Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Weekly Horoscope Telugu 28-04-2024 To 01-05-2024
Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది

మేషంమరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చరంగులు. దేవీస్తుతి మంచిది.వృషభంముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముగిస్తారు. సోదరులు, మిత్రులు మీకు వెన్నంటి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వివాహాది వేడుకల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారి సేవలకు గుర్తింపుతో పాటు, సన్మానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునంరుణవిముక్తికి చేసే యత్నాలు సఫలం. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. వేడుకల నిర్వహణలో భాగస్వాములు కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా మరింత ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. పసుపు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.కర్కాటకంపట్టింది బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లా¿¶ సాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.సింహంమొదట్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి సఫలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌర విస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది.  గులాబీ, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.కన్యఅనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. మీ నిర్ణయాలపై సానుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. మిత్రులతో మాటపట్టింపులు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.తులమీ యుక్తి, ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.వృశ్చికంఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరాక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి  చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.ధనుస్సుపట్టుదలతో ముందుకు సాగండి, విజయాలు చేకూరతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మీసహాయం కోసం మిత్రులు ఎదురుచూస్తుంటారు. వ్యాపారాలు గతం కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీహోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.మకరంసన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. మీ శక్తిసామర్థ్యాలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మద్యమధ్యలో కొంత అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.కుంభంముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వి¿ే దాలు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.మీనంనూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు ఆందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు.  శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

Daily Horoscope Rasi Phalalu April 28-04-2024 Telugu
Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.చవితి ఉ.6.20 వరకుతదుపరి పంచమి, నక్షత్రం: మూల రా.2.56 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.10.56  నుండి 12.26 వరకు, తదుపరి రా.1.22 నుండి 2.58 వరకు, దుర్ముహూర్తం: సా.4.37 నుండి 5.25 వరకు, అమృతఘడియలు: రా.8.23 నుండి 10.42 వరకు.సూర్యోదయం        :  5.40సూర్యాస్తమయం    :  6.14రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వృషభం: కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.మిథునం: సోదరులు, సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.సింహం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.కన్య: రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.మీనం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. 

Film director producer Tammareddy Bharadwaja Exclusive Interview With Sakshi
జగన్‌ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ

జగన్‌ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను  వైఎస్సార్‌సీపీ సపోర్టర్‌ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్‌సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్‌ను సమర్థిస్తున్నట్లే కదా!  - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్‌ స్కూల్స్‌లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్‌ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. లంచాలకు బ్రేక్‌ పడింది ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్‌ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్‌ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్‌లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది.  చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు మెడికల్‌ కాలేజీలు, బందరు పోర్ట్‌తో సహా నాలుగు పోర్ట్‌లు కడుతున్నారు. షిప్పింగ్‌ హార్బర్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది.  మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్‌షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్‌ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్‌సీపీ బంపర్‌ మెజారీ్టతో వస్తుంది. నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ  కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్‌సీపీ సపోర్ట్‌ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్‌ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులన్నట్టే కదా. పోలవరం పూర్తయితే బాగుంటుంది పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది.    –సత్యార్థి

Andhra govt to provide 9 hrs free power supply to farm lands
చీకటి రాత్రులకు బ్రేక్‌

ప్రతి సర్వీసుకీ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌  విద్యుత్‌ ప్రమాదాలు జరగడానికి, సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్‌ లోడ్‌ కావడమే ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడంతో పాటు పాత సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెరిగింది. ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న 220కేవీ, 132 కేవీ లైన్లను పాతవి బాగుచేయడంతో పాటు కొత్తవి వేశారు.డిస్కంల పరిధిలోని 33 కేవీ, 11కేవీ లైన్లు మార్చారు. సబ్‌ స్టేషన్లలో పవర్‌ కెపాసిటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి వ్యవసాయ సర్విసుకీ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ ఇస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ అందుతోంది.  ‘మా ప్రాంతంలో మొత్తం విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వంలో 7 గంటలు విద్యుత్‌ అని ప్రకటించినా అందులో ఒకటి రెండు గంటలపాటు కోతలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ అందిస్తున్నారు. దీనివల్ల కూలీలతో పనిచేయించుకొని, చేను మొత్తం తడపడానికి వీలవుతోంది.గతంతో హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండేవి. దీనివల్ల కొద్దిపాటి గాలికే కలిపిపోయి ట్రాన్స్‌ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడా సమస్య లేదు. గతంలో రోజుకి ఏడు గంటలు రాత్రి సమయాల్లో సేద్యానికి విద్యుత్‌ ఇవ్వడం వల్ల పొలాల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే స్పెల్‌లో ఇవ్వడంతో చేను మొత్తం ఒకేసారి తడుస్తోంది’. – సూర్పని రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం సాక్షి, అమరావతి: ‘సేద్యానికి విద్యుత్‌ లోటు రాకూడదు. రైతులకు ఇచ్చే విద్యుత్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇవ్వాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్విసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు’.అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం అక్షర సత్యం చేసింది.పంటలకు నీటి కొరత లేకుండా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలను ఆచరణలో పెట్టింది. పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందించేందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ముందుగా వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను ఆధునీకరించి ఉచిత విద్యుత్‌ సరఫరాకు అనుకూలంగా మార్చింది.  గతమెంతో ‘హీనం’ రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్లు ఏడాదికి దాదాపు 15,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగంలో ఉండేవి. ఇది రాష్ట్రంలో ఏడాదికి జరిగే 64 వేల నుంచి 66 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగంలో దాదాపు నాలుగింట ఒక వంతు. జూన్‌ 2019కి ముందు, ఏడు గంటల విద్యుత్‌ సరఫరాకే గ్యారెంటీ ఉండేది కాదు.అప్పుడు దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్విసులకు ఒకేసారి విద్యుత్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ వాటికే సరిపెట్టలేక రాత్రి పూట సహా రెండు, మూడు విడతల్లో విద్యుత్‌ అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభు త్వం పగటి పూట విద్యుత్‌ సరఫరా అందిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి అమలు చేసింది. రెట్టింపైన ఫీడర్లు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేయడానికి అందుబాటులో ఉండేవి. దానిని మెరుగుపరచడం కోసం చంద్రబాబు ఏమాత్రం దృష్టి సారించలేదు. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,700 కోట్లను కేటాయించింది.దీంతో ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ తమ పరిధిలో ఫీడర్ల ఆధునికీకరణ చేపట్టాయి.  రూ.1200.20 కోట్లతో 32 ప్యాకేజీలలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాయి. పెరిగిన 6,735 ఫీడర్లలో 6,605 ఫీడర్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయగల సామర్థ్యం వచ్చింది.

JC Diwakar List of Irregularities: Andhra Pradesh
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు

వృత్తి: ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలుపదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,కేసులు: చెప్పలేనన్నిఅతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్‌ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్‌ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్‌ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు.  సాక్షి, టాస్‌్కఫోర్స్‌ :  ట్రావెల్స్‌ ద్వారా కండిషన్‌ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్‌నగర్‌ సమీపంలో  పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి  ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్‌ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్‌ క్యారేజ్‌గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్‌  ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు.   అక్రమాలకు పరాకాష్టగా బీఎస్‌ 3 వాహనాలు  ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్‌–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్‌ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్‌–3 లారీలను బీఎస్‌–4  వాహనాలుగా నకిలీ ఎన్‌ఓసీ, ఇన్సూరెన్స్‌తో నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు,  అనుచరుడు,  మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్‌ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. ప్రభుత్వ నిధులూ స్వాహా...?తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పెద్దవడుగూరు మండలంలో 2015లో  రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం  చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు.  పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్‌ క్లియరెన్స్‌ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు.  కేసుల వివరాల► ఇప్పటికే రౌడీ షీట్‌ నమోదై ఉంది.   ► 1996లో జరిగిన టౌన్‌బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ► మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత  వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్‌లో 57 కేసులు, తాడిపత్రి అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్‌లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి.  ► 2020లో నకిలీ ఇన్సూరెన్స్‌ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్‌ కేసుల నమోదు. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు.  (1). ఎఫ్‌ఐఆర్‌  నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్లు.   (2) ఎఫ్‌ఐఆర్‌ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్‌విత్‌ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  ► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్‌ డ్రైవర్‌ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్‌ ద్వారా పోలీసులు  కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2014లో ఎఫ్‌ఐఆర్‌ నెం. 142/14, సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది.   అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు :  ► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు   కడప సెంట్రల్‌ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్‌ రిమాండ్‌లో ఉన్నారు.   ► బీఎస్‌–3 వాహనాల కుంభకోణంలో బైయిల్‌పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్‌పై తాడిపత్రిలోని నివాసంలో  ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై  రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. డబ్బు కోసం దేనికైనా సై ► తాడిపత్రి మండలం హుస్సేన్‌పురం వద్ద  రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్‌ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. ► స్టీల్‌ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం.   ► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్‌ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో  నేషనల్‌ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్‌ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్‌ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్‌ కోట్‌ చేయించి దక్కించుకున్నారు.  ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.    ► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్‌విల్‌ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ► ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న కాంప్లెక్స్‌లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్‌ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. ► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు.  ► తమ కుటుంబ సిమెంట్‌ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్‌స్టోన్‌ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు.  ►మట్కా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి  పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు.   

20 percent of voters are below 30 years of age: Andhra Pradesh
నవతరం కదలాలి.. పోలింగ్‌ పెరగాలి... 

యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని  శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా  ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పారి్టసిపేషన్‌ (స్వీప్‌) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్‌ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు  చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Mayawati gave huge tickets to Muslims
కూటమికి బీఎస్పీ పోటు! 

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్‌ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఉనికిని  కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్‌ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్‌సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్‌ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్‌పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్‌లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోనూ ఇదే పరిస్థితి! లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు    సీట్లు    ఓట్ల శాతం 2004            19          5.33 2009             21         6.17 2014             0           4.19 2019             10         3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్‌లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్‌సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్‌దళ్‌తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు భయపడుతున్నాయి. 

CM YS Jagan Fires On Chandrababu
ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అలవికాని హామీలిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చని చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... ఈసారి మరిన్ని మోసపూరిత హామీలతో ముందుకు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని, అంతా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఇచ్చిన హామీలకే తాము వెచ్చిస్తున్న మొత్తం కన్నా దాదాపు రెట్టింపు అవుతోందని, ఇది నెరవేర్చే అవకాశం లేకపోయినా.. తాను సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా­నని బాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్య­బట్టారు. ప్రతి సందర్భంలోనూ ‘నేను సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తా’ అని చంద్రబాబు అరిచే అరుపుల వెనక మర్మాన్ని ముఖ్యమంత్రి శనివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. అవి ఆయన మాటల్లోనే... జగన్‌ అబద్ధాలు చెప్పడు... వీళ్లంతా కూడా అబద్ధానికి రెక్కలు కట్టి ఎలా మోసం చేస్తారో తెలియజేయడానికే ఇదంతా చెబుతున్నా. ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలచుకున్నా. నేను చేయలేకపోతే చేయలేనని చెబుతా. అంతే తప్ప అబద్ధాలు ఆడను. మోసం చెయ్యను. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్‌ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. వేయలేరు కూడా. మేనిఫెస్టోలో లేనివి కూడా... ఈ 58 నెలల కాలంలో మేనిఫెస్టోలో లేని అంశాలెన్నిటినో అమల్లోకి తెచ్చాం. కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద ఇవేవీ 2019 మేనిఫెస్టోలో లేవు. కానీ ఇప్పుడు అమలవుతున్నాయి. అలాగే పిల్లలకు ట్యాబ్‌లు, ఆరోగ్య శ్రీని రూ.25లక్షలకు పెంచటం, 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటం... ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పకుండానే చేసి చూపించాం. అందుకే చెబుతున్నా. అబద్ధాలు చెప్పి నేను చంద్రబాబుతో పోటీ పడదల్చుకోలేదు. కారణం... అది అబద్ధమని తెలిసి కూడా చెప్పటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగిందే చెబుతా. అవకాశం ఉంటే పేదల కోసం పది అడుగులు ముందుకే వేస్తా.  14 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే... జగన్‌ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను కనుక చేయగలుగుతానని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ అంటుంటాడు. అలా తాను చెప్పే అబద్ధాలి్న, చేసే మోసాల్ని  నిస్సిగ్గుగా డిఫెండ్‌ చేసుకుంటాడు. మరి తన 14 ఏళ్ల పాలనలో ఏ సంపద సృష్టించాడు? అసలు ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ప్రతి ఏటా లోటే కదా? మరి రెవెన్యూ వ్యయానికే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు... సంపద ఎక్కడ నుంచి సృష్టించారు? మరి చంద్రబాబు అధికారంలో లేక ముందు గానీ... తర్వాత గానీ ఎప్పుడు చూసినా రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. ఇదీ వాస్తవం.అసలు ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ లోటు అన్నది ఒక్క చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుంది. అంటే లెక్కలన్నీ చంద్రబాబు సంపద సృష్టించలేదని చెబుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలనంతా దోచుకోవడం, దాన్ని పంచుకోవటమే జరిగింది కాబట్టే ఇదంతా. బాబు చేయలేనిది నేను ఎందుకు చేయగలిగానంటే ఇక్కడ కరప్షన్‌ లేదు. వివక్ష లేదు. అందుకే!. అడ్డగోలు అప్పులు తెచ్చింది బాబేగా? అప్పులపై నోటికొచ్చింది చెబుతున్నారు. కానీ లెక్కలు మారవు కదా? ఎవరెంత అప్పులు చేశారో ఒకసారి గమనిస్తే... 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌రేట్‌ (సీఏజీఆర్‌) 21.87 శాతం. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. మరి ఎక్కువ అప్పులు తెచ్చిందెవరో తెలియటం లేదా? అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పుంటే... 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక గవర్నమెంట్‌ గ్యారంటీడ్‌ రుణం... బాబు రాకముందు రూ.14వేల కోట్లు. బాబు దిగిపోయే  నాటికి రూ.59వేల కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్‌యూల రుణాలు రూ.21,367 కోట్ల నుంచి రూ.81,337 కోట్లకు పెరిగాయి. మొత్తంగా అప్పులు బాబు హయాంలో రూ.1,53,346 కోట్ల నుంచి 4,12,288 కోట్లకు పెరిగాయి.  ఇక ఈ ప్రభుత్వ హయాలలో చూస్తే ప్రభుత్వ రుణాలు రూ.4.90 లక్షల కోట్లకు, గ్యారంటీడ్‌ రుణాలు 1.43 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్‌యూల అప్పులు రూ.69,372 కోట్లకు తగ్గాయి. మొత్తమ్మీద రుణాలు రూ.7,03,471 కోట్లకు చేరాయి. బాబు హయాంలో పెరుగుదల రేటు 21.87 శాతం ఉంటే... ఇప్పుడది 12.13 శాతం. మరి ఫైనాన్షియల్‌ డిసిప్లిన్‌ ఎవరికుంది?  జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందెప్పుడు? పురోగతి అంటే ఏంటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? జీడీపీలో మన రాష్ట్ర వాటా ఎంత? ఇవన్నీ చూడా­లి కదా!! వాస్తవానికి చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో మన వాటా 4.47 శాతం ఉంటే.. అది ఇప్పుడు సగటున 4.83 శాతా­నికి పెరిగింది. కోవిడ్‌ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలియటం లేదా? ఆస్తుల కల్పన ఎవరి హయాంలో జరిగిందో తెలియటం లేదా? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్రహ్మాండంగా పరుగెత్తుతున్నాయో తెలియటం లేదా? మూలధన వ్యయం... మాటల్లోనేనా? డబ్బులన్నీ పంచేస్తున్నారంటూ చంద్ర­బాబు అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నాడు. ఎప్పుడైనా తను చెప్పేదొక్కటే. తాను స్కీములకు కాదని, క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ (మూలధన వ్యయం) రూపంలో ఖర్చు చేశానని. అందుకనే ఇన్ని స్కీములు ఇవ్వలేకపోయానంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే... అసలు నాడు–నేడు ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో ఆసుపత్రులు, స్కూళ్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ జరిగింది? ఆయన హయాం చూస్తే మూలధన వ్యయం కింద ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... మన ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు చేస్తున్నాం.  కొత్తగా 4 సీపోర్టులు కడుతున్నాం. 10 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. కొత్తగా 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కడుతున్నాం. 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు కళ్లెదుటే జరుగుతున్నాయి. నిజానికి మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ నీడన గడిచిపోయాయి. ఆ రెండేళ్లూ రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా మూలధన వ్యయం కింద ఇంత భారీగా ఖర్చు చేయగలిగాం. పైపెచ్చు ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ఇదీ జగన్‌ పనితీరుకు, చంద్రబాబు పనితీరుకు తేడా!. పన్నుల బాదుడులోనూ చంద్రబాబే టాప్‌... చంద్రబాబు ప్రతిసారీ జగన్‌ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడని. పన్నులతో బాదేస్తున్నాడని అంటున్నారు. కానీ నిజానికి జీఎస్‌డీపీలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఎవరి హయాంలో ఎక్కువో తెలుసా? చంద్రబాబు నాయుడి హయాంలో జీఎస్‌డీపీలో ట్యాక్స్‌ బర్డెన్‌ 6.57 శాతం. జగన్‌ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్లలో చెప్పినవే కదా? 

How to deal with kidney problems
ఈ ఎండల్లో కిడ్నీ ఎమర్జెన్సీల నివారణ ఇలా..! 

ఈ ఎండలతో దేహానికి వడదెబ్బ లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టే మూత్రపిండాల (కిడ్నీల)కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.  ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యూరీ’ (ఏకేఐ), మూత్రవ్యవస్థలో రాళ్లు ఏర్పడే‘యూరో లిథియాసిస్‌’, కొన్నిరకాల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ కారణంగా ఏర్పడే కిడ్నీ సమస్యలు ఇందులో కొన్ని. ఈ మెడికల్‌ ఎమర్జెన్సీ సమయాల్లో ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి వాటి గురించి తెలిపే కథనమిది. ఏప్రిల్‌ నెల ఇంకా ముగియక ముందే... నమోదవుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైమాటే. దాంతో డీహైడ్రేషన్‌ వల్ల సమస్యలకు గురయ్యే కీలక అవయవాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. కిడ్నీపై దుష్ప్రభావాలిలా... అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) : దేహంలో నీరు తగ్గినప్పుడు రక్తం చిక్కబడి, రక్తప్రవాహ వేగమూ మందగిస్తుంది. ఫలితంగా అన్ని అవయవాలకు లాగే కిడ్నీకి అందే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. దాంతో దేహంలో పేరుకు పోయే వ్యర్థాలను బయటకు పంపే వేగమూ తగ్గుతుంది. దాంతో కిడ్నీల పనితీరులో ఆకస్మికంగా మార్పులు వచ్చి, అస్తవ్యస్తంగా పని చేస్తాయి. ఈ కండిషన్‌ పేరే ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యూరీ’. దీని దశలు:ఆలిగ్యూరిక్‌ ఫేజ్‌: ఈ దశలో యూరిన్‌ ఔట్‌పుట్‌ బాగా తగ్గి, కిడ్నీల్లోని రీనల్‌ ట్యూబ్యూల్స్‌ అనే సన్నటి నాళాలు దెబ్బతింటాయి. డైయూరెటిక్‌ ఫేజ్‌: ఈ దశలో కిడ్నీ తనను తాను రిపేర్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. రికవరీ ఫేజ్‌: ఒకవేళ తగినన్ని నీళ్లు, ద్రవాహారం అంది రీ–హైడ్రేషన్‌ జరిగితే...కిడ్నీల పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంది. ఏకేఐ లక్షణాలు...► మూత్రం తక్కువగా రావడం.► ఒంట్లో వాపు ► వికారం ∙తీవ్రమైన నిస్సత్తువ, అలసట► శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండటం... సరిగా అందకపోవడం. చికిత్స... ఇది పరిస్థితి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సెలైన్‌ పెట్టి, దేహానికి తగినంత రీహైడ్రేషన్‌ జరిగేలా చూడటం. ∙అవసరాన్ని బట్టి యాంటిబయాటిక్స్‌ వాడటం. ∙కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయక దేహంలో బాగా వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి డయాలసిస్‌ చేయాల్సి రావడం. కిడ్నీలో రాళ్లు (యూరోలిథియాసిస్‌): మూత్ర వ్యవస్థలో లవణాల స్ఫటికాలతో రాళ్లు ఏర్పడటాన్ని ‘యూరోలిథియాసిస్‌’ అంటారు. దీన్నే వాడుక భాషలో మూత్రపిండాల్లో రాళ్లు రావడంగా చెబుతారు. తీవ్రమైన నడుము నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే ఈ సమస్యలో రాళ్లు చిన్నగా ఉంటే మందులతో పాటు, తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోవడం, రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉండే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలను సూచిస్తారు. రాయి పరిమాణాన్ని బట్టి కొన్ని ప్రక్రియలతో చూర్ణమయ్యేలా చేసి, మూత్రంతో పాటు పోయేలా చూస్తారు. కుదరనప్పుడు  శస్త్రచికిత్స చేస్తారు.మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు : వ్యర్థాలు బయటకు పోని సందర్భాల్లో... అవి దేహంలో పేరుకు పోయి, బ్యాక్టీరియా పెరిగిపోయి, మూత్రవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బంది, నొప్పి, మూత్రం బొట్లు బొట్లుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు.  నివారణ కోసం... ►సాధ్యమైనంతవరకు నీడపట్టునే ఉండటం.►తేలికపాటి రంగులతో కూడిన, గాలి తగిలేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, బ్రిమ్‌ హ్యాట్, స్కార్ఫ్‌ వంటివి వాడటం.► తగినన్ని నీళ్లు తాగుతూ, లవణాలు (ఎలక్ట్రోలైట్స్‌) అందేలా చూసుకోవడం.►డాక్టర్‌ సూచన లేకుండా డై–యూరెటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడకపోవడం.                                        ∙

Kalki 2898 AD Announced New Release Date
శక్తులన్నీ ఏకమయ్యాయి 

థియేటర్స్‌లో ‘కల్కి’ రాక ఖరారైంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది జూన్‌ 27న విడుదల కానుంది. ‘‘మెరుగైన భవిష్యత్‌ కోసం అన్ని శక్తులు ఏకమయ్యాయి’’ అనే క్యాప్షన్‌తో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌.మహాభారతం కాలంలో ఆరంభమై 2898 ఏడీలో ఈ సినిమా ముగుస్తుందనీ, ఆరువేల ఏళ్ల కాలమానంలో ఈ కథ సాగుతుందనీ సమాచారం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  సంతోష్‌ నారాయణన్‌.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement