జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే | ys jagan mohan reddy greets on Good Friday | Sakshi
Sakshi News home page

జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే

Apr 13 2017 9:24 PM | Updated on Jul 25 2018 4:42 PM

జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే - Sakshi

జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే

జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన మహా ఘట్టాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement