తెలంగాణకు ఒకరోజు వేతనం విరాళం | Teachers gives one day salary as donation to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఒకరోజు వేతనం విరాళం

May 27 2014 4:46 PM | Updated on Sep 2 2017 7:56 AM

కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వానికి ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సమాఖ్య నిర్ణయించింది.

హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వానికి ఒక రోజు మూల వేతనం  విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సమాఖ్య నిర్ణయించింది. తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు సహాయం అందించాలని సమాఖ్య భావించింది.

ఉపాధ్యాయుల ఒక రోజు మూల వేతనం 20 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. తెలంగాణ ఉపాధ్యాయ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకోవడాన్ని పలువురు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement