'గవర్నర్పై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా' | achhennaidu responds on controversial comments on governor | Sakshi
Sakshi News home page

'గవర్నర్పై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా'

Jun 18 2015 8:45 PM | Updated on Apr 3 2019 8:48 PM

'గవర్నర్పై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా' - Sakshi

'గవర్నర్పై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా'

గవర్నర్ నరసింహన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. తన మాటలు గవర్నర్ను గాయపరిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు.

సెక్షన్ 8పై మార్గదర్శకాలు రాలేదని గవర్నర్ కుంటిసాకులు చెబుతున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేగాక నరసింహన్ కుంటిసాకులు చెబుతున్నారని, గంగిరెద్దులా తల ఊపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో అచ్చెన్నాయుడు స్పందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement