ఆన్లైన్లో సందడి చేస్తోన్న పవన్ లెటర్ | Pawan kalyan letter to trivikram srinivas | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో సందడి చేస్తోన్న పవన్ లెటర్

Jul 7 2016 11:02 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఆన్లైన్లో సందడి చేస్తోన్న పవన్ లెటర్ - Sakshi

ఆన్లైన్లో సందడి చేస్తోన్న పవన్ లెటర్

తన సినిమాల రికార్డ్లతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మందిని తన అభిమానులుగా మార్చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనను ఇష్టపడేవారికి తన తోటలో పండిన పండ్లు పంపిచటమే...

తన సినిమాల రికార్డ్లతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మందిని తన అభిమానులుగా మార్చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనను ఇష్టపడేవారికి తన తోటలో పండిన మామిడి పళ్లు పంపిచటమే కాదు. తనకు ఏదైన సాయం చేసిన వారికి రాతపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయటం పవన్కు అలవాటు. అలా పవన్ తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసిన ఉత్తరం ఒకటి ప్రస్తుతం ఆన్లైన్లో సందడి చేస్తోంది.

గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్కు ఇవ్వటం ఆ పుస్తకం ఎంతగానో నచ్చిన పవన్ తన సొంత ఖర్చులతో రీ ప్రింట్ చేయించాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. అయితే ఈ అవకాశం కలిగించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, శేషేంద్రగారి కొడుకు సాత్యకీలకు పవన్ కళ్యాణ్ ఉత్తరం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆ లెటర్లో 'ఒక దేశపు సంపద.. ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు అన్న మహాకవి శేషేంద్ర గారి మాటలు.. ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేశాయి. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా.? అని ఆయన వేసిన ప్రశ్న నాకు మహాకాయంగా మారింది.

నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆధునిక మహాభారత గ్రంథం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడేవారికి అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష, ఈ గ్రంథాన్ని మరో మారు మీ ముందుకు తీసుకువచ్చేలా చేసింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహాకవి శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన సాత్యకి గారికి, నాకీ మహాకవిని నాకు పరిచయం చేసిన నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు' అంటూ రాశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా చేతితో రాసినట్టుగా ఉన్న ఈ లెటర్లో పవన్ కళ్యాణ్ సంతకంతో 18/5/2016న రాసినట్టుగా డేట్ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement