ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం | Andhra Pradesh Government plan to Cancel EAMCET | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

Jul 25 2014 3:13 PM | Updated on Jun 2 2018 2:36 PM

ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం - Sakshi

ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించే యోచనలో ఉంది.

హైదరాబాద్: ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించే యోచనలో ఉంది. ఇంటర్ మెరిట్ ఆధారంగా ఇంజినీరింగ్, మెడికల్ అడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై మూడు రోజుల్లో అధ్యయన కమిటీ వేయనుంది. సోమవారం అధ్యయన కమిటీ తమిళనాడు వెళ్లనుంది.

ప్రస్తుతమున్న విధానంలో ఎంసెట్ ర్యాంకులు ఆధారంగా ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు కేటాయిస్తున్నారు. అయితే ఎంసెట్ ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ మాత్రమే ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement