పరువు తీసిన చిరంజీవి ప్రసంగం! | chiranjeevi speeches silly in tamilnadu | Sakshi
Sakshi News home page

పరువు తీసిన చిరంజీవి ప్రసంగం!

Apr 22 2014 4:27 AM | Updated on Mar 18 2019 9:02 PM

పరువు తీసిన  చిరంజీవి ప్రసంగం! - Sakshi

పరువు తీసిన చిరంజీవి ప్రసంగం!

సినీ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి అవగాహన లోపంతో చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ను అభాసుపాలు చేసింది. ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తమిళనాడులోని హ్రొసూరు, వేపనహళ్లి అసెం బ్లీ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించారు.

హొసూరు,   సినీ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి అవగాహన లోపంతో చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ను అభాసుపాలు చేసింది. ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తమిళనాడులోని హ్రొసూరు, వేపనహళ్లి అసెం బ్లీ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు ప్రసంగం అభ్యర్థులు, నేతలను అయోమయంలో పడేసింది. ప్రజలతో పాటు అభిమానులూ నవ్వుకున్నారు. తన ప్రచారంలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పకుండా... షూటింగ్‌ల కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. చిరు ప్రసంగం విన్న కాంగ్రెస్ నేతలు.. ‘‘ఆయన రావడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ’’ అని వాపోయారు.
 మరీ నవ్వులపాలైన అంశాలేంటంటే..:
1. కూడంకుళం కేంద్రాన్ని తాగు, సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పారు. వాస్తవానికిది అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రం.  
2..హొసూరు జాతీయ రహదారిని 4 లేన్ల రహదారిగా మార్చింది కాంగ్రెస్సేనన్నారు. ఇది 6 లేన్ల రహదారి. 
3. 65 ఏళ్లలో డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. హొగేనకల్, క ృష్ణా (తెలుగుగంగ) తాగునీటి ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చింది ఈ రెండు పార్టీలే.
 

Advertisement
 
Advertisement
Advertisement