విమర్శలపై స్పందించిన ప్రియమణి | Priyamani Slams Online Trolls For Negative Comments On Engagement News | Sakshi
Sakshi News home page

విమర్శలపై స్పందించిన ప్రియమణి

May 31 2016 11:13 AM | Updated on Sep 4 2017 1:21 AM

విమర్శలపై స్పందించిన ప్రియమణి

విమర్శలపై స్పందించిన ప్రియమణి

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి తన ప్రియుడు ముస్తుఫా రాజ్ను పెళ్లాడబోతోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది.

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి తన ప్రియుడు ముస్తుఫా రాజ్ను పెళ్లాడబోతోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇటీవల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది ప్రియమణి.

అయితే ఈ ఫోటోలపై కొంతమంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ప్రియమణి స్పందించింది. ప్రియమణి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లిం కావటంతో వారి ప్రేమను లవ్ జిహాద్తో పోలుస్తూ కొంతమంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లపై సీరియస్గా స్పందించిన ప్రియమణి... 'నా జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న నన్ను దీవించండి. సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలతో చికాకు పుడుతోంది. మీ సందేశాలతో మమ్మల్ని దీవించండి. అంతే తప్ప ఇలాంటి నెగెటివ్ రియాక్షన్స్ మాత్రం ఇప్పటికైనా మారండి. ఇది నా జీవితం.. నేను నా కుటుంబ సభ్యులకు, నేను చేసుకోబోయే వ్యక్తికీ తప్ప ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు'. అంటూ కామెంట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement