విభజన ఆగుతుందంటే నమ్మవద్దు: వెంకయ్యనాయుడు | Division is not stop: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

విభజన ఆగుతుందంటే నమ్మవద్దు: వెంకయ్యనాయుడు

Aug 29 2013 6:40 PM | Updated on Sep 1 2017 10:14 PM

విభజన ఆగుతుందంటే నమ్మవద్దు: వెంకయ్యనాయుడు

విభజన ఆగుతుందంటే నమ్మవద్దు: వెంకయ్యనాయుడు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బీజేపీ సూత్రపాయంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు చెప్పారు.

ఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బీజేపీ సూత్రపాయంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు  వెంకయ్యనాయుడు చెప్పారు. ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణపై తన నిర్ణయం మార్చుకోదని తన అభిప్రాయంగా చెప్పారు.

రాష్ట్ర విభజన ఆగుతుందని ఎవరైనా చెప్తే నమ్మవద్దని సీమాంధ్ర ఉద్యోగులకు చెప్పినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు సందర్భంగా సీమాంధ్రుల ఆందోళపై చర్చిస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు.

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి మొదటి నుంచి మద్దతు తెలుపుతోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా తాము మద్దతు తెలుపుతామని వారు చెబుతూనే ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement