ఆ ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో? | why chandrababu point out one area for capital | Sakshi
Sakshi News home page

ఆ ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో?

Jul 23 2014 2:52 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఆ ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో? - Sakshi

ఆ ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో?

కొత్త రాజధానికి సంబంధించి చంద్రబాబు పదేపదే ఫలానా ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో ఆయనకే తెలియాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: కొత్త రాజధానికి సంబంధించి చంద్రబాబు పదేపదే ఫలానా ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో ఆయనకే తెలియాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఎంపికకు కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు ఉండాలన్నారు. రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాలు అవసరమని చెప్పారు.

రాజధానిని ప్రతిపాదించిన ప్రదేశం రాష్ట్రం మధ్యలో ఉండాలని సూచించారు. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న చోటే కొత్త రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజధానిలో పేదలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలవారికి అవకాశం ఉండేలా చూడాలని వైఎస్ జగన్మోహన్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement