టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృష్ణా జిల్లాలో చుక్కెదురైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృష్ణా జిల్లాలో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలాంధ్రులకు నాటి నుంచి నేటివరకు అభిమాన హీరో అయిన నందమూరి తారకరామారావు (సీనియర్) విగ్రహానికి దండ వేసేందుకు సమయం చాలదని ఆయన చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును అడ్డుకున్నారు.
కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేస్తున్న చంద్రబాబు.. సోమవారం నాడు రెడ్డిగూడెం మండలం మెట్టగూడెం చేరుకున్నారు. అయితే, అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాలని చంద్రబాబును అభిమానులు కోరారు. కానీ, అందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు, విగ్రహాలకు పూలమాలలు వేస్తూపోతే సమయం సరిపోదన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే, ఈ సంఘటనతో చంద్రబాబు వెంట ఉన్న ప్రైవేటు సైన్యం వారిని పక్కకు లాగేసి, యాత్రను ముందుకు వెళ్లనిచ్చింది.


