సాక్షి విలేకరిపై టీడీపీ నేతల గూండాగిరి | TDP men attack Sakshi reporter in Srikalahasti | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరిపై టీడీపీ నేతల గూండాగిరి

Apr 13 2014 9:26 AM | Updated on Aug 20 2018 8:20 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు గూండాగిరికి దిగారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఏర్పేడులో టీడీపీ నేతలు గూండాగిరికి దిగారు. టీడీపీ కార్యకర్తులు అధిక సంఖ్యలో  ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ దృశ్యాలను స్థానిక సాక్షి టీవీ విలేకరి శంకర్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. ఆ దృశ్యాలు చిత్రీకరించవద్దంటూ స్థానిక టీడీపీ నేత ఈశ్వర్ రెడ్డి ఆయన అనుచరులు సాక్షి విలేకరి శంకర్ రెడ్డిని హెచ్చరించారు.

 

అయితే సదరు నేత అనుచర గణం హెచ్చరికలను ఆయన బేఖాతరు చేశారు. దాంతో టీడీపీ నేత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా మాటలు నీకు పట్టావా అంటూ శంకర్ రెడ్డిపై ఈశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసి... కెమెరా లాక్కోని ప్రాణాలు తీస్తానంటూ బెదిరించారు. దాంతో విలేకరి శంకర్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు విలేకరి ఫిర్యాదు స్వీకరించకపోగా తెలుగుదేశం పార్టీ నేతను పోలీసులు సమర్థిస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ నేతపై చర్యలు తీసుకోవాలని విలేకరితో పాటు స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని పోలీసులను హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement