ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే బీజేపీ గెలిచేది: హరీష్ | aam admi party stops bjp win: harish rao | Sakshi
Sakshi News home page

ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే బీజేపీ గెలిచేది: హరీష్

Dec 8 2013 11:14 AM | Updated on Apr 4 2018 7:42 PM

ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే బీజేపీ గెలిచేది: హరీష్ - Sakshi

ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే బీజేపీ గెలిచేది: హరీష్

ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అభిప్రాయపడ్డారు. అందరూ ఊహించిన విధంగానే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని 'సాక్షి' టీవీ చర్చాక్రమంలో అన్నారు. మంచి పరిపాలన అందించిన పార్టీలను ప్రజలు ఆదరించారని చెప్పారు.

అవినీతి ప్రభుత్వాలను ఇంటికి పంపారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని రుజువు చేస్తోందన్నారు. ఏ హంగులు లేని ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు రావడాన్ని బట్టి చూస్తే ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అర్థమవుతుందన్నారు. ప్రజలు అవినీతి రహిత పాలన కావాలనుకుంటున్నారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు లేనిచోట బీజేపీని ప్రజలు ఆదరించారని హరీష్రావు తెలిపారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే బీజేపీ గెలిచేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement