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఆచారి - కిషన్ రెడ్డి - Sakshi

ఆచారి - కిషన్ రెడ్డి

పొత్తుల వల్ల నష్టపోయినట్లు బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: పొత్తుల వల్ల నష్టపోయినట్లు బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం ముగిసింది. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ  పొత్తుల వల్ల లాభం లేకపోయిందన్నారు.  నరేంద్ర మోడీ హవాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని చెప్పారు. సాధారణ కార్యకర్తలు కూడా నిరాశకు లోనయ్యారన్నారు.  పొత్తుల విషయం తమ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.  మెదక్‌ లోక్సభ స్థానం నుంచి బీజేపీ పోటీచేసి గెలుస్తుందన్న ధీమాను కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు.

టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోయిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. సర్దుబాట్లలో అవకతవకలు జరిగాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.  అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవడం కూడా ఓటమికి కారణంగా ఆచారి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement