శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... | Sasikala verdict: Twitter goes to town as Sasikala heads for jail in DA case | Sakshi
Sakshi News home page

శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే...

Feb 14 2017 12:32 PM | Updated on Sep 2 2018 5:28 PM

శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... - Sakshi

శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే...

సుప్రీం తీర్పు కేవలం పన్నీర్ సెల్వం, డీఎంకే శ్రేణుల్లేనే కాదు, ఇటు సోషల్ మీడియాను సంబురాల్లో ముంచెత్తింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఎత్తులు మీద పై ఎత్తులు వేసిన శశికళను ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్థారిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేవలం పన్నీర్ సెల్వం, డీఎంకే శ్రేణుల్లేనే కాదు, ఇటు సోషల్ మీడియాను సంబురాల్లో ముంచెత్తింది. న్యాయానికి తమిళనాడులో కనీస గ్యారెంటీ ఉందని కుష్భు సుందరన్ ట్వీట్ చేయగా.. తమిళ ప్రజలకు సుప్రీంకోర్టు బెస్ట్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చిందని మరొకరు ట్వీట్ చేశారు. ఎలాంటి భయాందోళన లేకుండా ఇక ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ శాంతిస్తుందని ప్రముఖ నటి గౌతమి ట్వీట్ చేశారు.
 
అమ్మ మరణం గురించి శశికళ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రెండు కేసుల్లో ఆమెకు వేర్వేరుగా శిక్షలు విధించాలని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో జడ్జ్మెంట్ రాసిన స్పెషల్ కోర్టు జడ్జ్ను రియల్ హీరోగా తమిళ నెటిజన్లు పొగుడుతున్నారు. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ముందు నుంచి శశికళను వ్యతిరేకిస్తున్న ట్విట్టర్ యూజర్లు, తీర్పు వెలువడిన వెంటనే ఫుల్గా ఛలోక్తులు పేల్చారు. డియర్ శశికళ... హ్యాపీ వాలెంటైన్స్ డే, లవ్, సుప్రీంకోర్టు అని, శశికళకు చివరికి సెంట్రల్ జైలులో పీఠం దొరికిందంటూ యూజర్లు పలు కామెంట్లు చేశారు.
Advertisement
 
Advertisement
Advertisement