రోజుకు రూ. 10 లక్షల రేటు తగ్గిపోతోంది: నారాయణ | land rates are diminishing 10 lakhs per day, says minister narayana | Sakshi
Sakshi News home page

రోజుకు రూ. 10 లక్షల రేటు తగ్గిపోతోంది: నారాయణ

Apr 14 2015 10:28 AM | Updated on Aug 18 2018 5:48 PM

రోజుకు రూ. 10 లక్షల రేటు తగ్గిపోతోంది: నారాయణ - Sakshi

రోజుకు రూ. 10 లక్షల రేటు తగ్గిపోతోంది: నారాయణ

ప్రతిపక్షాల ఆరోపణల కారణంగా రాజధాని ప్రాంతంలో పొలాల రేట్లు రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున తగ్గిపోతున్నాయని మంత్రి నారాయణ అన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పొలాల రేట్లు రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున తగ్గిపోతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న పొలాలను అమ్ముకుంటే.. ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఎవరికీ రావని ఆయన చెప్పారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం మగులూరులో పొలం చదును కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణల కారణంగా పొలాల రేట్లు రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున తగ్గిపోతున్నాయని ఆయన అన్నారు. రాజధాని భూముల్లో 9.2 ఫారాలు ఇచ్చినవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారని నారాయణ చెప్పారు. వారిని కావాలనే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement