తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి ఆందోళనలు చేయవద్దని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీమాంధ్ర ఎంపీలు దుర్మార్గంగా అమానుష చర్యలకు పాల్పడ్డారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


