రూ.5 కోట్లతో టీడీపీ కోశాధికారి పరారీ

రూ.5 కోట్లతో టీడీపీ కోశాధికారి పరారీ - Sakshi


 కుత్బుల్లాపూర్, న్యూస్‌లైన్:  చిట్టీల పేరుతో టీడీపీ నేత ఒకరు జనానికి రూ.5 కోట్లకు టోకరా వేసి పరారయ్యారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన కుత్బుల్లాపూర్‌లో సోమవారం వెలుగు చూసింది. కృ ష్ణా జిల్లా ఘంటశాల మండలం తాడపల్లి గ్రా మానికి చెందిన సూరపనేని వెంకట శివాజీ  జీవనోపాధి కోసం కొనేళ్ల క్రితం నగరానికి వ చ్చి.. జీడిమెట్ల డివిజన్ ప్రసూననగర్‌లో ఉం టున్నారు. స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల చిట్టీలు నిర్వహిస్తున్నారు. అయితే, చిట్టీల కాలపరిమితి ముగిశాక ఖాతాదారులకు డబ్బు లు తిరిగి చెల్లించడంలేదు. రూ.3 చొప్పున వడ్డీ ఇస్తూ ఆ డబ్బును తన వద్దే ఉంచుకుంటున్నా రు. సానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో విం దు, వినోదాల్లో హడావిడి చేసేవారు. దీంతో స్థానికులు అతని వెంట పడేవారు.



ఇదే అదను గా భావించిన శివాజీ స్థానికులతో పాటు ఉ ద్యోగస్తులను సైతం నమ్మించి మోసం చేయడ మే పనిగా పెట్టుకుంటూ వచ్చారు.  అంతే కా కుండా బాలానగర్‌లోని లోకేష్ కంపెనీకి చెం దిన పలువురు ఉద్యోగులు ఇతని వలలో పడి సుమారు రూ. 2 కోట్ల చిట్టీలు వేశారు.  పది రోజులుగా శివాజీ ఆచూకీ లభించకపోవడంతో సుమారు 160 మంది వేట ప్రారంభించి అతని సొంత గ్రామానికి వెళ్లారు. అయినా ఫలితం లే కుండా పోవడంతో సోమవారం ప్రసూననగర్ కమ్యూనిటీ హాల్‌లో బాధితులంతా సమావేశమై తాము మోసపోయిన డబ్బుల వివరాలను రాసుకున్నారు.



అక్కడికి హాజరైన 73 మందికి రూ.5 కోట్లకు పైగానే డబ్బులు ఇవ్వాల్సి ఉందని లెక్క తేలింది. బాధితులు ‘న్యూస్‌లైన్’ను ఆశ్రయించి తాము మోసపోయిన విధానాన్ని వివరించారు. సుధాకర్, రామచౌదరి అనే బాధితుల్లో ఒకరికి రూ.20 లక్షలకు, మరొకరికి రూ. 13 లక్షలకు శివాజీ టోకరా వేశారు. కేవలం వడ్డీ ఆశ చూపే వీరందరికీ మస్కా కొట్టడం గమనార్హం . అంతే కాదండోయ్.. ఇతగాడు జీడిమెట్ల డివిజన్ టీడీపీ కోశాధికారిగా కొనసాగుతున్నారు. అంతేగా ప్రసూన నగర్ స్థానిక సంక్షేమ సంఘం అడ్వైజర్‌గానూ  వ్యవహరిస్తున్నారు. బాధితులంతా సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top