కొట్టుకునే దంపతులకు ఊబకాయం! | quarelling couple have greater chance of getting obesity | Sakshi
Sakshi News home page

కొట్టుకునే దంపతులకు ఊబకాయం!

Oct 25 2014 6:00 PM | Updated on Jul 27 2018 2:18 PM

కొట్టుకునే దంపతులకు ఊబకాయం! - Sakshi

కొట్టుకునే దంపతులకు ఊబకాయం!

మొగుడూ పెళ్లాలు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటే.. ఇద్దరూ బాగా లావైపోయే అవకాశం ఉందట.

మొగుడూ పెళ్లాలు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటే.. ఇద్దరూ బాగా లావైపోయే అవకాశం ఉందట. ఊబకాయులుగా మారుతున్న వాళ్లలో ఎక్కువ మంది ఇలా భార్యతోనో, భర్తతోనో కొట్లాటలు పెట్టుకునేవాళ్లే ఉంటున్నారట. ఈ విషయం ఓ పరిశోధనలో తేలింది. ఎప్పుడూ గొడవలు పడే జంటలకు ఊబయాకం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్‌ వల్ల కూడా భార్యాభర్తలు ఊబకాయులవుతున్నారట. భార్యాభర్తలు తరచూ దెబ్బలాడుకోవడం వల్ల వారి మెటబాలిజం దెబ్బతింటుందని, నిత్యం దెబ్బలాడుకుంటూ.. డిప్రెషన్‌కు గురయ్యే దంపతుల రక్తంలో ఇన్సులిన్‌ ప్రమాణాలు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ కూడా పెరిగిపోతున్నాయిట.

ఫలితంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. భోజనం చేసేటప్పుడు భార్యాభర్తల మధ్య వాదోపవాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటోందని ఈ అధ్యయనం పేర్కొంది. 43 మంది ఆరోగ్యవంతమైన జంటల్ని పరిశీలించారు. వీరికి 24 - 60 ఏళ్లలోపు వయసుంది. పెళ్లయి కనీసం మూడేళ్లు దాటినవాళ్లు ఇందులో ఉన్నారు. వాళ్ల వైవాహిక జీవితం గురించి, గతంలో ఉన్న వారి మూడ్‌ డిజార్డర్లు, డిప్రెషన్‌ వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. వైవాహిక జీవితంలో సఖ్యత లేని జంటలు, డిప్రెషన్‌కు లోనయ్యే జంటలు , మూడ్‌ డిజార్డర్‌ ఉన్న జంటల్లో 12 శాతం కన్నా ఎక్కువ ఇన్సులిన్‌ రక్తంలో పెరగడాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. అదే తక్కువ విభేదాలు ఉన్న జంటల్లో అయితే.. దీని శాతం చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా డిప్రెషన్‌కు గురయ్యే జంటల్లో ట్రెగ్లిజరైడ్స్‌ ఎక్కువ ఉన్నాయి. ఇది గుండెజబ్బులకు దారి తీసే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement