కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్ | No support for Congress, says YS Jagan mohan Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

May 9 2014 7:42 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్ - Sakshi

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  కేంద్రంలో ప్రభుత్వానికి పార్టీ మద్దతు విషయమై ఆంగ్ల మీడియా కథనాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.  కేంద్రానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలా దాసోహం అనకుండా కేంద్రం మెడలు వంచేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ అన్నారు. 
 
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తీరని నష్టం చేసింది కాంగ్రెస్సేనని,  ఎన్నికల ఫలితాలు వచ్చాక రాష్ట్రానికి మేలు చేసేవారితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ఆయన అన్నారు. 
 
అంతేతప్ప ఫలానావారితో పొత్తు కుదుర్చుకుంటామని ఎక్కడా చెప్పలేదని,  ఈ విషయమై లేనిపోని కథనాలు ప్రచురించి ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని మీడియాకు వైఎస్ఆర్సీపీ లేఖ రాసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement