శశికళ పుష్ప లాయర్‌ను చితక్కొట్టారు | Sasikala Pushpa's lawyer attacked outside party office by AIADMK workers | Sakshi
Sakshi News home page

ఎవరా శశికళ పుష్ప అంటూ ఆగ్రహంతో..

Dec 28 2016 2:35 PM | Updated on May 24 2018 12:10 PM

శశికళ పుష్ప లాయర్‌ను చితక్కొట్టారు - Sakshi

శశికళ పుష్ప లాయర్‌ను చితక్కొట్టారు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తరుపు లాయర్‌పై అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కార్యాలయం సమీపంలో అతడిని చితక్కొట్టారు.

చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తరుపు లాయర్‌పై అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కార్యాలయం సమీపంలో అతడిని చితక్కొట్టారు. శశికళ పుష్ప ఎవరు? ఆమెకు తమ పార్టీతో సంబంధం ఏమిటి అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం నలుగురు న్యాయవాదులు ఒక లేఖను తీసుకొని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు.

శశికళ తరుపున తాము వచ్చామని, ఆమె ఒక లేఖ పంపించిందని చెప్పిన వెంటనే అసలు ఎవరు శశికళ పుష్ప అంటూ అక్కడ ఉన్నవారంతా ఆగ్రహంతో ఊగిపోయారు. తీవ్రంగా రక్తాలు వచ్చేట్లు కొట్టారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. జయలలిత మృతి వెనుక రహస్యాలు బయటపెట్టాలంటూ శశికళ పుష్ప గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement