స్టేటస్‌ ఫైట్‌: బాబుపై భగ్గుమంటున్న నెటిజన్లు | netizens fire on chandrababu govt | Sakshi
Sakshi News home page

స్టేటస్‌ ఫైట్‌: బాబుపై భగ్గుమంటున్న నెటిజన్లు

Jan 26 2017 9:50 AM | Updated on Mar 28 2019 5:27 PM

స్టేటస్‌ ఫైట్‌: బాబుపై భగ్గుమంటున్న నెటిజన్లు - Sakshi

స్టేటస్‌ ఫైట్‌: బాబుపై భగ్గుమంటున్న నెటిజన్లు

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమైన హక్కు.. ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం.. ప్రత్యేక హోదా..

వైజాగ్‌: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమైన హక్కు.. ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం.. ప్రత్యేక హోదా. ఆ హక్కును నినదించేందుకు, తమ ఆకాంక్షను చాటేందుకు వైఎస్‌ఆర్‌సీపీ, యువత, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు అతి చేస్తుండటంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.

హోదా నిరసన కేంద్రమైన వైజాగ్‌లో 144 సెక్షన్‌ విధించి.. పోలీసులను మోహరించి.. అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండటం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రూరమైన అరెస్టులతో ఏం సాధిస్తారు చంద్రబాబు.. ఓటు వేసినందుకు కాటు వేస్తారా? అని మండిపడుతున్నారు. 68 ఏళ్ల గణతంత్ర రాజ్యం లో మన హక్కుల కోసం పోరాడే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై, పోలీసుల ఓవరాక్షన్‌పై ఫైర్‌ అవుతూ.. నెటిజన్లు ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వారి ఆగ్రహం ఇది..

Advertisement
 
Advertisement
Advertisement