డబ్బులు పంచలేదంటూ పోలింగ్ బహిష్కరణ | voters boycott elections for not getting money | Sakshi
Sakshi News home page

డబ్బులు పంచలేదంటూ పోలింగ్ బహిష్కరణ

May 7 2014 9:08 AM | Updated on Sep 28 2018 7:57 PM

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని అల్లవరం మండల పరిధిలో గల మూడు గ్రామాల్లో పోలింగును గ్రామస్తులు బహిష్కరించారు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని అల్లవరం మండల పరిధిలో గల మూడు గ్రామాల్లో పోలింగును గ్రామస్తులు బహిష్కరించారు. అయితే, ఇక్కడ తమ సమస్యలు పరిష్కరించలేదనో.. తమ గ్రామాలకు సౌకర్యాలు కల్పించలేదనో కాక, ఓటర్లకు అభ్యర్థులెవరూ డబ్బులు పంచలేదన్న కోపంతోనే ఆ మూడు గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు.

ఎన్నికల సంఘం ఎంత చైతన్యం తీసుకొస్తున్నా, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు, మద్యం, నగలు స్వాధీనం చేసుకుంటున్నా కూడా ఓటర్లు మాత్రం ఇతర ప్రాంతాల్లో ఇస్తున్నట్లుగా ఇక్కడెందుకు ఇవ్వరని నాయకులు, కార్యకర్తలను నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement