ప్రజాక్షేత్రంలోకి శశికళ | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలోకి శశికళ

Published Tue, Feb 14 2017 3:01 AM

ప్రజాక్షేత్రంలోకి శశికళ

- కువత్తూరు వద్ద చిన్నారులతో ముచ్చట్లు
- బీజేపీ, డీఎంకే కుట్ర చేస్తున్నాయని ధ్వజం


చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం రాజకీయ ఎత్తులతో విలవిల్లాడిన అన్నాడీఎంకే తాత్కా లిక ప్రధాన కార్యదర్శి శశికళ సోమవారం నుంచి దూకుడు పెంచారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యేల శిబిరంలో పన్నీర్‌సెల్వం, కేంద్రం, గవర్నర్‌ మీద పరోక్ష దాడి చేసిన ఆమె సోమ వారం బీజేపీ, డీఎంకే మీద నేరుగా దాడికి దిగారు. తాను వెయ్యిమంది పన్నీర్‌ సెల్వా లను చూశానని, తన వల్లే ఆయన మూడోసారి సీఎం అయ్యారని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. పన్నీర్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కేడర్‌లో మద్దతు లభించడంతో సోమ వారం నుంచి ఆమె కూడా జనంలోకి వెళ్లారు.

పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మీదకు వచ్చి తన కోసం వచ్చిన మహిళలు, చిన్నారులతో కరచాలనం చేసి ఆప్యాయంగా పలకరించారు. కువత్తూరులోని ఎమ్మెల్యేల శిబి రానికి వెళుతూ, మార్గమధ్యంలోని పనయార్‌ వద్ద ఆటోడ్రైవర్‌ అభివాదం చేయడంతో కారు దిగి అతన్ని పలకరించారు. ఆ మార్గంలో వస్తున్న చిన్నారుల్ని పలకరించి కారులో ఉన్న చాక్లెట్లు ఇచ్చి ‘నేను శశికళ.. చిన్నమ్మ, మీ పేరేంది?’ అని వారితో కొద్దిసేపు మాట్లాడారు. కువత్తూరు గ్రామంలో గుడిసెల్లోకి వెళ్లి  వారి సమస్యలు అడిగి తెలుసుకుని సహాయం చేస్తా నని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు మద్దతుగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయించడం, పెద్ద ఎత్తున వాల్‌ పోస్టర్లు ప్రదర్శించడం, సామాజిక మీడియాను వాడుకోవడం కోసం 10 వేల మందిని ఆమె రంగంలోకి దించారు. పన్నీర్‌ బీజేపీ చెప్పినట్లు వింటున్నారనే విస్తృత ప్రచారం ద్వారా తమి ళుల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శని, ఆదివారాల్లో జనం కనిపించని పోయెస్‌ గార్డెన్‌కు సోమవారం భారీగా ప్రజలు తరలి వచ్చారు.

ద్విముఖ వ్యూహం
శశికళ ఒక వైపు ప్రజల మద్దతు కూడగడుతూనే మరోవైపు కేంద్రం, గవర్నర్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. గవర్నర్‌కు వ్యతి రేకంగా న్యాయపోరాటం చేయడానికి ఉన్న అవకాశాలపై సోమవారం ఉదయం తన నివా సంలో న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్యులతో చర్చించారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి నుంచి పరోక్ష సహకారం తీసుకునే అంశంపై చర్చలు జరిపారు. అదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం సుప్రీం తీర్పు వెలువడితే ఎలా స్పందించాలనేదానిపై చర్చిం చారు. ఢిల్లీలో రాష్ట్రపతి, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ కోసం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, శశికళ భర్త నటరాజన్‌ లాబీయింగ్‌ చేస్తున్నారు.

వెయ్యిమంది పన్నీర్‌లను చూశా
‘అమ్మతో కలసి నడిచిన 33 ఏళ్లలో నేను వెయ్యిమంది పన్నీర్‌సెల్వాలను చూశాను. కేవలం నా దయతోనే ఆయన మూడోసారి సీఎం అయ్యారు. కృతఘ్నుడిగా మారి పార్టీని చీల్చేందుకు కుట్ర చేస్తున్నారు’ అని శశికళ పన్నీర్‌సెల్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మధ్యాహ్నం పోయెస్‌ గార్డెన్‌లో రోడ్డు మీద తన కోసం ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ఆమె మాట్లా డారు. అమ్మ ఆసుపత్రిలో కన్ను మూసిన విషయం రాత్రి 12 గంటలకు తనకు తెలిసిం దనీ, ఆ సమయంలో ప్రత్యర్థులు (డీఎంకే) రాజకీయ కుట్రలు చేయకుండా పార్టీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో తానే పన్నీర్‌ సెల్వంతో రాత్రికి రాత్రి ప్రమాణ స్వీకారం చేయించే ఏర్పాట్లు చేశానని చెప్పారు. తనకు సీఎం కావాలని ఉంటే ఆ రోజు రాత్రే అయ్యే దాన్నని చెప్పారు.

పన్నీర్‌ పార్టీకి ద్రోహం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని తెలిశాకే, పార్టీని కాపాడు కోవడం కోసమే తాను సీఎం పదవి చేపట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. పార్టీ కోసం తాను, తనతోపాటు 129 మంది ఎమ్మెల్యేలు చావడానికైనా సిద్ధ మని ఉద్వేగంగా చెప్పారు. బీజేపీ, డీఎంకే పార్టీలు అన్నాడీఎంకేని చీల్చడానికి కుట్ర చేస్తు న్నాయన్నారు. తాను ఎవరికీ భయపడనని, కేసులకు ప్రభుత్వ ఏర్పాటుకు ఏమి సంబంధ మని ప్రశ్నించారు. గవర్నర్‌ వెంటనే తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శశికళ డిమాండ్‌ చేశారు. ఎంజీఆర్‌ శవయాత్ర సమ యంలో జయలలిత మీద దాడి చేస్తే ఆమెను తానే ఇంటికి తీసుకుని వచ్చానన్నారు.

రాత్రి రిసార్ట్‌లోనే శశికళ బస: ఈ రోజంతా నేను కూడా మీతోనే ఉంటా... రేపు మనమంతా కలసి ఎక్కడి పోవాలో అక్కడికి పోదామని శశికళ తన శిబిరంలోని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కువత్తూర్‌లోని శిబిరానికి చేరుకున్న ఆమె ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లా డారు. తాము అధికారంలోకి రాగానే అమ్మ సమాధి వద్ద ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయి లో ఆమె స్మారక భవనం నిర్మిస్తామన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చెన్నై నగరంలోని రామాపురంతోట సమీపంలో ఎంజీఆర్‌ ఆర్చి నిర్మిస్తామని తెలిపారు. ఆ తర్వాత శాసన సభ్యులతో విడివిడిగా మాట్లాడి, అ«ధికారంలోకి రాగానే సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.    

పన్నీర్‌ బిజీ బిజీ
రాజకీయ సంక్షోభాన్ని తనకు అనువుగా మార్చుకుని ప్రజల్లో విపరీతమైన మద్దతు సంపాదించిన సెల్వం సోమవారం మరో ఎత్తుగడ వేశారు. తనకు రాజకీయాల కంటే ప్రజా అవసరాలు, ప్రజాసేవే ముఖ్యమని ప్రకటించి, సీఎం పదవికి రాజీనామా చేశాక తొలిసారి సచివాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శు లతో పెండింగ్‌ ఫైళ్లు, ప్రజా సమస్యలపై సమీక్షలు జరిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి సీఎస్, డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శితో సమీక్ష జరి పారు. తనకు మద్దతు తెలిపిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పన్నీర్‌ ప్రజలకు వాయిస్‌ మెసేజ్‌లు పంపారు.

మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి..
 

 

Advertisement
Advertisement