బ్రహ్మణ సేవాసంఘ సమాఖ్య హెచ్చరిక | Brahmin sevasangha samakya warning | Sakshi
Sakshi News home page

బ్రహ్మణ సేవాసంఘ సమాఖ్య హెచ్చరిక

May 4 2014 6:06 PM | Updated on Aug 14 2018 4:24 PM

చంద్రబాబుకు ఓటేస్తే బ్రాహ్మణులకు మళ్లీ కష్టాలేనని బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య హెచ్చరించింది.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య  వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించింది. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలోనే బ్రాహ్మణులకు పెద్దపీట వేశారని సమాఖ్య పేర్కొంది. ధూపదీప నైవేద్య పథకంతో వైఎస్ఆర్ అర్చకులను ఆదుకున్నారని తెలిపింది.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులను అణిచివేసినట్లు పేర్కొంది. తెలంగాణ, సీమాంధ్రలోనూ బ్రాహ్మణులకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించలేదని తెలిపింది. చంద్రబాబుకు ఓటేస్తే బ్రాహ్మణులకు మళ్లీ కష్టాలేనని  బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement