మసాజ్‌కు వెళ్తే.. హెచ్‌ఐవీ వచ్చింది | HIV attacked at masaj center in karnataka | Sakshi
Sakshi News home page

మసాజ్‌కు వెళ్తే.. హెచ్‌ఐవీ వచ్చింది

Jun 18 2014 10:09 AM | Updated on Aug 21 2018 7:58 PM

మసాజ్‌కు వెళ్తే.. హెచ్‌ఐవీ వచ్చింది - Sakshi

మసాజ్‌కు వెళ్తే.. హెచ్‌ఐవీ వచ్చింది

మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి.. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని, అలా వెళ్లిన తనకు హెచ్‌ఐవీ సోకిందని బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి.. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని, అలా వెళ్లిన తనకు హెచ్‌ఐవీ సోకిందని బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.  స్పందించిన పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు మేరకు.. పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని దొమ్మలూరులో ఉస్మాన్ అనే వ్యక్తి ఓ మసాజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీకి చెందిన యువతులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.  
 
 యువతుల అర్ధనగ్న ఫొటోలతో ఇంటర్నెట్‌లో ప్రచారం చేశాడు. మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి యువతులతో వ్యభిచారం చేయించసాగాడు. విటులను ఆకర్షించడానికి ముగ్గురు పింప్‌లను పెట్టాడు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి (29) కొద్ది రోజుల క్రితం ఆ మసాజ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఒక యువతికి రూ. 25 వేలు చెల్లించి లైంగిక కోర్కెలు తీర్చుకున్నాడు. ఇటీవల పదేపదే జ్వరం వస్తుండటంతో ఈనెల 11న ఆస్పత్రికి వెళ్లిన అతనికి హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ బాధితుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మసాజ్ కేంద్రం ముసుగులో వ్యభిచారం చేయిస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
 
 దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు సోమవారం రాత్రి ఆ కేంద్రంపై దాడి చేశారు. ముగ్గురు పింప్‌లను అరెస్టు చేశారు.  హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయికి చెందిన నలుగురు యువతులను రక్షించారు. పరారీలో ఉన్న ఉస్మాన్ కోసం గాలిస్తున్నట్లు  సీసీబీ పోలీసులు మంగళవారం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement