చంద్రబాబుపై కేసు నమోదు చేయండి | file a case on chandrababu orderes metropoliton judge | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై కేసు నమోదు చేయండి

Feb 7 2015 8:52 PM | Updated on Sep 2 2017 8:57 PM

చంద్రబాబుపై కేసు నమోదు చేయండి

చంద్రబాబుపై కేసు నమోదు చేయండి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై భారతీయ శిక్షాస్మృతి 153(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శనివారం ఎల్‌బీనగర్ పోలీసులను ఆదేశించారు

ఎల్‌బీనగర్ పోలీసులకు మెజిస్ట్రేట్ ఆదేశం
 హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై భారతీయ శిక్షాస్మృతి 153(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని సైబరాబాద్  రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శనివారం ఎల్‌బీనగర్ పోలీసులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగిస్తుంటే విదేశాలలో ఉండి పాలన కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కర్మన్‌ఘాట్‌కు చెందిన న్యాయవాది బి.నర్సింహ కోర్టులో ఫిర్యాదు చేశారు. స్వీకరించిన సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యూసుఫ్ చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎల్‌బీనగర్ పోలీసులను ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement