గ్రీన్‌ కార్డు కోసం వేచిచూడాల్సిందే | Indians applying for Green Card have 12-year waiting list | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ కార్డు కోసం వేచిచూడాల్సిందే

Jul 11 2017 4:58 PM | Updated on Sep 5 2017 3:47 PM

గ్రీన్‌ కార్డు కోసం వేచిచూడాల్సిందే

గ్రీన్‌ కార్డు కోసం వేచిచూడాల్సిందే

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రీన్‌ కార్డును దరఖాస్తు చేసుకున్న భారతీయులు దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగ, ప్రతేడాది గ్రీన్‌కార్డులను పొందుతున్న టాప్‌ దేశాల్లో భారత్‌లో ఒకటిగా ఉంది. 2015లో 36,318 మంది భారతీయులు తమ స్టేటస్‌ను శాశ్వత పౌరసత్వంగా మార్చుకోగా, 27,289 మంది భారతీయులు గ్రీన్‌ కార్డు రూపంలో చట్టబద్దత శాశ్వత పౌరసత్వం పొందినట్టు ప్యూ రీసెర్చ్‌ తెలిపింది.
 
'' ఎంప్లాయిమెంట్‌కు సంబంధించిన కేటగిరిలో శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు, వారు నిపుణవంతులైన ఉద్యోగులైనప్పటికీ ప్రస్తుతం 12 ఏళ్లు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. 2005 మేలో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు చేపడుతోంది'' అని రిపోర్టు తెలిపింది. ప్యూ డేటా ప్రకారం 2010 నుంచి 2014 వరకు ఎంప్లాయిమెంట్‌కు చెందిన గ్రీన్‌కార్డులు 36 శాతం అంటే 2,22,000పైగా హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌కే అందించినట్టు తెలిసింది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండటానికి, పనిచేయడానికి గ్రీన్‌ కార్డు ఎంతో అవసరం. గ్రీన్‌ కార్డు హోల్డర్లు ఐదేళ్ల నివాసం తర్వాత అమెరికా సిటిజన్‌షిప్‌ కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.   

Advertisement
 
Advertisement
Advertisement