ఓటింగ్‌లో సత్తా చాటిన ఫ్యాన్ | Seemandhra Municipal Elections ysrcp win | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌లో సత్తా చాటిన ఫ్యాన్

May 13 2014 12:03 AM | Updated on Aug 10 2018 8:06 PM

ఓటింగ్‌లో సత్తా చాటిన ఫ్యాన్ - Sakshi

ఓటింగ్‌లో సత్తా చాటిన ఫ్యాన్

పుర ఫలితాల్లో సీట్ల పరంగా ఆధిక్యం కనబర్చకపోయినా ఓట్ల విషయంలో వైఎస్సార్ సీసీ హవా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం విడుదలైన మున్సిపోల్స్ ఫలితాల్లో టీడీపీ స్వల్ప

సాక్షి, గుంటూరు :పుర ఫలితాల్లో సీట్ల పరంగా ఆధిక్యం కనబర్చకపోయినా ఓట్ల విషయంలో వైఎస్సార్ సీసీ హవా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం విడుదలైన మున్సిపోల్స్ ఫలితాల్లో టీడీపీ స్వల్ప ఆధిక్యతతోనే అధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 12 మున్సిపాలిటీల్లో 11 స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్నప్పటికీ ఆ స్థాయిలో ఓట్లను మాత్రం పొందలేకపోయింది. ఇరు పార్టీలకు మున్సిపాలిటీల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే పట్టణ ఓటర్లు కూడా వైఎస్సార్ సీపీని ఆదరించినట్లు స్పష్టమవుతోంది.  
 
 తాడేపల్లిలో ఫ్యాన్ హవా సుస్ఫష్టం..
 తాడేపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు 18 వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, టీడీపీ మూడింటికే పరిమితమైంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ 6163 ఓట్ల ఆధిక్యాన్ని సాధించగిలిగింది. బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ళ, నరసరావుపేట, చిలకలూరిపేట, రేపల్లె, మున్సిపాలిటీలను టీడీపీ గెలుచుకున్నప్పటికీ స్వల్ప మెజార్టీలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. సత్తెనపల్లిలో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. అక్కడ టీడీపీ 15 వార్డులు సొంతం చేసుకోగా, వైఎస్సార్‌సీపీ 13 వార్డుల్లో విజయం సాధించింది. మిగతా రెండు వార్డుల్లో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గెలవగలిగారు. ఇక్కడ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
 
 వార్డులు గెలిచినా ఓట్లు
 దక్కించుకోలేని టీడీపీ
 బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు ఉండగా 19 టీడీపీ, 13 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్నాయి. ఆరు వార్డులు అధికంగా గెలుచుకున్నప్పటికీ మొత్తం మీద వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీకి రెండు ఓట్లు మాత్రమే ఎక్కువ రావడం గమనార్హం.  మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 29 వార్డులు ఉండగా, ఎనిమిది వైఎస్సార్‌సీపీ, 20 వార్డులు టీడీపీ సొంతం చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ కంటే 12 వార్డులు అధికంగా గెల్చినా కేవలం 1600 ఓట్లు మెజార్టీ మాత్రమే సాధించగలిగింది. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా, 18 టీడీపీ, 12 వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నాయి. వైఎస్సార్ సీపీ కంటే ఆరు వార్డులను అధికంగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందినా కేవలం 1900 ఓట్ల మెజార్టీ సాధించగలిగారు. ఇలా అధిక శాతం మున్సిపాలిటీల్లో 2వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకున్నాయి.
 
 ఫలితాల్లో వెల్లడయిన కుట్రలు..
 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించిన వైఎస్సార్ సీపీ ఒక్కసారిగా వచ్చిపడిన మున్సిపల్, పరిషత్  ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించడంలో కొంత తడబడింది. ఆది నుంచి మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమైన టీడీపీ ఈ ఎన్నికల్లో స్వల్పంగా మెజార్టీ పొందగలిగింది. తాము గెలిచిన చోట కూడా వైఎస్సార్ సీపీ గణనీయంగా ఓట్లు సాధించడం టీ డీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి వైఎస్సార్ సీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కుట్రలు పన్నిన వైనం ఫలితాల్లో వెల్లడయింది. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న వార్డుల్లో కాంగ్రెస్ పోటీ చేసి ఓట్లను చీల్చడం ద్వారా టీడీపీకి లబ్ధిచేకూర్చింది. అదేవిధంగా టీడీపీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుని కుమ్మక్కు కుట్రలకు తెరలేపింది. సోమవారం వెల్లడయిన మున్సిపల్ ఫలితాలను చూసిన రాజకీయ విశ్లేషకులు పట్టణ ప్రాంతాల్లో ఉండే స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఎంపికపై గెలుపోటములు ఉంటాయని, వీటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement