అందుకే గోల్కోండపై జెండా ఎగురవేస్తారా? | Devineni Uma serious over KCR | Sakshi
Sakshi News home page

అందుకే గోల్కోండపై జెండా ఎగురవేస్తారా?

Aug 6 2014 6:58 PM | Updated on Aug 15 2018 9:04 PM

అందుకే గోల్కోండపై జెండా ఎగురవేస్తారా? - Sakshi

అందుకే గోల్కోండపై జెండా ఎగురవేస్తారా?

అధికార గర్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: అధికార గర్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం పాలన గుర్తుచేయడానికి గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తారా దేవినేని ఉమా ప్రశ్నించారు. వ్యవసాయ యూనివర్సిటీకి ఎన్జీరంగా పేరును కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించడం కేసీఆర్ కు తగదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తే అతి తక్కువ ఖర్చుతో తెలంగాణకు విద్యుత్‌ అందిస్తామని ఉమా తెలిపారు. కేసీఆర్ చేతగానితనం వల్లే తెలంగాణలో కరెంట్ సమస్య వచ్చిందని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement