ప్రతివ్యూహంలో చంద్రబాబు | chandra babu naidu to fight back against audio tapes episode | Sakshi
Sakshi News home page

ప్రతివ్యూహంలో చంద్రబాబు

Jun 8 2015 11:52 AM | Updated on Aug 17 2018 12:56 PM

ప్రతివ్యూహంలో చంద్రబాబు - Sakshi

ప్రతివ్యూహంలో చంద్రబాబు

టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుగ్గా పావులు కదుపుతున్నారు.

విజయవాడ: టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతివ్యూహానికి సిద్ధమైన చంద్రబాబు.. మంత్రులంతా తమ తమ జిల్లాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.  దీనిలో భాగంగానే సోమవారం టీడీపీ నేతలతో అత్యవసర సమావేశమైయ్యారు.   రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే ధర్నాలు నిర్వహించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూత్రధారేనని తాజా ఆడియో టేపుల్లో బహిర్గతమైన సంగతి తెలిసిందే.  స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో  చంద్రబాబే ప్రధానపాత్ర పోషించినట్లు స్పష్టంగా తేలిపోయింది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని బాబు స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోతీవ్ర అలజడి రేపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement